Radha: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రాధా ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి రాధ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే బుల్లితెరపై నీతోనే డాన్స్ కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి రాధా ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. మీ మొదటి సినిమా చిరంజీవి గారితో ఏది అనే ప్రశ్న ఆలీ అడగడంతో రాధా సమాధానం చెబుతూ చిరంజీవి గారితో కలిసి గుండా అనే సినిమాలో మొదటిసారి నటించానని తెలిపారు.
నిజాయితీపరులు..
ఇక ఆయనతోపాటు నేను సమానంగా డాన్స్ చేసేదాన్ని నిర్మాతల డబ్బు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే సింగిల్ టేక్ లో ఎలాంటి స్టెప్స్ అయినా కూడా చేసేస్తానని తెలిపారు. కానీ యముడికి మొగుడు సినిమాలో అందం హిందోళం అధరం తాంబూలం పాటకి మాత్రం చిరంజీవితో పాటు డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించినట్లు రాధ గుర్తు చేసుకుంది. చిరంజీవి మంచివారు మాత్రమే కాదు నిజాయితీపరులు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ డ్యాన్స్ విషయంలో పోటీ ఉండేదని ఆ పోటీ ఉన్నప్పుడే సినిమా కూడా అద్భుతంగా వస్తుందంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…