మన దేశంలో మహిళల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే మహిళలపై లైంగిక దాడులు జరగడం, లేదా వరకట్న వేధింపులు కారణంగా ఎంతోమంది మహిళలు బలైపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలను గురించి మనం ఎన్నో వినే ఉంటాం.. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్ అనే యువకుడికి ఐదు నెలల క్రితం శశి అనే యువతితో వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు 10 లక్షలు ఖర్చు చేసి ఎంతో ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన 5 నెలలకే ఈమెకు వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
వీరేంద్ర పెట్టె టార్చర్ భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయినప్పటికీ అతను ఒక కొత్త కారు కొనాలనీ అందుకోసం తమ తల్లిదండ్రుల నుంచి మూడు లక్షలు అదనంగా కట్నం తేవాలని తెలిపాడు. ఈ క్రమంలోనే పెళ్లి కోసం తమ తల్లిదండ్రులు అప్పు చేశారని మరి కట్నం అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటూ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
ఈ విధంగా వీరిరువురి మధ్య గొడవ పెరిగి పెద్దగడంతో వీరేంద్ర తన భార్యను గొడ్డును బాదినట్టు బాది తన నోట్లో యాసిడ్ పోసి ఆమెపై దాడి చేశాడు. యాసిడ్ పోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శశిను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు శశిని DCW చీఫ్ స్వాతిమాలివాల్ పరామర్శించి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కు లేఖ రాసి నిందితులకు కఠినంగా శిక్షపడేలని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…