Tag Archives: kondaveeti donga

ఒకే సంవత్సరంలో విడుదలైన ఈ రెండు చిత్రాలు ఒకటి హిట్టు.. మరొకటి ఫట్టు..!!

‘న్యాయంకావాలి’ చిత్రంతో ప్రారంభమైన చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ అప్రతిహతంగా ఒక దశాబ్దం పాటు కొనసాగింది. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తో ముందుకు వెళ్లారు.

న్యాయం కావాలి, అభిలాష, చాలెంజ్, దొంగమొగుడు, రాక్షసుడు, పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బస్టర్స్ వీరి ఖాతాలో నమోదయ్యాయి. పరుచూరి బ్రదర్స్ అందించిన అద్భుతమైన కథకు కోదండరామిరెడ్డి తనదైన శైలిలో ఈ సినిమాను ముందుకు నడిపించారు.

1990 విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్, టి.త్రివిక్రమరావు నిర్మాణం, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “కొండవీటిదొంగ” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి, రాధ హీరో హీరోయిన్లుగా నటించారు. ఉన్నత విద్యనభ్యసించిన హీరో ప్రజల కోసం ప్రభుత్వ ఉద్యోగం సైతం పక్కనపెట్టి పీడిత ప్రజల అభ్యున్నతికి పోరాడే కథాంశంతో ఈ సినిమా రూపొందించబడింది. ఇళయరాజా అందించిన “శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో అదినీకు పంపుకున్న అపుడే కళలో” లాంటి గీతాలు ఆనాడు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శింపబడింది….

ఇకపోతే చక్కని అందం, అభినయం గల సుమన్.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “తరంగిణి” చిత్రంలో హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఇద్దరుకిలాడీలు, సితార, మెరుపుదాడి, కంచుకవచం 20వ శతాబ్దం, చిన్నల్లుడు, బావ బావమరిది వంటి హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. 1990 శ్రీ గౌతమ్ చిత్ర బ్యానర్, సి.హెచ్.రెడ్డి నిర్మాణం, సత్యారెడ్డి దర్శకత్వంలో ‘కొండవీటిరౌడీ’ చిత్రం విడుదలయింది. ఈ చిత్రంలో సుమన్, వాణి విశ్వనాథ్, అశ్విని హీరో, హీరోయిన్లుగా నటించారు. రాజ్ కోటి అందించిన గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం మూటగట్టుకుంది.

శ్రీదేవి పెట్టిన కండిషన్స్ ని తట్టుకోలేక ఆ సినిమాలో హీరోయిన్ ని మార్చి చిరంజీవి ఎంత పెద్ద హిట్ కొట్టాడో తెలుసా..??

తెలుగు ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో హీరోగా అత్యున్నత స్థాయికి ఎదిగి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు చిరంజీవి..దాదాపు150 కి పైగా చిత్రాల్లో నటించిన చిరూ కి.. ఆయన కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి… అలాంటి సినిమాల్లో ఒకటి కొండవీటి దొంగ చిత్రం. ఈ సినిమా పేరు వింటే మెగా ఫాన్స్ ఎంతో సంతోష పడతారు.

ఆరోజుల్లో యువకులకు ఈ సినిమా అంటే ఎంతో క్రేజ్ ఉండేది. తెలుగు పరిశ్రమను ఓ ఊపు ఊపడంతో పాటు తెలుగు సినిమా మీద ఇండియన్ సినిమా ఫోకస్ చేసేలా చేసింది.కొండవీటి దొంగ సినిమా గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్ర ఉంది. చిరంజీవి వరుస అపజయాలతో బాధపడుతున్న రోజుల్లో ఈ సినిమా వచ్చింది. కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం మీద త్రివిక్రమరావు నిర్మించారు. పరుచూరి బ్రదర్స్ స్టోరీ అందించారు.

ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లే రాశారు.ఈ సినిమాలో హీరోయిన్ పైనా చాలా డిస్కర్షన్ జరిగింది. మొదట శ్రీదేవిని తీసుకోవాలనుకున్నారు. ఆమె ఎక్కువ కండీషన్లు పెట్టడంతో విజయశాంతిని సంప్రదించారు. తను ఓకే చెప్పడంతో ఆమె పేరును ఓకే చేశారు. విలన్ రోల్ కోసం అమ్రిష్ పురిని తీసుకున్నారు. ఆరోజుల్లో తొలి 70 ఎంఎం సినిమా కావడంతో చాలా జాగ్రత్తగా సినిమాను రూపొందించారు.ఇక ఈ సినిమాకు ఇళయ రాజా మ్యూజిక్ ఇచ్చారు. చిరు కెరీర్ లోనే ఈ సినిమా సంగీతం బెస్ట్ గా నిలిచింది.

సినిమాలోని అన్ని పాటలు మంచి విజయాన్ని సాధించాయి. ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పట్లో ప్రతి ఇంట్లో ఈ సినిమా పాటలే వినిపించాయి. ఈ సినిమా విజయాన్ని చూసి అగ్ర హీరోలు సైతం ఆశ్చర్యపోయారు అంటే కొండవీటి దొంగ పవరేంటో తెలుసుకోవచ్చు. ఇక నాగబాబు చిరంజీవి మధ్య ఉన్న ఫైట్. లాస్ట్ లో అమ్రీష్ పూరి, చిరంజీవి మధ్య ఉన్న ట్రైన్ ఫైట్ ఒక సంచలనం అయ్యాయి.ఈ సినిమా తొలి వారంలో రూ. 74 లక్షల షేర్ సాధించింది. అనంతరం వెనక్కి తిరిగి చూసుకోలేదు.దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది..!!