Movie News

Kannappa : మంచువిష్ణు కన్నప్ప సెట్స్‌లో ప్రభాస్.. శివుడిగా కనిపించేందుకు అన్ని రోజుల పాటు అలా?

Kannappa: టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి మనందరికీ తెలిసిందే. మంచి విష్ణు ప్రస్తుతం భక్త కన్నప్ప సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా భక్త కన్నప్ప సినిమా మంచు విష్ణు కలల ప్రాజెక్టు అన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు నెలలో ఈ సినిమా శ్రీకాళహస్తిలో గ్రాండ్ గా ప్రారంభమైంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ హిస్టారికల్ సోషియో ఫాంటసీ మూవీలో మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

కాగా ఈ చిత్రంలో డార్లింగ్ ప్రభాస్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారని సమాచారం. పార్వతి పాత్రలో నయనతార నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ని ఇటీవలే న్యూజిలాండ్ లో పూర్తి చేసుకొని వచ్చారు. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన షాట్స్ ని చిత్రీకరిస్తునట్లు సమాచారం. ఈ క్రమంలోనే కైలాసం లోని శివపార్వతికి సంబంధించిన షాట్స్‌ని, అలాగే క్లైమాక్స్ కి సంబంధించిన సీన్స్ ని చిత్రీకరించడానికి సిద్దమయ్యారట.

శివుడిగా కనిపించబోతున్న ప్రభాస్..

దీంతో శివుడిగా తన పాత్రని పూర్తి చేయడానికి ప్రభాస్.. ఒక మూడు రోజుల కాల్ షీట్స్ ని ఇచ్చారట. ఫిబ్రవరి 17-19 తేదీలలో ప్రభాస్ ఈ మూవీ సెట్స్ లో పాల్గొని తనకి సంబంధించిన సన్నివేశాలని పూర్తి చేయబోతున్నారట. మరి అందరూ అనుకుంటున్నట్లు ప్రభాస్ నిజంగానే శివుడి పాత్రలో కనిపించబోతున్నారా అనేది చూడాలి. మరి కాగా ఈ సినిమాలో మంచు విష్ణుకి హీరోయిన్ గా ప్రీతీ ముఖుంధన్ నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే గతంలో ప్రభాస్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు విష్ణు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఎలాంటి పాత్రలో నటిస్తాడు అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు విష్ణు. ఈ సినిమాను దాదాపుగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago