Tag Archives: K Raghavendra Rao

Anushka: అనుష్కని ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఏమైందంటే?

Anushka: టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి పూరి జగన్నాథ్ నాగార్జున కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా ద్వారా హీరోయిన్గా అవకాశం అందుకున్నటువంటి అనుష్క అనంతరం పలు సినిమాలలో నటించారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు మంచి సక్సెస్ కావడంతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.

ఇలా లేడి ఓరియెంటెడ్ సినిమాలు కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా కొన్ని ప్రయోగాత్మక సినిమాలలో కూడా అనుష్క నటించి మెప్పించారు. ఇక బాహుబలి సినిమా ద్వారా హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఈమె మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఇదిలా ఉండగా అనుష్కకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుష్కను ఒక టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తన ఇంటి కోడలిని చేసుకోవడం కోసం ఎంతో కష్టపడ్డారట. అయితే అనుష్క మాత్రం అందుకు నో అంటూ ఆయన ఆశలపై నీళ్లు చల్లారని తెలుస్తోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ కే రాఘవేంద్రరావు తన పెద్ద కుమారుడు ప్రకాష్ కి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారట.

Anushka:

ఇలా తన కొడుకుకు పెళ్లి చేయాలని ఆలోచన రావడంతో కోడలుగా అనుష్క అయితే బాగుంటుందని భావించినటువంటి రాఘవేంద్రరావు తన కొడుకుని పెళ్లి చేసుకోమని అనుష్కని అడిగారట అయితే అనుష్క తనకి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చాలా సున్నితంగా సమాధానం చెప్పడంతో చేసేదేమీ లేక రాఘవేంద్రరావు కనిక అనే అమ్మాయితో తన కుమారుడి వివాహం జరిపించారు అయితే కొన్ని మనస్పర్ధలు కారణంగా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.

K Raghavendra Rao: 80 కోట్లు ఖర్చు చేశారని లెక్కలున్నాయా…. తమ్మారెడ్డి వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు ఫైర్!

K Raghavendra Rao: తమ్మారెడ్డి భరద్వాజ్ నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగిన ఈయన తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈయన ఏ విషయం గురించి మాట్లాడుతున్నారనే దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా తనకు తోచినది మాట్లాడుతూ వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు.ఎక్కువగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడే ఈయన తాజాగా మెగా హీరో నందమూరి హీరో నటించిన RRR సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ఆస్కార్ కోసం ఖర్చుపెట్టిన 80 కోట్ల రూపాయలతో తాను 8 సినిమాలు చేసి మీ మోహన కొడతాను, ఈ సినిమా ప్రమోషన్ల కోసం అమెరికా వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ల కోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ మండిపడ్డారు.ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈయన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇదివరకే నాగబాబు స్పందిస్తూ ఘాటుగా సమాధానం చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కూడా సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ తనదైన శైలిలో తమ్మారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

K Raghavendra Rao: జేమ్స్ కామెరూన్ స్పిల్ బర్గ్ డబ్బు తీసుకొని పొగిడారా….

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు స్పందిస్తూ… మిత్రుడు భరద్వాజ్ కి అంటూ మొదలుపెట్టిన రాఘవేంద్రరావు తెలుగు సినిమాకి తెలుగు సాహిత్యానికి తెలుగు దర్శకుడికి మొదటిసారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి కానీ 80 కోట్లు ఖర్చు చేశారు అనడానికి నీ దగ్గర అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉందా? హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కామెరూన్ స్పిల్ బర్గ్ వంటి వారు కూడా డబ్బులు తీసుకొని ఈ చిత్రాన్ని గొప్పగా పొగుడుతున్నారనా నీ ఉద్దేశం అంటూ ఈ సందర్భంగా ఈయన తమ్మారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీంతో ఈయన చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారడంతో ఎంతోమంది రాఘవేంద్ర రావు గారికి మద్దతు తెలుపుతున్నారు.

Mohan Babu : ఆ దర్శకుడికి చాలా పొగరు.. అలా అనడంతో నా తలపై కిరీటాన్ని తీసి నేల కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాను. : మోహన్ బాబు

Mohan Babu : 1978 పొట్టేలు పున్నమ్మ చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రామకృష్ణులు, మల్లెపువ్వు, కటకటాల రుద్రయ్య లాంటి చిత్రాలు విజయవంతంగా నిలిచాయి. ఎన్టీ రామారావు నటించిన మరో చిత్రం సింహబలుడు 1978, ఆగష్టు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, వాణిశ్రీ నాయికానాయకులుగా నటించగా, మోహన్ బాబు ప్రతి కథానాయనిగా నటించారు. ఎం.ఎస్. విశ్వనాధన్ సంగీతం అందించారు. ఇందులో రావు గోపాలరావు నియంతగా నటించాడు. ఎన్టీ రామారావు చివరిసారిగా నటించిన జానపద చిత్రం.. దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన తొలి జానపద చిత్రం సింహబలుడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో అనేక చిత్రాలు రూపొందించారు అలాగే ఆయన తీసిన కొన్ని చిత్రాల్లో మోహన్ బాబు ప్రతి కథానాయకుడుగా నటించారు.

ఆ తర్వాత లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో మోహన్ బాబు నిర్మాతగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లుడుగారు చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, శోభన హీరో, హీరోయిన్లుగా నటించారు. అలా కథానాయకుడిగా ప్రతి నాయకుడిగా రాఘవేంద్రరావు డైరెక్షన్లో మోహన్ బాబు నటించారు. అయితే ఒక టీవీ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు ప్రక్కన కూర్చుని మోహన్ బాబు మాట్లాడుతూ.. 1978 లో వచ్చిన “సింహబలుడు” చిత్ర షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకుంటూ.. ఒక పోరాట సన్నివేశంలో ఎన్టీ రామారావుకు మోహన్ బాబుకు మధ్యలో వార్ జరుగుతుంది. ఎత్తయిన ప్రదేశంలో పోరాట సన్నివేశం జరుగుతున్న సందర్భంలో మోహన్ బాబు తన కిరీటాన్ని పెట్టుకున్నారు.. ఎందుకంటే ఎన్టీ రామారావు తన కత్తితో కొడితే ఆ కిరీటం కింద పడిపోవాలి. అది అప్పుడు రాఘవేంద్రరావు దర్శకుడిగా సూచించారు. కెమెరా స్టార్ట్ అనడంతో ఎన్టీఆర్ యాక్షన్ సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఒక్కసారి మోహన్ బాబు కిరీటంపై ఎన్టీఆర్ కొట్టారు. ఆ కిరీటం కింద పడకపోగా.. ఆ దెబ్బకు మోహన్ బాబుకు తలనొప్పి వచ్చింది. ఈ విషయాన్ని దగ్గరే ఉన్న కో- డైరెక్టర్ కోదండరామిరెడ్డికి డూప్ ను పెట్టండని మోహన్ బాబు చెప్పారు..

దర్శకుడు రాఘవేంద్రరావుతో కోదండ రామిరెడ్డి చెప్పడంతో.. ఆఫ్ట్రాల్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ వాడు చెప్తే నేను వినాలా? అనే తల పొగరు రాఘవేంద్రరావుకు ఆ రోజుల్లో ఉండేదని, ఎందుకంటే హిట్స్ పై హిట్స్ రావడంతో అలా రాఘవేంద్రరావు ప్రవర్తించారని.. ఆ తర్వాత రోజు బెంగళూరులో మరో షెడ్యూలు జరుగుతున్న సందర్భంలో తనను రూముకు పిలిపించుకొని రాఘవేంద్రరావు కాలు మీద కాలు వేసుకుని జీవితంలో పైకి వచ్చేవాడివి ఎందుకలా ప్రవర్తించావు అంటూ అడిగారని.. ఐతే రాఘవేంద్రరావును కలవబోయే ముందు ఇంట్లో తన శ్రీమతి పెద్దాయనతో (రాఘవేంద్రరావు) గొడవ ఎందుకని చెప్పిందని.. అందుకే మౌనంగా ఉండిపోయానన్నారు. ఆ తర్వాత మేమిద్దరం కలిసిపోయి ఆ సినిమా పూర్తి చేసామని.. ఆ టీవీ కార్యక్రమంలో మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అలా మోహన్ బాబు అనడంతో అక్కడే ఉన్నా రాఘవేంద్రరావు అలాగే కోదండరామిరెడ్డి, బి.గోపాల్ ఆశ్చర్యంగా చూడడాన్ని బుల్లితెర ప్రేక్షకులు గమనించడం జరిగింది.

Sree Leela: తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ రాంగ్ స్టెప్ వేస్తున్న శ్రీలీలా.. తిప్పలు తప్పవా?

Sree Leela: కే రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా, నటి శ్రీలీల హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఏ విధమైనటువంటి కలెక్షన్లను అందుకోలేక అనంతరం మెల్లిమెల్లిగా ప్రేక్షకులను థియేటర్ కి రప్పిస్తూ పూర్తిగా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీల అందాలను చూడటానికే ప్రేక్షకులు వచ్చారనేది వాస్తవం.

ఈ సినిమాతో తన అంద చందాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చాయి.అయితే ఈమె తొందరపాటు నిర్ణయంతో వచ్చిన అవకాశాలన్నిటికీ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఈమె కెరియర్ ని నాశనం చేసుకుంటుందని పలువురు భావిస్తున్నారు. శ్రీ లీల వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్న హీరోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈమె కేరియర్ ఇబ్బందులలో పడుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే మాస్ మహారాజు రవితేజ పలు డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. అలాగే నితిన్ సైతం మాచర్ల నియోజకవర్గం సినిమాతో వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు సొంతం చేసుకున్నారు. ఇలాంటి వారికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తన కెరీర్ కి మైనస్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఈమె గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. డిజే టిల్లు సినిమా సీక్వెల్ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Sree Leela: తప్పుటడుగులు వేస్తున్న శ్రీ లీల

ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు చేస్తున్న సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ క్లారిటీ లేదు. ఇలా మహేష్ బాబు బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలలో ఈమెకు అవకాశాలు వస్తున్నప్పటికీ ఈమె మాత్రం ఫ్లాప్ హీరోలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన కెరీర్ ని ఇబ్బందులలో పడేసుకుంటుందని తెలుస్తోంది.మరి ఈమె కమిట్ అయినా సినిమాలతో తన కెరియర్ ను ఎటువైపుకు తీసుకు వెళ్తుందో తెలియాల్సి ఉంది.

K Raghavendra Rao : ఆ సినిమాలో చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ చేస్తే ఇక నన్నెవరు చూస్తారని శోభన్ బాబు వాపోయారు. : రాఘవేంద్రరావు

K Raghavendra Rao : చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు నిర్మాత, అతను కొన్ని హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా తెలుగు సినిమాలో ప్రధానంగా తన రచనలతో ప్రసిద్ధి చెందాడు. అతను ఏడు రాష్ట్ర నంది అవార్డులు మరియు ఐదు ఫిలింఫేర్ అవార్డులను సౌత్‌లో పొందాడు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన చలనచిత్ర జీవితంలో, రాఘవేంద్రరావు రొమాంటిక్, కామెడీ, ఫాంటసీ, మెలోడ్రామా, యాక్షన్ థ్రిల్లర్, జీవిత చరిత్ర మరియు శృంగార చిత్రాలు వంటి బహుళ శైలులలో వందకు పైగా చలన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

రాఘవేంద్రరావు తన సినీ జీవిత పరంపరలో అందాల నటుడు శోభన్ బాబుతో కూడా కొన్ని చిత్రాలను రూపొందించారు. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు ఏడు చిత్రాలు విడుదలయ్యాయి. రాఘవేంద్రరావు మొదటగా శోభన్ బాబుతో 1975లో “బాబు” చిత్రం విడుదలయ్యింది. ఆ తర్వాత రాజా, రాధాకృష్ణ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో “మోసగాడు” చిత్రం 1980లో విడుదలైంది. చిరంజీవి అప్పటికి తెలుగు తెరకు పరిచయమై రెండు సంవత్సరాలు మాత్రమే గడిచింది. హీరో, విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో తెరపై కనిపిస్తూ తనను తాను చిరంజీవి నిరూపించుకుంటున్న రోజులవి.. చూడడానికి ఎర్రటికళ్ళు, ఫైట్స్, డాన్స్ బాగా చేస్తున్నాడని సినీ పరిశ్రమలో పలువురు అనడం లాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు రాఘవేంద్రరావు మోసగాడు చిత్రంలో ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రకి చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్టు హీరో శోభన్ బాబుకి చెప్పారు.

చిరంజీవి డాన్స్, ఫైట్లు బాగా చేస్తున్నాడని శోభన్ బాబు కూడా ఇదివరకే గమనించారు. అలాంటప్పుడు మోసగాడు చిత్రంలో అతనిని తీసుకొని శ్రీదేవితో స్టెప్పులు, వేయించి ఫైట్స్ గనుక చేసినట్లయితే ఇక ఆ సినిమాలో తనను ఎవరు చూస్తారని దర్శకుడు రాఘవేందర్రావుతో నిర్మోహమాటంగా శోభన్ బాబు అడిగారు. దానికి చిరునవ్వు నవ్విన దర్శకుడు.. చిరంజీవిది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని.. ఆ పాత్రతో హీరోకి వచ్చిన నష్టం ఏమీ ఉండదని చెప్పడంతో శోభన్ బాబు ఆ విషయంలో కన్విన్స్ అయ్యారని ఒక సందర్భంలో ఓ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆనాటి గత స్మృతులను ఒక్కసారి రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు.

Flash Back : లిప్ లాక్ తెచ్చిన తంటా… దర్శకేంద్రుడు చేసిన పనికి తల పట్టుకున్న చిరంజీవి.. చిరు లిప్ లాక్ వెనుక ఉన్న అసలు కథ..

Gharana Mogudu : 90 దశకాల్లో చిరంజీవి మెగాస్టార్ అయిన రోజులు, మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండి చిరు చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే రేంజ్. ఏ దర్శకుడైనా చిరుతో సినిమా అంటే ఖచ్చితంగా హిట్ కొట్టొచ్చు అనే ధీమా ఉండేది. అపుడు చిరు కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరు తీసిన సినిమా ఘరానా మొగుడు. ఈసినిమాలో చిరు కి జోడిగా నగ్మా నటించింది.

అప్పట్లోనే లిప్ లాక్, సంశయించిన చిరు…

రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన తొలి సినిమా మోసగాళ్లు. ఈసినిమాలో హీరో శోభన్ బాబు, విలన్ గా చిరంజీవి, ఇక హీరోయిన్ గా శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసింది. ఇక ఆ తరువాత చిరంజీవి నటించిన చిత్రం తిరుగులేని మనిషి. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగాను చిరు సెకండ్ హీరోగాను నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఇక చిరు, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అడవి దొంగ, ఆ తరువాత కొండవీటి దొంగ, యుద్ధ భూమి, మంచి దొంగ లాంటి సూపర్ హిట్లను తీశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అప్పటి వరకు ఉన్న చిరు రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను సృష్టించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఘరానా మొగుడు సినిమాలో నగ్మా హీరోయిన్. ఇక ఈ సినిమాలో రాఘవేంద్రరావు చిరుకి నగ్మాకి లిప్ లాక్ ప్లాన్ చేసారు. ఇక ఈ విషయంలో నగ్మా డైరెక్టర్ అడుగగానే ఓకే చేసారు.

ఇక చిరంజీవి మాత్రం ససేమిరా అన్నాడు. కానీ రాఘవేంద్రరావు పట్టుబట్టడంతో మొహమాట పడిన చిరు చివరకు ఒప్పుకున్నాడు. కానీ ఎక్కడో ఇంకా సంశయం అలానే ఉంది. ఇక సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన తరువాత కూడా ఇంకా ఆ లిప్ లాక్ గురించి చిరు ఆలోచించారట. ఈ సీన్ను నా అభిమానులు ఎలా తీసుకుంటారో అని అనుకున్నారట. ఇక ఏమైనా సరే రాఘవేంద్ర రావుతో మాట్లాడి ఆ సీన్ తొలగించాలి అని నిర్ణయించుకున్నారు. చివరికి రాఘవేంద్రరావు గారిని ఒప్పించి ఆ లిప్ లాక్ సీన్ ను సినిమాలో తొలగించారట చిరు. ఆ సీన్ సినిమాలో ఉండుంటే ఎలా ఉండేదో తెలియదు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటి సినిమాల్లో లిప్ లాక్స్ మామూలే కానీ అప్పట్లో మాత్రం అది పెద్ద విషయమే కదా….

Srikanth : శ్రీకాంత్ ను ఓవర్ నైట్ హీరోగా చేసిన సినిమా.. కేవలం పాటల కోసమే థియేటర్ కి వచ్చి సందడి చేసిన జనం….!

Srikanth : కే రాఘవేంద్రరావు దర్శకుడిగా టాప్ పొజిషన్ లో ఉన్న సమయంలో తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. 1995 లో ‘హమ్ ఆప్ కే హై కౌన్’ సినిమాను చూసి ఇలాంటి సినిమా తీయాలని అనుకున్నారు. ఇక రచయిత సత్యానంద్ గారికి వివరించారు. ఇక సినిమాలో పాటలు భాగం కావాలని రాఘవేంద్రరావు సూచించారు. ఇక సత్యానంద్ నాగేశ్వరావు గారి పెళ్లి కానుక సినిమా స్ఫూర్తితో కథ సిద్ధం చేసారు.

తొమ్మిది పాటలతో 85 లక్షల బడ్జెట్ తో 80 రోజుల్లో సినిమా….

రాఘవేంద్రరావు కి కథ నచ్చడంతో పెళ్లి సందడి అనే పేరు కూడా ఫిక్స్ చేసారు. ఇక హీరో కోసం వెతికారు. మొదట హరీష్ ను హీరోగా అనుకున్నా ఆ తరువాత తాజ్ మహల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ను సెలెక్ట్ చేసారు. పెద్ద డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమాలో శ్రీకాంత్ హీరో అనగానే అందరు షాక్ అయ్యారు. ఇక నిర్మాత కోసం రాఘవేంద్రరావు అల్లు అరవింద్ ని సంప్రదించగా సినిమా పోతే నష్టాలను భరించవచ్చు అని నలుగురు కలిసి పార్టనర్ షిప్ మీద సినిమా తీద్దామని చెప్పారు. దీంతో అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, అశ్వినీదత్, జగదీశ్ ప్రసాద్ కలిసి కొత్త బ్యానర్ రాఘవేంద్ర ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా నిర్మాణాన్ని మొదలుపెట్టారు.

ఇక హీరోయినులుగా దీప్తి భట్నాగర్, రవళి ని సెలెక్ట్ చేసారు. తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, శివాజీ రాజా, బాబు మోహన్, కైకాల సత్యనారాయణ, ఏవిఎస్, శ్రీ లక్ష్మి వంటి వారు నటించారు. ఇక మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సంగీతాన్ని కీరవాణి గారు అందించారు. సినిమాలోని అన్ని పాటలు హిట్. అప్పటివరకు అల్లుడా మజాకా సినిమా పాటలపై ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. ఆల్ టైం సెల్లింగ్ రికార్డులను సొంతం చేసుకుంది. ఇక పాటలు హిట్ అవ్వడంతో సినిమా బిజినెస్ కు డిమాండ్ పెరిగింది.

కానీ నిర్మాతలు సొంతంగా థియేటర్లలో రిలీజ్ చేసారు. కేవలం అరవై థియేటర్లలో విడుదలైన సినిమా ప్రభంజనం సృష్టించింది. అన్ని ఏరియాలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను తమిళంలో విజయ్, హిందీలో సంజయ్ కపూర్ నటించారు. ఇక హిందీ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాలతో పోటీ పడి నెగ్గింది. 50 కేంద్రాల్లో 100 రోజులు సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడి అప్పటివరకు ఎన్టీఆర్ లవకుశ సినిమాకు ఉన్న రికార్డును క్రాస్ చేసింది. అలా అటు ఎన్టీఆర్, ఇటు మెగాస్టార్ రికార్డులను బద్ధలుకొట్టి శ్రీకాంత్ ను సెకండ్ గ్రేడ్ హీరోలలో టాప్ హీరోగా నిలబెట్టింది. ఐదు నందులను గెలుచుకున్న ఈ సినిమా ఆ తరువాత శ్రీకాంత్ కు హీరోగా 20 సినిమాల ఆఫర్స్ ను తెచ్చిపెట్టింది.

మా ఎన్నికల తీరుపై కె. రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్..!

ఎట్టకేలకు మా ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. మా ఎన్నికల ప్రస్తావన వచ్చిన దగ్గర నుంచి ఆ రాజకీయం అంతా మా బిల్డింగ్ చుట్టే తిరిగింది. ఎవరు చూసినా వాటి గురించే ప్రస్తావించేవారు. ఎందుకు బిల్డింగ్ అమ్మారు.. అందులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు కూడా వినిపించాయి.

ప్రకాష్ రాజ్ కు అర్హత లేదని.. నాన్ లోకల్ అంటూ కూడా కొంతమంది ఆరోపించారు. ఎటు తిరిగీ.. చివరకు ఎన్నికల వరకు వచ్చారు. అధ్యక్షుడి బరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ నిలవగా చివరకు ఆ అధికారం మంచు విష్ణు దక్కించుకున్నారు. అయితే ఇతంతా జరిగిన తర్వాత కూడా మా ఎన్నికలపై కొంతమంది ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇలా మా ఎన్నికలు జరిగిన తీరుపై రోజుకొకరు స్పందిస్తున్నారు.

తాజాగా పెళ్లిసందD ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి మాట్లాడారు.. అక్కడ రాఘవేంద్ర రావు కూడా పాల్గొన్నారు. ఈ ప్రమోషన్లో భాగంగా విశాఖపట్నం వెళ్లారు రాఘవేంద్ర రావు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. మా ఎన్నికలు జరిగిన తీరు బాగాలేదని.. చాలా అలజడి స్పష్టించిందని.. అందరు కలిసి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

అది సినీ పరిశ్రమకు కూడా మంచిది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. మంచు విష్ణు అధ్యక్షుడిగా రాణిస్తాడనే నమ్మకం ఉందని రాఘవేంద్రరావు చెప్పారు. ఇక పెళ్లిసందD సినిమాలో విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 15 న విడుదల కానుంది.

దర్శకేంద్రుడికి కోపం వచ్చింది.. సుమ క్యాష్ ప్రోగ్రాం నుంచి వాకౌట్ చేసిన రాఘవేంద్ర రావు

ప్రస్తుతం సీనియర్ మోస్ట్ దర్శకులల్లో కె.రాఘవేంద్రరావు ఒకరు. అతడి దర్శకత్వ పర్యవేక్షణలో.. రోణంకి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పెళ్లిసందD’. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్ర బృందం ఇటీవల సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంకు వచ్చారు. ఇందులో హీరో, హీరోయిన్లతో పాటు మరికొంత మంది వచ్చారు.

దీనికి సబంధించి ఒక ప్రోమో విడుదల చేశారు ఈటీవీ యాజమాన్యం. ఇందులో మొదట.. ఒకరినొకరు పరిచయం చేసుకొని.. సుమ, ఆ బృందంతో నవ్వులు పూయించింది. తర్వాత టాస్క్ ఆడుతున్న క్రమలో రాఘవేంద్ర రావు ఇలా అన్నాడు.. తమ బృందాన్ని మోసం చేశారంటూ ఆరోపించారు.

ఇక్కడకు తాము డబ్బులొస్తాయన్న కారణంతో వచ్చామని.. కానీ ఇక్కడ అంతా ప్లాన్ చేసి.. తమను గెలవనీయకుండా చేస్తున్నారని.. దీని వెనుకు ఎవరో ఉన్నారన్నారు. ఇలా చేయడం భావ్యమేనా? మా టీమ్‌ అంతా ఫూల్స్‌ అని మీ ఉద్దేశమా?’ అని సీరియస్‌ అయ్యారు. యాంకర్‌ సుమతో ఈ టీమ్‌ చేసిన అల్లరికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

సరదాగా సాగుతూనే చివరకు ఉత్కంఠ పెంచింది. దీంతో వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోవడం కనిపిస్తుంది. ఇది కొంతమంది నెటిజన్లు కేవలం ప్రోమో కోసమే అని.. దీనిలో నిజం లేదని చెబుతుండగా.. మరికొంతమంది రాఘవేంద్ర రావు నిజంగానే ఫీల్ అయ్యారని అంటున్నారు. సుమ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. మరి వాళ్లు కూల్ అయ్యారా.. మళ్లీ ఆ ఎపిసోడ్ లో అందరు కలిసి ఆడారా లేదా అనేది తెలియాలంటే అక్టోబర్ 2న విడుదలయ్యే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాక ఆగాల్సిందే.

‘ఇందువదన’ సినిమా బాగా వచ్చింది.. కానీ మా తాత కోరిన తీర్చలేకపోయాను: హీరో వరుణ్ సందేశ్

‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన యంగ్ హీరో వరుణ్ సందేశ్ ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ చిత్రాలతో ఎంత పెద్ద ఫేమ్ తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రెండు సినిమాలతో ఎంతగానో యువతను ఆకట్టుకున్న వరణ్ సందేశ్ తాజాగా ఇందువదన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజా ఈ మూవీ టీజర్ ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేశారు. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా తాజా టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై బాగానే అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాలో వరుణ్ సందేశ్‌కి జంటగా ఫర్నాజ్ శెట్టి నటిస్తుండగా, ఎమ్మెస్సార్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. వైవిధ్యమైన కథతో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘ఇందువదన’.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. మా తాతయ్య తన సినిమాలను చూడాలని బాగా పరితపించేవాడని.. కానీ గత ఏడాది చనిపోయాడంటూ వాపోయాడు. అలా తన తాతయ్య కోరికను నెరవేర్చలేదన్న బాధ ఉందంటూ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా చాలా బాగా వచ్చిందని.. ఈ సినిమాలో తొలిపాట యూట్యూబ్ లో విడుదల చేయడంతో మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీనికి శివ కాకాని సంగీతం అందిస్తున్నారు. రఘుబాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, తాగుబోతు రమేశ్‌, ధన్‌రాజ్‌, మహేశ్‌ విట్టా తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.