Tag Archives: madhya pradesh

అతడికి పుర్రె లేకుండానే వైద్యులు ఆపరేషన్ చేశారు.. ఎందుకు ఇలా చేశారంటే..!

మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన కీర్తి పార్మర్ కు కొన్నేళ్ల కిందట బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అతడు ఇండోర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లను కలిశాడు. స్కానింగ్ చేసిన వైద్యులు బ్యెయిన్ ట్యూమన్ ఉందని.. దానిని తొలగించకపోతే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పారు. దీంతో అతడు 2019లో ఆపరేషన్ చేయించుకున్నాడు. పుర్రెలోని కుడివైపు భాగాన్ని పగలకొట్టి ట్యూమర్ తొలగించారు. తర్వాత ఆ పుర్రెను అతికించకుండానే చర్మంతో కుట్టేశారు. ఎందుకు అలా చేశారంటే.. బయటకు తీసిన ఆ పుర్రె పగిలిపోయింది.

అందువల్ల ఇక అతను ఎప్పటికీ ఆ పుర్రె ముక్క లేకుండానే బతకాల్సి వస్తోంది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పుర్రె ముక్క లేకుండానే ఆపరేషన్ పూర్తి చేసేశారనీ… తమకు న్యాయం చెయ్యాలని కీర్తి పార్మర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనిపై డాక్టర్లు మాట్లాడుతూ.. అతడికి మెదడులో అయింది చిన్న గడ్డ కాదు.. దాన్ని తొలగించాలంటే పుర్రెలోని కీలక భాగాన్ని తొలగించక తప్పలేదు.

తర్వాత దానిని తిరిగి అమర్చాలంటే… ఆ పుర్రె ముక్క పద్ధతిగా ఉండాలి. కానీ ఆపరేషన్ సమయంలో… పుర్రె ముక్క పద్ధతిగా రాలేదు. ముక్కలైపోయింది. ఇలా జరిగే అవకాశం ఉందనీ… అలా జరిగితే… పుర్రెను తిరిగి సెట్ చెయ్యడం కుదరదని ముందే చెప్పినట్లు వైద్యులు వివరణ ఇచ్చారు. వారు దానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. అంచనా వేసినట్లుగానే అది ముక్కలైపోయింది. కాబట్టి… తిరిగి సెట్ చెయ్యడం కుదరలేదన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసి బాధిత కుటుంబసభ్యులు న్యాయం చేయాలంటూ కోరారు. పేషెంట్ వైపు నుంచి చూస్తే అయ్యో అనిపించడం సహజం. వైద్యులు విషయానికి వస్తే వాళ్లు ఆపరేషన్ పూర్తి చేశారు. కానీ వాళ్లనే నిందించడం అనేది పద్దతి కాదంటూ పోలీసులు తెలిపారు. దీనిపై చివరకు ఎవరు రాంగ్.. ఎవరు తప్పు అనేది పోలీసులే తేల్చాల్సి ఉంటుంది.

దారుణం: పెళ్లైన ఐదు నెలలకే భార్య నోట్లో యాసిడ్ పోసిన భర్త..?

మన దేశంలో మహిళల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే మహిళలపై లైంగిక దాడులు జరగడం, లేదా వరకట్న వేధింపులు కారణంగా ఎంతోమంది మహిళలు బలైపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలను గురించి మనం ఎన్నో వినే ఉంటాం.. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్ అనే యువకుడికి ఐదు నెలల క్రితం శశి అనే యువతితో వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు 10 లక్షలు ఖర్చు చేసి ఎంతో ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన 5 నెలలకే ఈమెకు వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

వీరేంద్ర పెట్టె టార్చర్ భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయినప్పటికీ అతను ఒక కొత్త కారు కొనాలనీ అందుకోసం తమ తల్లిదండ్రుల నుంచి మూడు లక్షలు అదనంగా కట్నం తేవాలని తెలిపాడు. ఈ క్రమంలోనే పెళ్లి కోసం తమ తల్లిదండ్రులు అప్పు చేశారని మరి కట్నం అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటూ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

ఈ విధంగా వీరిరువురి మధ్య గొడవ పెరిగి పెద్దగడంతో వీరేంద్ర తన భార్యను గొడ్డును బాదినట్టు బాది తన నోట్లో యాసిడ్ పోసి ఆమెపై దాడి చేశాడు. యాసిడ్ పోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శశిను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు శశిని DCW చీఫ్ స్వాతిమాలివాల్ పరామర్శించి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కు లేఖ రాసి నిందితులకు కఠినంగా శిక్షపడేలని తెలిపారు.

వామ్మో…21 పాములను కట్నంగా ఇచ్చిన మామ.. చివరికి ఏం జరిగిందంటే?

సాధారణంగా మనం అమ్మాయికి పెళ్లి చేయాలంటే లక్షలకు లక్షలు కట్నకానుకలు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తుంటాము.అదేవిధంగా మరికొందరు వస్తు రూపంలో తమ అల్లుడికి కట్న కానుకలను సమర్పిస్తుంటారు. అదే విధంగా దేశంలో వివిధ రాష్ట్రాల వారు పాటించే ఎన్నో వింత ఘటనలను, ఆచారాలను మనం చూస్తూ ఉంటాం అలాంటి ఓ ఆసక్తికర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే..

మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి తన కూతురు వివాహాన్ని కట్న కానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.ఇందులో ఏముంది వింత అనుకుంటున్నారా.. వధువు తండ్రి వరుడికి కట్నంగా తన కూతురి పెళ్లిలో 21 విష సర్పాలను కట్నంగా ఇచ్చాడు.మామగారు ఇచ్చిన 21 సర్పాలను వరుడు సంతోషంగా స్వీకరించాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గొరియా తెగకు సంబంధించిన చిత్రమైన ఆచారం గురించి తెలుసుకోవల్సిందే. వీరి వివాహ సమయంలో పెళ్లి కుమారునికి కట్నంగా విలువైన నగదు, డబ్బులు,వస్తువులకు బదులుగా బతికున్న విషసర్పాలను వరుడికి కట్నంగా అందిస్తారు. పాములనే కట్నంగా ఎందుకు ఇవ్వాలి అనేగా మీ సందేహం.

గొరియా తెగల ఆచారం ప్రకారం పెళ్లి పవిత్రతను పాములు కాపాడేందుకు సహకరిస్తాయనేది వీరి నమ్మకం. పైగా వాళ్ల ముఖ్య వృత్తి కూడా పాములను పట్టుకోవడం. దీంతో వారికి పాములంటే భయం ఉండదు. పైగా అవి వాటికి సులభంగానే దొరికేస్తాయి కూడా. ముఖ్యంగా ఈ తెగలో యువతికి పెళ్లంటే చాలు ఆ కుటుంబమంతా పాములను పట్టుకోవడానికి సాహసం చేయాల్సిందే మరీ.ఇటీవల జరిగిన ఓ పెళ్లిలో వధువు తండ్రి వరుడికి 21 పాములను కట్నంగా ఇవ్వడంతో ఈ విషయం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారి అందరిని ఆకర్షిస్తోంది.

ఒకే కుటుంబంలో ఐదుగురి మహిళలు అదృశ్యం.. నెల తర్వాత బయట పడిన షాకింగ్ నిజాలు!

ఒకే కుటుంబంలోని ఐదుగురు మహిళలు ఉన్నఫలంగా అదృశ్యమయ్యారు. వీరు కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు కింద ఈ మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే దర్యాప్తును కొనసాగిస్తున్న పోలీసులకు నెల రోజుల తర్వాత ఎంతో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అదృశ్యమైన మహిళలు ఏమయ్యారు అనే విషయాలను దేవాస్ పోలీసులు తెలియజేశారు.

మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాకు చెందిన మమతా, ఆమె ఇద్దరు కుమార్తెలు రూపాలీ (21), దివ్య (14), మరో ఇద్దరు బాలికలు మే 13 నుంచి కనిపించకుండాపోయారు. మమత పెద్ద కుమార్తె రూపాలీ అదే గ్రామానికి చెందిన సురేంద్ర చౌహన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే సురేంద్ర చౌహన్ మరొక అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న రూపాలీ సురేందర్ ఫోటో, అతని ఫోన్ నెంబర్ ఫేస్ బుక్ లో ఆయనే తనకు కాబోయే భర్త అంటూ పోస్ట్ చేసింది. రూపాలీ ఈ విధంగా ప్రవర్తించడం తో ఎంతో ఆగ్రహం చెందిన సురేందర్ ఎలాగైనా ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.

ఈ క్రమంలోనే రూపాలి కుటుంబాన్ని హత్య చేసి వారి శవాలు పోలీసులకు దొరకకుండా వేర్వేరు గ్రామాలలో పాతి పెట్టాడు. అదేవిధంగా పోలీసులకు అనుమానం రాకుండా శవాల మీద ఉన్న దుస్తులను తొలగించి వాటిని కాల్చివేశాడు. శవాలు దుర్వాసన రాకుండా ఉండటం కోసం ఉప్పు, యూరియా వేసి పాతి పెట్టాడు.

ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలువురిపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.సురేంద్ర చౌహన్ పథకం వేయడంతో వీరు కేవలం శవాలను పాతి పెట్టడానికి మాత్రమే సహాయం చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే శవాలను ఎక్కడ పాతి పెట్టారు అనే విషయాలను తెలుసుకుని వాటిని వెలికి తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నట్లు తెలిపారు.

మధ్యప్రదేశ్ లో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం.. ఆందోళనలో అధికారులు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా రెండవ దశ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్ రూపంలో ముంచుకొస్తే రెండవ దశ కన్నా రెట్టింపు స్థాయిలో కేసులు నమోదు అవుతాయని అందుకే ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు 40 నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా దేశంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం మధ్యప్రదేశ్ లో నమోదయిందని అధికారులు వెల్లడించారు. కోవిడ్ -19 తో మృతిచెందిన వ్యక్తి జన్యు నమూనాలను పరీక్షించగా అసలు విషయం బయట పడినట్లు అధికారులు వెల్లడించారు.

మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు ఐదు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు కోలుకోగా ఉజ్జయినికి చెందిన ఓ మహిళ మృత్యువాత పడినట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి కోలుకున్న నలుగురు 2 డోసుల వ్యాక్సిన్ పూర్తిగా వేయించుకున్నారు. చనిపోయిన మహిళ ఒక డోస్ పూర్తి చేసుకున్నట్లు ఈ సందర్భంగా ఉజ్జయిని కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రౌనక్ వెల్లడించారు.

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్ రూపంలో ముంచుకొస్తుందని, ఇది రెండవ దశ కంటే తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలను పాటిస్తూ, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు ఆదేశించారు.

వామ్మో.. ఒక్క మామిడి పండు ఖరీదు రూ.వెయ్యి?

వేసవికాలం వచ్చిందంటే చాలు అందరూ ఎంతో ఇష్టంగా తినే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. మామిడి పండును పండ్లలో రారాజుగా భావిస్తారు. ఎన్నో పోషక విలువలతో కూడిన ఈ పండ్లను తినడానికి ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే మన రాష్ట్రాలలో దొరికే బంగినపల్లి, రసాలు, నీలం వంటి రకాలకు చెందిన మామిడిపండ్లు ఎక్కువగా పండిస్తారు. వీటి ధర కూడా మనకు ఎంతో అందుబాటులోనే ఉంటుంది.కానీ మధ్యప్రదేశ్ కి చెందిన ఓ మామిడి పండు రకము మాత్రం కిలో రూ 1000 పలుకుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతాలో మాత్రమే పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మామిడి పండ్లు ఒక్కొక్కటి సుమారు కిలోల బరువును కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈ పండు ధర ఏకంగా వెయ్యి రూపాయలు పలుకుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పండు సైజు పెద్దగా ఉండటంతో అత్యధిక ధర పలుకుతోందని రైతులు తెలియజేస్తున్నారు.

ఎంతో రుచికరమైన ఎన్నో పోషకాలు కలిగిన ‘నూర్జహాన్’ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్ చేసుకుంటారని, ఒక్కో పండు సుమారు 2 కిలోల నుంచి
3.5 కిలోల బరువు ఉంటుంది. 2019 వ సంవత్సరంలో ఒక్కో మామిడిపండు బరువు 2.75 కేజీలతో పండింది. ఆ సంవత్సరంలో అత్యధికంగా ఒక్కో పండు ధర సుమారుగా రూ.1200 ధర పలికిందని రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు.

వరుడికి కోవిడ్.. పీపీఈ కిట్లు ధరించి మరీ పెళ్లి.. ఎక్కడంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆసుపత్రి ఫాలో అవుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గత కొన్ని నెలల నుంచి శుభముహూర్తాలు లేక ఇప్పుడు పెళ్లిళ్ళ పెట్టుకున్నవారిని సైతం కరోనా మహమ్మారి వదలక పోవడం తో కొందరు పెళ్లిళ్లు వాయిదా వేసుకోక మరికొందరు అనుకొన్న సమయానికి పెళ్లి జరగాలని గట్టి పట్టు పడుతున్నారు.

ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో ఓ జంటకు వివాహం నిశ్చయమైంది. వివాహానికి రెండు రోజులు ముందు వరుడు కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో చేరాడు.అయితే వారు నిర్ణయించిన ముహూర్తానికి వీరు పెళ్లి జరగాలని పట్టుబట్టిన ఇరు కుటుంబాల పెద్దలు అధికారులను ఆశ్రయించి వారి నుంచి పెళ్లికి అనుమతి తీసుకున్నారు.

అధికారుల నుంచి అనుమతి లభించడంతో వధూవరులిద్దరు పిపిఈ కిట్లను ధరించి వివాహం చేసుకున్నారు. అధికారులు వీరి పెళ్లికి అనుమతి ఇవ్వడంతో పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ పిపిఈ కిట్లతో పెళ్లికి హాజరైన వధూవరులకు పెళ్లి చేయించడానికి పురోహితుడు సైతం పిపిఈ కిట్ ధరించి వివాహం జరిపించారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరు తమదైన శైలిలో స్పందించి కామెంట్లు పెడుతున్నారు.

ఆ గ్రామంలో భార్యలను అద్దెకు ఇస్తారట.. ఎక్కడంటే..?

ఇతర దేశాలతో పోల్చి చూస్తే స్త్రీలను గౌరవించే దేశాలలో భారత్ ముందువరసలో ఉంటుంది. సనాతన ధర్మం ప్రకారం మహిళలను ఇక్కడ శక్తిస్వరూపాలుగా పూజిస్తారు. అయితే దేశంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితులు మాత్రం ఉండవు. దేశంలోని పలు ప్రాంతాలలో మహిళలపై అత్యాచార ఘటనలు, హత్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలను అమలు చేస్తున్నా ఈ ఘటనలకు చెక్ పెట్టలేకపోతున్నాయి.

అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలోని ఒక కుగ్రామంలో మాత్రం భార్యలను అద్దెకు ఇచ్చే సంస్కృతి ఉంది. డబ్బు కోసం సొంత భర్తలు తమ భార్యలను పరాయి పురుషులకు అద్దెకు ఇస్తారు. చాలా సంవత్సరాల నుంచి గ్వాలియర్ జిల్లాలోని శివపురి గ్రామంలో ఈ దురాచారం కొనసాగుతోంది. మహిళలను అంగడి సరుకుల్లా విక్రయించే ఈ సంస్కృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా ఇక్కడి ప్రజల ఆలోచనా తీరులో మాత్రం మార్పు రాలేదు.

శివపురి ప్రాంతంలోని గ్వాలియర్ రాజపుత్రులు ఎక్కువగా జీవనం సాగిస్తారు. ఈ రాజపుత్రులలో ఎక్కువమంది డబ్బున్న వారు కావడం గమనార్హం. అయితే ఈ రాజపుత్రుల కొరకు ఈ గ్రామంలో పేద మహిళల్లో నచ్చిన వారిని అద్దెకు తీసుకెళ్లే సౌకర్యం ఉంది. ఆ అద్దె 10 రూపాయల నుంచి లక్షల రూపాయాల వరకు ఉంటుంది. ‘అడీచప్రద’ పేరుతో ఈ దురాచారం ఆ గ్రామంలో నేటికీ కొనసగుతూ ఉండటం గమనార్హం.

16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అందమైన మహిళలను భర్తలు ఈ విధంగా అద్దెకు ఇస్తూ ఉంటారు. ఇరు పార్టీలు సంతకాలు చేసుకుని ఒప్పందం కుదుర్చుకుని అద్దెకు ఇచ్చే సంప్రదాయం గ్రామంలో కొనసాగుతోంది.

శుభలగ్నం సీన్ రిపీట్.. భర్తను కోటిన్నరకు అమ్మేసిన భార్య..!

దాదాపు పాతిక సంవత్సరాల క్రితం విడుదలైన శుభలగ్నం సినిమాలో హీరోయిన్ ఆమని తన భర్తను డబ్బుపై ఆశతో కోటి రూపాయలకు అమ్మేస్తుంది. నిజ జీవితంలో కూడా అలాంటి భార్యలు ఉంటారా..? భర్తను ప్రియురాలు డబ్బులిస్తే అమ్మేస్తారా…? అనే ప్రశ్నకు ఈ ఘటనను చూస్తే నిజమే అని సమాధానం వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో డబ్బు కోసం మహిళ భర్తను అమ్మేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి ఆమె భార్యతో తరచూ గొడవ పడుతూ మరో మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య ప్రతిరోజూ గొడవలు జరిగేవి. రోజూ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటంతో పెద్ద కూతురు తన చదువుకు భంగం కలుగుతోందని భావించి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు బాలిక ఫిర్యాదును స్వీకరించి భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వగా భర్త తనకు భార్య కంటే ప్రియురాలే ముఖ్యమని తేల్చి చెప్పాడు.

తాను ప్రియురాలితోనే కలిసి ఉంటానని భార్యతో విడాకులు ఇప్పించాలని ఫ్యామిలీ కోర్టును కోరాడు. అయితే భర్త తీరు మారకపోవడంతో విసుగు చెందిన భార్య చివరకు ఒక షరతుపై విడాకులు ఇవ్వడానికి అంగీకరించింది. తనకు భర్త ప్రియురాలు కోటి రూపాయల 50 లక్షలు ఇస్తే తాను విడాకులు ఇస్తామని ఆ మహిళ తెలిపింది. ఆ డబ్బులు నేను నాకోసం అడగడం లేదని.. పిల్లల భవిష్యత్తు కోసమే ఆ డబ్బును ఖర్చు చేస్తానని మహిళ పేర్కొంది.

మొదట కోటిన్నర రూపాయలు ఇవ్వడానికి అంగీకరించని భర్త ప్రియురాలు చివరకు కోటీ 20 లక్షల రూపాయల విలువ చేసే ఫ్లాట్, 27 లక్షల రూపాయల క్యాష్ ఇవ్వడానికి అంగీకరించింది. దాదాపు కోటిన్నర రూపాయలకు డీల్ కుదుర్చుకుని భర్తను భార్య అమ్మేయడం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కన్నకొడుకు ప్రవర్తన నచ్చక ఆస్తిని కుక్కకు రాసిచ్చిన తండ్రి!

సాధారణంగా తాతలు, తండ్రి సంపాదించిన ఆస్తి తరతరాలుగా వారి వారసులకు చెందుతుందని ఎంతోమంది వీలునామాలు రాయడం మనం చూస్తుంటాం. అంతేకాకుండా మరికొందరు సంతానం లేని వారు వారి యావదాస్తిని తమ తోబుట్టువులకు, లేదా అనాధ శరణాలయాలకు రాసి ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా తన ఆస్తిలో సగభాగాన్ని తన భార్య పేరిట, మిగిలిన సగం ఆస్తిని శునకానికి రాసి ఇవ్వడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో బరిబాడ గ్రామానికి చెందిన ఓం నారాయణ అనే వ్యక్తి తన పెంపుడు శునకం (జాకీ) అంటే ఎంతో ఇష్టం. అయితే అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. తన కుమారుడి ప్రవర్తన నచ్చక అతనిపై కోపంతో ఆ తండ్రి ఏకంగా తన ఆస్తిలో సగభాగాన్ని తను పెంచుకున్న పెంపుడు శునకానికి రాసిచ్చాడు. అంతే కాకుండా మిగిలిన సగభాగాన్ని తన రెండవ భార్య అయిన చంపా వర్మ పేరు పై రాసి ఇచ్చారు. ఈ విషయం పై నారాయణ మాట్లాడుతూ, తన భార్య, తన పెంపుడు శునకం తనను ఎంతో బాగా చూసుకుంటున్నాయని అందుకే నా ఆస్తిని మొత్తం వారిద్దరి పేర్లపై రాశానని తెలిపారు.

ఆస్తి వారి పేరుపై రాయడమే కాకుండా నేను చనిపోయిన తర్వాత నా శునకాన్ని ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో వారికి జాకీ పేరు మీదుగా రాసిన ఆస్తికి వారసులు అవుతారని, నారాయణ వీలునామాలో రాశారు. అయితే కన్నకొడుకు ప్రవర్తననచ్చక ఆస్తిని తన పెంపుడు శునకానికి రాసి ఇవ్వడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు కొడుకు పై కోపంతో ఆస్తిని కుక్కకు రాసి ఇవ్వడం విడ్డూరమని తమదైన శైలిలో స్పందిస్తున్నారు.