Srikanth: తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు శ్రీకాంత్ ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్నారు. ఇలా హీరోగా 100కు పైగా సినిమాలలో నటించిన శ్రీకాంత్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.
యంగ్ హీరోలకు బాబాయ్ పాత్రలో నటించడమే కాకుండా కొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీకాంత్ నటి రోజా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా శ్రీకాంత్ ఇద్దరు కూడా ఘటోత్కచుడు, తిరుమల తిరుపతి వెంకటేశ, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి సినిమాలలో నటించారు.ఇలా ఈ సినిమాలలో నటించడంతో వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఏర్పడింది.
సినిమా షూటింగ్లో ఉన్న సమయంలో రోజా మాత్రం తనని ఎప్పుడు అన్నయ్య అంటూ పిలిచేదని శ్రీకాంత్ తెలిపారు. ఇలా రోజా తనని పలకరించిన ప్రతిసారి మాటకు ముందు మాటకు తర్వాత అన్నయ్య అనే పదం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు.ఇక ఇద్దరికీ ఏదైనా ఒక రొమాంటిక్ సీన్ ఉన్నప్పుడు ఆ సీన్ చేసేటప్పుడు కూడా రోజా అన్నయ్య అని పిలుస్తూ ఉండేది.
ఇలా రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు అన్నయ్య అని పిలవడంతో తనకు చాలా చిరాకు వచ్చి ఎహే ఆపు.. అన్నయ్య అంటే నాకు రొమాంటిక్ మూడ్ రావడం లేదు అంటూ శ్రీకాంత్ ఒకసారి మొహం మీద అనేసాడట. దాంతో రోజాతో పాటు అక్కడున్న వారందరూ నవ్వారని ఈయన తెలిపారు. ఇలా రోజా గురించి శ్రీకాంత్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…