Tag Archives: irritating

Srikanth: రోజా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్… చిరాకు వచ్చేదంటూ కామెంట్స్!

Srikanth: తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు శ్రీకాంత్ ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్నారు. ఇలా హీరోగా 100కు పైగా సినిమాలలో నటించిన శ్రీకాంత్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.

యంగ్ హీరోలకు బాబాయ్ పాత్రలో నటించడమే కాకుండా కొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీకాంత్ నటి రోజా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా శ్రీకాంత్ ఇద్దరు కూడా ఘటోత్కచుడు, తిరుమల తిరుపతి వెంకటేశ, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి సినిమాలలో నటించారు.ఇలా ఈ సినిమాలలో నటించడంతో వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఏర్పడింది.

సినిమా షూటింగ్లో ఉన్న సమయంలో రోజా మాత్రం తనని ఎప్పుడు అన్నయ్య అంటూ పిలిచేదని శ్రీకాంత్ తెలిపారు. ఇలా రోజా తనని పలకరించిన ప్రతిసారి మాటకు ముందు మాటకు తర్వాత అన్నయ్య అనే పదం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు.ఇక ఇద్దరికీ ఏదైనా ఒక రొమాంటిక్ సీన్ ఉన్నప్పుడు ఆ సీన్ చేసేటప్పుడు కూడా రోజా అన్నయ్య అని పిలుస్తూ ఉండేది.

Srikanth: లొకేషన్లో అన్నయ్య అంటూ పిలిచేది…


ఇలా రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు అన్నయ్య అని పిలవడంతో తనకు చాలా చిరాకు వచ్చి ఎహే ఆపు.. అన్నయ్య అంటే నాకు రొమాంటిక్ మూడ్ రావడం లేదు అంటూ శ్రీకాంత్ ఒకసారి మొహం మీద అనేసాడట. దాంతో రోజాతో పాటు అక్కడున్న వారందరూ నవ్వారని ఈయన తెలిపారు. ఇలా రోజా గురించి శ్రీకాంత్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.