Tag Archives: interesting comments

Radha: ఆ పాటకు చిరుతో డాన్స్ చేయాలంటే కష్టంగా అనిపించింది: రాధా

Radha: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రాధా ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి రాధ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే బుల్లితెరపై నీతోనే డాన్స్ కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి రాధా ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. మీ మొదటి సినిమా చిరంజీవి గారితో ఏది అనే ప్రశ్న ఆలీ అడగడంతో రాధా సమాధానం చెబుతూ చిరంజీవి గారితో కలిసి గుండా అనే సినిమాలో మొదటిసారి నటించానని తెలిపారు.

నిజాయితీపరులు..

ఇక ఆయనతోపాటు నేను సమానంగా డాన్స్ చేసేదాన్ని నిర్మాతల డబ్బు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే సింగిల్ టేక్ లో ఎలాంటి స్టెప్స్ అయినా కూడా చేసేస్తానని తెలిపారు. కానీ యముడికి మొగుడు సినిమాలో అందం హిందోళం అధరం తాంబూలం పాటకి మాత్రం చిరంజీవితో పాటు డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించినట్లు రాధ గుర్తు చేసుకుంది. చిరంజీవి మంచివారు మాత్రమే కాదు నిజాయితీపరులు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ డ్యాన్స్ విషయంలో పోటీ ఉండేదని ఆ పోటీ ఉన్నప్పుడే సినిమా కూడా అద్భుతంగా వస్తుందంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Prabhas: ప్రభాస్ కి తన లెవెల్ ఏంటో తెలీదు.. పృథ్వీ రాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!

Prabhas: ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర తర్వాత అదే స్థాయిలో హైలైట్ అయిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది వరదరాజ మన్నార్ పాత్ర అని చెప్పాలి.

ఈ పాత్రలో నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించారు.ఈ సినిమాలో వీరిద్దరూ కూడా రానా స్నేహితులుగా కనిపించి సందడి చేశారు. అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరూ నిజ జీవితంలో కూడా అదే స్నేహ బంధంతో కొనసాగుతున్నారు ఇక వీరి మధ్య ఏర్పడినటువంటి ఈ స్నేహం గురించి పృథ్వీ రాజ్ పలు సందర్భాలలో వెల్లడించారు.

ఇకపోతే ఈయన నటించిన ఆడు జీవితం అనే సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మరోసారి ప్రభాస్ తో తనకు ఉన్నటువంటి స్నేహబంధం గురించి తెలియజేశారు. తనకు సలార్ సినిమా చేసిన తర్వాతనే ప్రభాస్ తో మంచి స్నేహబంధం ఏర్పడిందని ఈయన తెలియజేశారు.

స్నేహం చేయకుండా ఉండలేరు..
తాను ఒక విషయాన్ని కచ్చితంగా చెప్పగలను ప్రభాస్ గురించి తెలిసిన వారు ఆయనతో స్నేహం చేయకుండా ఉండటం అసాధ్యమని తెలియజేశారు. ఇక ప్రభాస్ నుంచి నేను నేర్చుకున్నది ఏదైనా ఉంది అంటే దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్స్ లో ప్రభాస్ ఒకరు. కానీ ఆయన మాత్రం ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరని, నిజానికి తన లెవెల్ ఏంటి అనేది ప్రభాస్ కి ఏమాత్రం తెలియదు అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ మంచితనం గురించి పృథ్వీ రాజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Niharika: నాకు పిల్లలను కనాలని ఉంది.. రెండో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిహారిక?

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గారు నటిగా నిర్మాతగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి నిహారిక ఇదివరకే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని కుటుంబ సభ్యుల సమక్షంలో కుటుంబ సభ్యుల సలహా మేరకు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే నిహారిక పెళ్లి చేసుకున్న తర్వాత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయారని చెప్పాలి. పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకి తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా ఉంటూ కెరియర్ పై ఫోకస్ పెట్టారు.

ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి నిహారిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె రెండో పెళ్లి గురించి అలాగే విడాకుల గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి నాకు పిల్లలంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా నిహారిక వెల్లడించారు.

పిల్లలంటే ఎంతో ఇష్టం..
ఇలా పిల్లలంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి తనకు కూడా పిల్లలను కనాలని ఉంది అంటూ ఈమె కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఇలా పిల్లలు కావాలని కోరుకుంటున్నారు అంటే ఈమె రెండో పెళ్లి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తన మనసులో ఉన్నటువంటి మాటలను చెప్పకనే చెప్పేశారు. ఇలా పిల్లల విషయంలో నిహారిక ఇలాంటి కామెంట్స్ చేయడంతో పలువురు ఈమె కామెంట్ లపై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Ananya Nagalla: హద్దులు దాటడం కూడా నటనలో భాగమే.. బోల్డ్ కామెంట్స్ చేసిన అనన్య నాగళ్ళ!

Ananya Nagalla: అనన్య నాగలా పరిచయం అవసరం లేని పేరు మల్లేశం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి అనంతరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె తంత్ర పొట్టేలు వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా తంత్ర సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో ఈమె కాస్త రొమాంటిక్ బోల్డ్ సన్నివేశాలలో కనిపించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు ఈ విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. పొట్టేలులో మాదిరిగానే .. తంత్రలోనూ ముద్దు సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయా అన్న ప్రశ్నకు అనన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

కథ అవసరం అయితే తాను బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి కూడా సిద్ధమని ఈమె చెప్పకనే చెప్పేశారు. సంక్రాంతి సినిమాలో కూడా రొమాంటిక్ బోల్డ్ హర్రర్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఉన్నాయని తెలియజేశారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనిషి ఆలోచన విధానం మారుతుందని అందుకు అనుగుణంగానే మనం ముందుకు వెళ్లాలని తెలియజేశారు.

మనుషుల ఆలోచన మారుతుంది..
ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో నేను ఒకటే ఆలోచించాను. ఎలాంటి బోల్డ్ సన్నివేశాలలో నటించకుండా కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేయాలి అనుకున్నాను. అయితే సినిమాలలోకి వచ్చిన తర్వాత నేను చేసిన ఆలోచన విధానం తప్పని తెలుసుకున్నాను అందుకే కథ డిమాండ్ చేస్తే సన్నివేశాలలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, ఇది కూడా నటనలో భాగం అంటూ ఈ సందర్భంగా అనన్య నాగల చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Allu Arjun: అల్లు అర్జున్ కథ వినాలంటే ఆయన ఉండాల్సిందే.. బన్నీ వాసు కామెంట్స్ వైరల్!

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలను పొందారు. అల్లు ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను పొందిన విషయం మనకు తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ మరింత గుర్తింపు పొందారు.

ఇదిలా ఉండగా తాజాగా బన్నీ వాసు అల్లు అర్జున్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. లావణ్య విరాన్(వంశీ ) జంటగా ముఖ్య గమనిక అనే సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఇటీవల జరిగింది.ఈ కార్యక్రమానికి బన్నీ వాసు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన విరాన్ అల్లు అర్జున్ మధ్య ఉన్నటువంటి బంధం గురించి తెలిపారు.

వంశీ చాలా సంవత్సరాల నుంచి మా దగ్గరే ఉంటున్నారు ఈయన చిన్నప్పటినుంచి గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే పనిచేస్తూ వచ్చారని వంశీ అంటే అల్లు అర్జున్ కు చాలా ఇష్టమని తెలిపారు. ఇక ఎవరైనా ఏదైనా కథ చెప్పడానికి వస్తే ఈరోజు మనతో పాటు ఎవరెవరు కథ వింటున్నారని తెలుసుకుని వంశీని కూడా పిలవండి అంటూ అల్లు అర్జున్ తనని పిలిపించుకొని మరి కథ వినిపిస్తారు.

కథ చెప్పేటప్పుడు వంశీ ఉండాల్సిందే…

వంశీ కథ మొత్తం విన్న తర్వాత తన నిర్ణయాన్ని చాలా సింపుల్ గా చెప్పేస్తారని బన్నీ వాసు తెలిపారు. వంశి అంటే అల్లు అర్జున్ కి చాలా ఇష్టం ఇందాక నేను ఈవెంట్ కి వచ్చే సమయంలో కూడా ఎక్కడున్నావంటూ నాకు ఫోన్ చేశారు ఇలా వంశీ సినిమా ఈవెంట్ కి వెళ్తున్నాను అని చెప్పగా థాంక్యూ మా వంశీని చాలా సపోర్ట్ చేస్తున్నందుకు అంటూ బన్నీ నాతో చెప్పారని వంశి అంటే ఆయనకు అంత ఇష్టం అంటూ బన్నీ వాసు ఈ సందర్భంగా తెలిపారు.

Nagarjuna: ఆ సమయంలో నా మాటలు ఎవరు నమ్మలేదు.. పిచ్చెక్కినట్లు చూశారు.. నాగార్జున కామెంట్స్ వైరల్?

Nagarjuna: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా నటించిన చిత్రం నా సామిరంగ. మలయాళంలో సూపర్ హిట్ అయిన పొరింజు మరియమ్ జోస్ అనే చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలె జనవరి 14న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల అయ్యింది. సంక్రాంతి పండగకి తగ్గట్లుగానే ఆ వైబ్ కనిపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ప్రణాళికతో రిలీజ్ చేశారు. కీరవాణి సంగీతం, నాగార్జున మాస్ గెటప్, అల్లరి నరేశ్, హీరోయిన్ ఆషిక రంగనాథ్ నా సామిరంగ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలవడానికి కారణాలు అని చెప్పవచ్చు.

అయితే భారీ విజయాన్ని అందుకోకపోయినప్పటికీ ఈ సినిమా పరవాలేదు అనిపించింది. ప్రస్తుతం ఈ చిత్రం బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. 38 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఈ సందర్భంగా తాజాగా నా సామిరంగ చిత్ర యూనిట్ తాజాగా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ. అక్కినేని అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు చాలా లేట్ గా కంఫర్మ్ చేశాము. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాకు సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు. చిత్ర యూనిట్ ని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. సినిమా రిలీజ్ టార్గెట్ తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎవరూ ఒత్తిడి ఫీల్ అవకుండా నవ్వు ముఖాలతోనే పని చేశారు అని తెలిపారు నాగార్జున.

ఆ మాటలకు ఆశ్చర్యపోయారు..

నాన్నగారి పుట్టినరోజు సెప్టెంబర్ 20న ఈ చిత్రాన్ని లాంచ్ చేసాము. ఒకవైపు నాన్నగారి స్టాచ్యూ ఆవిష్కరణ జరుగుతోంది. అప్పటి వరకు ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తున్నట్లు నా ఫ్యామిలీకి కూడా తెలియదు. ఎక్కడికి వెళుతున్నారు అని అమల అడిగింది. ఇలా మూవీ లాంచ్ ఉంది వెళ్ళాలి అని చెప్పాను. ఇలా స్టాచ్యూ లాంచ్ జరుగుతోంది కదా కాస్త ఆలస్యంగా వెళ్ళండి అని చెప్పింది. లేదు నేను వెళ్ళాలి.. ఎందుకంటే ఈ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాలని అని చెప్పాను. అప్పడు అమల పిల్లలు చైతు, అఖిల్ నాకు పిచ్చిపట్టినట్లు చూశారు. ఎవ్వరూ నమ్మలేదు. మూడు నెలల టైం కూడా లేదు ఎలా రిలీజ్ చేస్తారు అని ఆశ్చర్యపోయారు. కానీ నా టీం మాత్రం నమ్మింది. అనుకున్న టైంకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాం అని నాగార్జున తెలిపారు. కీరవాణి గారు కూడా ఒక టైం టేబుల్ వేసుకుని ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు అని అని చెప్పుకొచ్చారు హీరో నాగార్జున. ఈ సందర్భంగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Meenakshi Chaudhary: కిస్ సీన్స్ విషయంలో అలాంటి రూల్స్ పెట్టుకున్నాను : మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు కూడా ఒకటి. ఈ అమ్మడి పేరు ఈ మధ్యకాలంలో బాగానే వినిపిస్తుంది. కెరీర్ స్టార్టింగ్ లో అంతగా అవకాశాలు అందుకోలేకపోయిన మీనాక్షి ఇప్పుడు మంచి ఆఫర్స్ అందుకుంటుంది. మొదట ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది మీనాక్షి. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మీనాక్షికి మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమాతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

తన నటనతో గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో మీనాక్షి పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. డైరెక్టర్ కొద్దిసేపు ఉన్నప్పటికీ మంచి మార్కులే కొట్టేసింది. గుంటూరు కారం సినిమా కు ముందు సినిమా తరువాత ఈమె పేరు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. మహేష్ బాబుతో సినిమా అనగానే నేను చాలా సంతోషించాను.

అలాంటి సీన్స్ అస్సలు చేయను..

మొదటి రోజే మహేష్ బాబు గారితో షూట్ చేశాను. అయితే మొదట్లో కంగారు పడ్డాను. అప్పుడు మహేష్ గారు నువ్వు టెన్షన్ పడకు. కాస్త టైం తీసుకొని రిలాక్స్ అవ్వు అని దైర్యం చెప్పారు. అలా ఆయన మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి అని చెప్పకు వచ్చింది మీనాక్షి చౌదరి. అలాగే నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. మరి ముఖ్యంగా సినిమాలో కిస్ సీన్స్ విషయంలో నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేస్తే తప్ప ముద్దు సీన్స్‌కు ఒప్పుకోను. మరీ అసభ్యకరంగా ఉంటే అలాంటి సీన్స్ అస్సలు చేయను. తెలుగు ఆడియన్స్ నా పై చాలా ప్రేమ చూపిస్తున్నారు. రెమ్యునరేషన్ కంటే నటనకే ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తాను అని చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. అయితే గుంటూరు కారం సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు రెండు మూడు అవకాశాలు వచ్చినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ముందు ముందు అయినా ఈ ముద్దుగుమ్మకు తెలుగు దర్శకులు అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరి.

Chiranjeevi : ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి.. అవే నన్ను నా ఫ్యామిలీ ని కాపాడాయంటూ?

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా చిరంజీవి ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేశారు. తాజాగా విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్య తిథి, ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్నార్ గార్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎన్టీఆర్ తో జరిగిన ఒక సంఘటనని, ఆయన ఇచ్చిన ఒక సలహాని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నేను కెరీర్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్నాను. ఒక రోజు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లినప్పుడు రండి బ్రదర్ కూర్చోండి అన్నారు. భయం భయంగా కూర్చున్నాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు.

ఎన్టీఆర్ మాటలకు నా మనసు మార్చుకున్నాను..

మీరు సంపాదించిన డబ్బు అంతా ఇనుప ముక్కలు మీద పెట్టొద్దు, ఏదైనా మంచి ఇల్లు కట్టుకోండి. స్థలాల మీద పెట్టుకోండి మనల్ని కాపాడేది అదే అన్నారు. మనం ఎక్కువ కాలం ఇలాగే స్టార్ డమ్ తో ఉంటామని అనుకోకండి అని ఎంతో ముందుచూపుతో చెప్పారు. అప్పటిదాకా నేను మంచి కారు కొనుక్కుందామా, అప్పట్లో వచ్చే స్టైలిష్ టయోటా కారు కొనుక్కుందాం అనుకున్నాను. ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత ఆ కార్ కొనడం ఆపేసి అక్కడక్కడా స్థలాలు కొనడం మొదలుపెట్టాను ఈ రోజు నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను, నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి అని తెలిపారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదెక్కడి పైత్యంరా బాబు.. చనిపోయిన వారిని కూడా వదలట్లేదుగా వర్మ..!

టాలీవుడ్ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 30 సాయంత్రం 4:07 గంటలకు తుది శ్వాస విడిచారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) అతని కుటుంబానికి తన సానుభూతిని తెలియజేసారు. అంతే కాకుండా సిరివెన్నెలతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. దీనిపై అతడు ప్యాడ్‌కాస్ట్ రూపంలో రెండు ఆడియో క్లిప్స్‌ను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

షేర్ చేసిన ఆడియో టేప్‌లో.. ఆర్జీవీ తన శివ సినిమాలోని పాటలకు సిరివెన్నెల సాహిత్యం రాశారని చెప్పారు. సిరివెన్నెల రాసిన .. ‘సాహసమే నా దారి రాజసం నా రథాన్ని ఆపడం సాధ్యమేనా’ అన్న మాటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాటలోని పదాలే నా ప్రాణం. ఇంత అద్భుతమైన మాటలు రాయడం వల్ల.. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిన మీరు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు.

దుఃఖంతో సిరివెన్నెల దర్శనమిస్తే స్వర్గంలో కలిసి అమృతం తాగాలని కోరాడు. ఒక వేళ అక్కడ వాట్సాప్ లాంటివి ఉంటే.. అమృతం ఎలా ఉందో వాట్సాప్ చేయండంటూ కోరారు. అంతే కాకుండా.. అక్కడ రంభ, ఊర్వశి, మేనకలు ఎలా ఉన్నారో చెబితే తాను సంతోషిస్తానన్నాడు. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో ఉన్నాను.. మీరు స్వర్గం లో ఉన్నారు అంతే తేడా అన్నారు వర్మ.

ఇక అతడు షేర్ చేసిన ఆ ఆడియో టేప్ లో.. తెలివి ఉన్నవాడు ఎవడైనా స్వర్గంలోకే వెళ్తాడని.. మీరు స్వర్గానికి వెళ్లినందుకు తనకు హ్యాపీగా ఉందంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే తరాలకు సిరివెన్నెల స్ఫూర్తి అని ఆర్జీవీ కొనియాడాడు. అయితే వర్మ పోస్ట్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. నీ క్రియేటివిటీకి దండరా సామి అంటూ కొందరు దండుకుంటున్నారు.

సూర్య అలాంటి వ్యక్తి..అందుకే అనుక్షణం నాకు టెన్షన్: జ్యోతిక

హీరో సూర్య తమిళ అగ్రహీరోలలో ఒకరు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సూర్య జ్యోతిక వీరిద్దరూ రీల్ అండ్ రియల్ లైఫ్ హిట్ పెయిర్ లలో ఒకరు. వీరిద్దరూ కలిసి చాలా చిత్రాల్లో నటించారు. ఆమె ఒక స్టార్ హీరో భార్య అలాగే ఇద్దరు పిల్లల తల్లి, వచ్చిన స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకొని నటిస్తున్న బెస్ట్ ఆర్టిస్ట్. ఈమె 2ఢీ ఎంటర్టైన్మెంట్స్ కి బాస్ లేడీ కూడా.

ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న జ్యోతిక గురించి, ఆమె భర్త గురించి, సౌత్ సినిమాల గురించి జ్యోతిక మనసులోని మాటలు తెలుసుకుందాం.. కొత్త ఎక్స్ పెరిమెంట్ చేసిన ప్రతిసారి చాలా టెన్షన్ ఉంటుంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్లు మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇలాంటి ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. అన్నీ కూడా టెన్షన్ పడాల్సిన విషయాలే. కానీ అలాంటివన్నీ చూసినప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం అంటుంది జ్యోతిక.

ప్రస్తుతం సూర్య,నేను సమాజంతో పాటు నడుస్తూ ఉన్నాం. థియేటర్లలో చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. అసలు బిగ్ స్క్రీన్ కి అతీతంగా చెప్పే కథలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని ఓటిటిలో చూడవచ్చు. ప్రస్తుతం ఓటీటీ, థియేటర్ అనేవి సేమ్ సైడ్ ఆఫ్ మేజ్ అన్నట్టు మారిపోయాయి అని అంటోంది

తన భర్త గురించి ఆమె ఈ విధంగా అంటోంది. సూర్య చాలా రొమాంటిక్ భర్త. పిల్లలను, నన్ను బాగా చూసుకుంటాడు. ప్రొడక్షన్ హౌస్ లో నా భాగస్వామ్యాన్ని ఎంకరేజ్ చేస్తారు. అంతే కాకుండా నాకు నచ్చిన సినిమాలు ఎంకరేజ్ చేస్తారు. భార్య మాటకు విలువ ఇస్తారు. ఉదయాన్నే కూర్చుని కాఫీ తాగడానికి ఇష్టపడతాం. ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. అందుకే ఎంతోమంది అమ్మాయిలు మా ఆయన్ని ఇష్టపడుతుంటారని ఆమె తెలిపింది. అంతమంది లేడీస్ ఫాలో అవుతున్నారు అని నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువ సరదాగా తెలిపింది.