సాధారణంగా మనం అమ్మాయికి పెళ్లి చేయాలంటే లక్షలకు లక్షలు కట్నకానుకలు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తుంటాము.అదేవిధంగా మరికొందరు వస్తు రూపంలో తమ అల్లుడికి కట్న కానుకలను సమర్పిస్తుంటారు. అదే విధంగా దేశంలో వివిధ రాష్ట్రాల వారు పాటించే ఎన్నో వింత ఘటనలను, ఆచారాలను మనం చూస్తూ ఉంటాం అలాంటి ఓ ఆసక్తికర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే..
మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి తన కూతురు వివాహాన్ని కట్న కానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.ఇందులో ఏముంది వింత అనుకుంటున్నారా.. వధువు తండ్రి వరుడికి కట్నంగా తన కూతురి పెళ్లిలో 21 విష సర్పాలను కట్నంగా ఇచ్చాడు.మామగారు ఇచ్చిన 21 సర్పాలను వరుడు సంతోషంగా స్వీకరించాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గొరియా తెగకు సంబంధించిన చిత్రమైన ఆచారం గురించి తెలుసుకోవల్సిందే. వీరి వివాహ సమయంలో పెళ్లి కుమారునికి కట్నంగా విలువైన నగదు, డబ్బులు,వస్తువులకు బదులుగా బతికున్న విషసర్పాలను వరుడికి కట్నంగా అందిస్తారు. పాములనే కట్నంగా ఎందుకు ఇవ్వాలి అనేగా మీ సందేహం.
గొరియా తెగల ఆచారం ప్రకారం పెళ్లి పవిత్రతను పాములు కాపాడేందుకు సహకరిస్తాయనేది వీరి నమ్మకం. పైగా వాళ్ల ముఖ్య వృత్తి కూడా పాములను పట్టుకోవడం. దీంతో వారికి పాములంటే భయం ఉండదు. పైగా అవి వాటికి సులభంగానే దొరికేస్తాయి కూడా. ముఖ్యంగా ఈ తెగలో యువతికి పెళ్లంటే చాలు ఆ కుటుంబమంతా పాములను పట్టుకోవడానికి సాహసం చేయాల్సిందే మరీ.ఇటీవల జరిగిన ఓ పెళ్లిలో వధువు తండ్రి వరుడికి 21 పాములను కట్నంగా ఇవ్వడంతో ఈ విషయం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారి అందరిని ఆకర్షిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…