Tag Archives: janaganamana movie

Puri Jagannadh: అద్దె కట్టలేక ముంబైలో ఫ్లాట్ ఖాళీ చేసిన పూరి.. పూరి అంచనాలను తారుమారు చేసిన లైగర్!

Puri Jagannadh: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ తాజాగా లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా 25 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరి తన అంచనాలన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి..

ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ సంపాదించినది మొత్తం ఖర్చు పెట్టారు. ఇక సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఈ క్రమంలోని ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఈ సినిమా కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి వెనక్కి ఇవ్వాలంటూ పూరి జగన్నాథ్ పై ఒత్తిడి తెస్తున్నారు.

ఇలా ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో నష్టాలలోకి వెళ్లిపోయిన పూరి జగన్నాథ్ ముంబై వదిలి హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా కోసం అలాగే తన తదుపరిచిత్రం జనగణమన సినిమా కోసం పూరి జగన్నాథ్ ఎక్కువగా ముంబైలోనే నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన సి ఫేస్ 4 బిహెచ్ కే ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారట.ఈ ఫ్లాట్ కి నెలకు పది లక్షల చొప్పున అద్దె చెల్లించడమే కాకుండా ఇతరతా ఖర్చులు కలిపి సుమారు 15 లక్షల వరకు ఖర్చులు వస్తున్నట్లు తెలుస్తోంది.

Puri Jagannadh: ఆగిపోయిన జనగణమన….

లైగర్ సినిమా వల్ల భారీ నష్టాలను ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ ముంబైలో నివసిస్తూ నెలకు 10 లక్షల అద్దె కట్టడం అసాధ్యమైన పని కావడంతో ఈయన ముంబైలో తన ఫ్లాట్ కాళీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా లైగర్ సినిమా పూరి జగన్నాథ్ పై భారీ దెబ్బ కొట్టిందని ఇదే సినిమా కనుక హిట్ అయి ఉంటే పూరి జగన్నాథ్ పర్మినెంట్ గా ముంబైలోనే నివసించే వారనీ తెలుస్తోంది. ఇక లైగర్ ఫ్లాప్ కావడంతో జనగణమన సినిమా కూడా ఆగిపోయిందనే సమాచారం వినబడుతుంది.

Vijay Devarakonda: లైగర్ ఫ్లాప్.. నిర్మాతలకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ.. రెమ్యూనరేషన్ వెనక్కిచ్చిన హీరో?

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో పాటు పూరి చార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలయ్యి హిందీ వెర్షన్ లో బాగానే కలెక్షన్స్ రాబట్టినప్పటికీ మిగిలిన అన్ని భాషలలో కలిపి ఈ సినిమా దాదాపు 50 కోట్ల రూపాయల వరకు నష్టాలను చవిచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ నష్టాలను భరించడం కోసం పూరి జగన్నాథ్ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ సైతం ఈ సినిమా లాభాలతో కలిపి ఏకంగా 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు సినిమాలలో వచ్చిన లాభాలను హీరోకి ఇవ్వలేదని అయితే ఆ లాభాలు తనకు వద్దని చెప్పడమే కాకుండా తనకి ఇచ్చిన ఆరు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చారని తెలుస్తుంది.

ఈ విధంగా ఈ సినిమా ద్వారా భారీ నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టు సమాచారం. ఇకపోతే విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని కూడా పూరి జగన్నాథ్ చార్మిలతో కలిసి చేయాల్సి ఉంది.

Vijay Devarakonda: జనగణమన లాభాలలో వాటా..

పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాని కూడా విజయ్ దేవరకొండతో చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన అనంతరం ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే అందులో వచ్చే లాభాలను విజయ్ దేవరకొండ తీసుకోనున్నట్లు వెల్లడించారు.ఇలా సినిమా నష్టపోవడంతో నిర్మాతలకు విజయ్ దేవరకొండ అండగా నిలబడడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ తన తదుపరిచిత్రం ఖుషి, జనగణమన సినిమాలపై దృష్టి పెట్టారు.