మీరు మీ నాలుకతో ముక్కను అందుకోగలరా? ట్రై చేస్తున్నారు కదా…నాలుకతో ముక్కు అందుకోవడానికి కొద్దిగా కష్టం అనిపించిన ప్రయత్నిస్తే తప్పకుండా అందుతుంది. కానీ ఒక వ్యక్తి మాత్రం తన నాలుకతో ఎంతో అవలీలగా ముక్కును అందుకోవడమే కాకుండా ఏకంగా తన కళ్ళను కూడా అందుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఏంటి నమ్మ బుద్ధి కావడం లేదా… అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే.
విరుధునగర్‌లోని తిరుదంగల్‌కు చెందిన కె.ప్రవీణ్ కుమార్ అనే 20 ఏళ్ల యువకుడు తన నాలుకతో కంటిని అందుకొని వార్తల్లోకి ఎక్కాడు. సాధారణంగా పురుషులకు నాలుక పొడువు 8.5 సెంటీ మీటర్లు, మహిళల నాలుక 7.9 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ ప్రవీణ్ కుమార్ అనే యువకుడు ముక్కు మాత్రం ఏకంగా 10.8 సెంటి మీటర్ల పొడవు ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రవీణ్ కుమార్ కు ఇంత పొడవైన నాలుక ఉండటంతో ఇతను ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంపాదించాడు
ప్రస్తుతం కాలిఫోర్నియాకు చెందిన యువకుడు సలినాస్‌లోని నిక్ స్టోబెర్ల్ అనే వ్యక్తి నాలుక పొడవు 10.1 సెంటి మీటర్ నుండి గిన్నిస్ బుక్ సాధించాడు. అయితే తాజాగా ప్రవీణ్ కుమార్ తన నాలుక పొడవుతో రికార్డులను తిరగరాశారు. ఇంత పొడవు నాలుక కలిగి ఉండడంతో ప్రవీణ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలియజేశారు. అదేవిధంగా నిమిషానికి ఏకంగా 216 సార్లు తన నాలుకతో ముక్కును తాకి రికార్డు సృష్టించారు. అలాగే కళ్ళ వరకు తన నాలుకతో అందుకోగలడు. త్వరలోనే తన నాలుకతో కనుబొమ్మలను అందుకుంటానని ప్రవీణ్ తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…