Meenakshi Chaudhary: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు కూడా ఒకటి. ఈ అమ్మడి పేరు ఈ మధ్యకాలంలో బాగానే వినిపిస్తుంది. కెరీర్ స్టార్టింగ్ లో అంతగా అవకాశాలు అందుకోలేకపోయిన మీనాక్షి ఇప్పుడు మంచి ఆఫర్స్ అందుకుంటుంది. మొదట ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది మీనాక్షి. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మీనాక్షికి మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమాతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
తన నటనతో గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో మీనాక్షి పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. డైరెక్టర్ కొద్దిసేపు ఉన్నప్పటికీ మంచి మార్కులే కొట్టేసింది. గుంటూరు కారం సినిమా కు ముందు సినిమా తరువాత ఈమె పేరు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. మహేష్ బాబుతో సినిమా అనగానే నేను చాలా సంతోషించాను.
అలాంటి సీన్స్ అస్సలు చేయను..
మొదటి రోజే మహేష్ బాబు గారితో షూట్ చేశాను. అయితే మొదట్లో కంగారు పడ్డాను. అప్పుడు మహేష్ గారు నువ్వు టెన్షన్ పడకు. కాస్త టైం తీసుకొని రిలాక్స్ అవ్వు అని దైర్యం చెప్పారు. అలా ఆయన మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి అని చెప్పకు వచ్చింది మీనాక్షి చౌదరి. అలాగే నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. మరి ముఖ్యంగా సినిమాలో కిస్ సీన్స్ విషయంలో నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే తప్ప ముద్దు సీన్స్‌కు ఒప్పుకోను. మరీ అసభ్యకరంగా ఉంటే అలాంటి సీన్స్ అస్సలు చేయను. తెలుగు ఆడియన్స్ నా పై చాలా ప్రేమ చూపిస్తున్నారు. రెమ్యునరేషన్ కంటే నటనకే ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తాను అని చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. అయితే గుంటూరు కారం సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు రెండు మూడు అవకాశాలు వచ్చినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ముందు ముందు అయినా ఈ ముద్దుగుమ్మకు తెలుగు దర్శకులు అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…