Movie News

Karan Johar: సౌత్ స్టార్ తో సినిమా చేయబోతున్న కరణ్ జోహార్.. నెట్టింట ట్వీట్ వైరల్?

Karan Johar: బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలీవుడ్ లో పలు సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, లవ్ స్టోరీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అలాగే అడియన్స్ కు కావాల్సిన సినిమాలను అందించడంలో ముందుంటారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ లాంటి షోల ద్వారా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలకు ఎక్కువగా వల్గర్ బోల్డ్ ప్రశ్నలు వేస్తూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు.

ఎక్కువ శాతం ఈయన బోల్డ్ విషయాలలోనే సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు. కాగా ఇక గత ఏడాది రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమాతో మరో హిట్ అందుకున్నారు కరణ్ జోహార్. రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ ప్రేథ కథ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇక ఇప్పుడు కొత్త ఏడాది మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు కరణ్. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని కూడా రాసుకొచ్చారు. ఆ పోస్టులో తాను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టు గురించి తెలిపారు. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అన్న విషయానికి వస్తే.. ఇది సినిమా ప్రకటన కాదు. కానీ ఇది సహకారంతో మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ సినిమా కోసం గత సంవత్సరం నుండి పని చేస్తున్నాము. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి వివరాలను చివరి వరకు రహస్యంగానే ఉన్నాయి.

ఆ విషయం చిత్ర బృందంకి తెలియదు..

ఈ సినిమాతో తెరంగేట్రం చేయనున్న దర్శకుడి ఉద్దేశం కూడా అదే కావడంతో చిత్రబృందానికి కూడా ఈ విషయం తెలియలేదు అని రాసుకొచ్చారు. అలాగే మరో మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో నటీనటులను అంచనా వేయాలని అభిమానులను కోరాడు. వారిలో ఒకరు సౌత్ సూపర్ స్టార్. ఇటీవల పవర్ ఫుల్ పాన్ ఇండియా సినిమాలో నటించారు. తన టాలెంట్, మోషనల్ ఎనర్జీతో అభిమానులను ఆకట్టుకుంటున్న అభిమాన హీరోయిన్. తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అరంగేట్రం చేస్తున్న నటుడు అతని ప్రతిభ అసాధారణమైనది. తన వృత్తి కోసం చాలా కష్టపడుతున్నాడు. అంటూ రాసుకొచ్చాడు కరణ్. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఆ పోస్టుని చూసిన నెటిజన్స్ సౌత్ సూపర్ హీరో ఎవరు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/C2oxEbjI42d/?utm_source=ig_embed&ig_rid=4f12c8c6-3075-4876-84b1-443e061044b2

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago