Tag Archives: jobs

కోల్‌ ఇండియాలో 588 ఉద్యోగాలు.. చివరి తేదీ..

సంస్థ: కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలకు నోటీఫీకేషన్ జారీ చేయబడింది.
ఉద్యోగం: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు
ఖాళీల సంఖ్య : 588
విభాగాల ఖాళీలు : సివిల్‌-57, ఇండస్ట్రి-యల్‌ ఇంజినీరింగ్‌-15, జియాలజీ-12,మైనింగ్‌-253, ఎలక్ట్రి-కల్‌-117, మెకానికల్‌-134
అర్హత : బీఈ/బీటెక్‌, ఎమ్మెస్సీ/ఎంటెక్‌ సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
గమనిక: ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే విధానం : ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తుకు చివరితేదీ : సెప్టెంబర్‌ 9 వరకు
వెబ్‌సైట్ : https://www.coalindia.in

ఏపీ నుంచి ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. !

ఇటీవల వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (APSSDC) నుంచి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. వివిధ సంస్థలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తూ ఉంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే నేడే చివరి తేదీ. అంటే జూలై 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు.

రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 2న ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. మొత్తం 108 ఖాళీలు ఉండగా అందులో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో 42 ఉన్నాయి. దీనికి పది, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు అర్హులుగా పేర్కొన్నారు. దీనికి పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి అంతే కాకుండా దీనికి ఎంపిక అయిన వారికి నెలకు రూ. 11 వేల నుంచి రూ. 13 వేల వరకు వేతనం ఉంటుందని నోటిఫికేన్లో పేర్కొన్నారు.

డెలివరీ కన్‌సల్టెంట్‌ విభాగంలో 66 ఖాళీలు ఉండగా.. దీనికి కూడా పది, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు దరఖాస్తు చేసుకోవాలి. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి 15 రోజుల పాటు జాబ్ శిక్షణ ఉంటుంది.

ఎంపికైన వారు తప్పనిసరిగా భట్టిప్రోలు, సీతారాం నగర్, చిలకలూరిపేట, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, నిజాంపట్నం, సత్తెనపల్లి, తెనాలి, రేపల్లె, మాచర్ల, వినుకొండ తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వివరాలకు 9182280707 నంబర్ కు సంప్రదించండి. అప్లై చేసుకునే ప్రతీ ఒక్కరికీ టూ వీలర్, డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ ఉండాలని తెలిపారు.

పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

పశ్చిమ మధ్య రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 716 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగాల భర్తీ కొరకు పలు నోటిఫికేషన్లు విడుదల కాగా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. పదో తరగతితో పాటు ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://wcr.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం 716 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు 135, ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 102, వెల్డర్ (ఎలక్ట్రిక్ & గ్యాస్) ఉద్యోగ ఖాళీలు 43, పెయింటర్ (జనరల్) ఉద్యోగ ఖాళీలు 75, మెసన్ ఉద్యోగ ఖాళీలు 61, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలు 73, ప్లంబర్ 58, బ్లాక్ స్మిత్ ఉద్యోగ ఖాళీలు 63, వైర్ మెన్ 50, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 10, మెషినిస్ట్ 5, టర్నర్ 2, ల్యాబ్ అసిస్టెంట్ 2, క్రేన్ అసిస్టెంట్ 2, డ్రాఫ్ట్స్ మేన్ ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి.

2021 సంవత్సరం ఏప్రిల్‌ 1 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నోటిఫికేషన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

పదో తరగతి, ఐటీఐ అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది.

ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఉద్యోగ అవకాశాలు.. ఖాళీల వివరాలు!

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఈ సంస్థల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రిన్సిపల్ మేనేజర్, జాయింట్ డైరెక్టర్, మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ మేనేజర్ లాంటి వివిధ రకాల 38 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దరఖాస్తుల ఆహ్వాన ప్రక్రియ 2021 ఏప్రిల్ 16 నుంచి 2021 మే 15వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

food-safety-and-standards-authority-of-india-released-notification-for-38-posts-

ఈ ఖాళీలకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI అధికారిక వెబ్‌సైట్ https://fssai.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లోనే ఈ ఖాళీలకు దరఖాస్తు చేయాలి. పై తెలిపిన ఉద్యోగాలకు వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ క్లుప్తంగా చదివి సంబంధిత ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి ఈ నోటిఫికేషన్లో తెలియజేసిన చిరునామాకు 2021 మే 31వ తేదీ లోగా చేరాలి. దరఖాస్తు పంపించాల్సిన అడ్రస్:
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Assistant Director (Recruitment),
Human Resource Division,
Room No. 407,
Food Safety and Standard Authority of India,
FDA Bhwan, Kotla Road, New Delhi- 110002.

నిరుద్యోగులకు శుభవార్త… టెన్త్ అర్హతతో ఉద్యోగ అవకాశాలు!

ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(IGCAR) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కేవలం పదో తరగతి అర్హతతో పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.స్టైఫండరీ ట్రైనీ, వర్క్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్(UDC), సెక్యూరిటీ గార్డ్, క్యాంటీన్ అసిస్టెంట్, టెక్నీషియన్ సైంటిఫిక్ ఆఫీసర్, వంటి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 337 పోస్టులు ఖాళీగా ఉండగా వాటిని భర్తీ కోసం ఈనెల 15 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.స్టైఫండరీ ట్రైనీ, టెక్నీషియన్ బీ(క్రేన్ ఆపరేటర్), అప్పర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. స్టైఫండరీ ట్రైనీ, ఉద్యోగాల కొరకు డిప్లమా లేదా బీఎస్సీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 ఉద్యోగాల కొరకు పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి టైపింగ్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ లో ఒక నిమిషానికి 80 పదాలను, హిందీలో ఒక నిమిషానికి 30 పదాలను టైప్ చేసే సామర్థ్యం ఉండాలి. ఇకపోతే అప్పర్ డివిజన్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇంగ్లీష్ లో నిమిషానికి ముప్పై పదాలను టైప్ చేయడంతోపాటు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఇక డ్రైవర్ ఉద్యోగాల అర్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదే విధంగా మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. సెక్యూరిటీ గార్డ్, క్యాంటీన్ అసిస్టెంట్, వర్క్ అసిస్టెంట్ మొదలైనవారు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ఉద్యోగాల కోసం ఈనెల 15వ తేదీ నుంచి మే 14 వరకు అధికారిక వెబ్ సైట్ igcar.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని సూచించింది

రాతపరీక్ష లేకుండా ఏఎండీ కాంప్లెక్స్ లో ఉద్యోగాలు.. రూ.31 వేల వేతనంతో..?

అటామిక్ మిన‌రల్స్ డైరెక్ట‌రేట్ ఫ‌ర్ ఎక్స్‌ప్లొరేష‌న్ అండ్ రిసెర్చ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భార‌త ప్ర‌భుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. మొత్తం 31 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా జనవరి 23వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ మెయిల్ ద్వారా మాత్రమే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

షార్ట్ లిస్టింగ్, ఆన్ లైన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చేపడతారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యార్హత, అనుభవం, ఇతర వివరాలను బట్టి అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 35 ఖాళీలలో ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ (ఫిజిక్స్‌) ఉద్యోగాలు 8, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) ఉద్యోగాలు 10, ప్రాజెక్ట్ అసోసియేట్‌-1 (జియాల‌జీ) ఉద్యోగాలు 17 ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు rectt2019.amd@gov.in ఈ మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు సాఫ్ట్ కాపీతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలను పంపాల్సి ఉంటుంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 2021 సంవత్సరం జనవరి 23వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్‌-1 ఉద్యోగాలకు మాత్రం 27 సంవత్సరాలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

https://amd.gov.in/// వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 31,000 రూపాయలు వేతనంగా పొందే అవకాశం ఉంటుంది. ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 20,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి హెచ్ఆర్ఏ అదనంగా పొందే అవకాశం ఉంటుంది.

నిరుద్యోగులకు హెచ్‌సీఎల్‌ శుభవార్త.. 20,000 ఉద్యోగాల భర్తీ..?

గతేడాది కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆగిపోవడంతో పాటు కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ఉధృతి తగ్గి మారిన పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు కొత్తగా ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించాయి. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ హెచ్‌సీఎల్‌ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాబోయే ఆరు నెలల్లో 20,000 ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనుంది.

హెచ్‌సీఎల్ సీఈవో విజయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీ ఇప్పటికే అతిపెద్ద ఒప్పందాలను కుదుర్చుకున్న నేపథ్యంలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుండటంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో ఇతర కంపెనీలు సైతం కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ భారత్ లోని టాప్ 5 ఐటీ కంపెనీలలో ఒకటి కాగా కొత్త ఏడాదిలో ఈ సంస్థ శుభవార్త చెప్పడంతో ఇతర కంపెనీలు సైతం కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటే అవకాశాలు ఉన్నాయి. నోయిడా కేంద్రంగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ సేవలందిస్తోంది. 2020 సంవత్సరంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ కంపెనీ ఏకంగా 10 బిలియన్‌ డాలర్ల మైలురాయిని చేరుకోవడం గమనార్హం.

రోజురోజుకు డిజిటల్ సేవలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటం కూడా కొత్తగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడానికి కారణమని చెప్పవచ్చు.

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. భారీ వేతనంతో 9,000 ఉద్యోగాల భర్తీ..?

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన ఎర్నెస్ట్ అండ్ యంగ్ సర్వీసెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 2,021 సంవత్సరంలో 9,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి సిద్ధమైనట్టు కీలక ప్రకటన చేసింది. లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి, సాఫ్ట్ వేర్ రంగంపై ఆసక్తి ఉన్న ఫ్రెషర్లకు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఈవై సంస్థ నూతన టెక్నాలజీలకు సంబంధించి ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ కోర్సులకు సంబంధించిన ఉద్యోగాలను ఈ సంస్థ భర్తీ చేయనుంది. ఈసీఈ, సీఎస్సీ, ఐటీ బ్రాంచ్ లలో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు ఈ ఉద్యోగాల భర్తీ వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఎంపికైన అభ్యర్థులకు భారీ మొత్తంలో వేతనం అందనుందని తెలుస్తోంది. ఈవై ఇండియా సంస్థ ప్రతినిధి రోహన్ సచ్ దేవ్ తమ సంస్థతో పని చేస్తున్న క్లయింట్లు కొత్త టెక్నాలజీలను కోరుకుంటున్నారని తెలిపారు.

క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నామని ఆయన తెలిపారు. కొత్త టెక్నాలజీల ద్వారా పని చేసిందుకు సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నామని ఆయన అన్నారు. అవసరాలకు అనుగుణంగా భారీగా ఉద్యోగాల నియామకం చేపట్టడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈవే సంస్థ ఇండియాలోని బ్రాంచ్ లలో దాదాపు 50,000 మంది పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ మొత్తంలో వేతనం లభించనుంది.

ప్రముఖ సంస్థ ఎల్‌ అండ్‌ టీ సైతం 2021 సంవత్సరంలో 1100 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. 90 శాతం ఐఐటీలు, ఎన్‌ఐటీల నుంచి ఈ సంస్థ ఉద్యోగులను నియమించుకోనుందని తెలుస్తోంది.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ‌ నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ కు చెందిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి 31 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్ఎఫ్‌సీఎల్‌ ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండెంట్ గ్రేడ్‌-1 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 12 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

ఐటీఐ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐలో ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. https://www.nationalfertilizers.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 31 ఖాళీలలో మెకానికల్ అభ్యర్థులకు 11, ఎలక్ట్రికల్ అభ్యర్థులకు 12, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అభ్యర్థులకు 8 ఖాళీలు ఉన్నాయి.

30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం వయో సడలింపులు ఉంటాయి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ ద్వారా పరీక్ష నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఆన్ లైన్ పరీక్షలో సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రశ్నలతో పాటు ఆప్టిట్యూడ్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఆన్ లైన్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

నిరుద్యోగులకు ఎస్బీఐ బంపర్ ఆఫర్.. 452 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 452 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎస్బీఐ ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భర్తీ చేయనుంది. డిసెంబర్ 22వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 11వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. https://www.sbi.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ ద్వారా మేనేజ‌ర్ (మార్కెటింగ్‌), మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజ‌ర్స్‌), ప్యూటీ మేనేజ‌ర్ (మార్కెటింగ్‌), అసిస్టెంట్ మేనేజ‌ర్ (సిస్టం), డిప్యూటీ మేనేజ‌ర్ (ఇంట‌ర్న‌ల్ ఆడిట్‌)-28, అసిస్టెంట్ మేనేజ‌ర్ (సెక్యూరిటీ అన‌లిస్ట్), ఇతర ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఎస్బీఐ నోటిఫికేషన్ లో వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఒక అభ్యర్థి ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ఉద్యోగాలకు అర్హత, అనుభవాన్ని బట్టి వేతనం లభిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ఎస్బీఐ ఈ సంవత్సరం ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తోంది.