సమంత అక్కినేని.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సమంత రుతుపభ్రుగా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత అక్కినేని కోడలుగా మారింది. సమంత చాలా లక్కీ గర్ల్. గోల్డెన్ లెగ్ గర్ల్. ఎందుకంటే.. సమంత ఇండస్ట్రీకి రావడం రావడమే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఏమాయ చేశావే సినిమాతో సూపర్ హిట్ కొట్టి.. ఆ తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంది సమంత. పెళ్లి తర్వాత కూడా సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ.. ఫుల్ బిజీ అయిపోయింది సామ్. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. తన పర్సనల్ విషయాలు, తన ప్రేమ గురించి.. పెళ్లి గురించి.. సినిమా కెరీర్ గురించి.. ముఖ్యంగా తన భర్త నాగ చైతన్య గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను పంచుకుంది.
సమంత పర్సనల్ విషయాలు చాలామందికి తెలియవు. అంటే.. తన అమ్మా నాన్న గురించి ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. కానీ.. తన నాన్న తెలుగు వ్యక్తే. కానీ.. తమిళనాడులో సెటిల్ అయిన ఫ్యామిలీ. సమంత తల్లి మలయాళీ, ఆంగ్లో ఇండియన్. సమంత ఫ్యామిలీ చెన్నైలో స్థిరపడ్డారు.
కాలేజీలో చదువుతున్న సమయంలోనే యాడ్స్ లో నటించా
చెన్నైలో కాలేజీలో చదువుతున్న రోజుల్లో సమంత.. యాడ్స్ లో నటించేదట. పాకెట్ మనీ కోసం ఏదో సరదాగా.. యాడ్స్ లో నటించేదట. తను నటించిన ఓ యాడ్ ను చూసిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ తనకు ఏమాయ చేశావే సినిమాలో అవకాశం ఇచ్చాడట. అలా.. తను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఇప్పటి వరకు సమంత.. తెలుగు, తమిళంలో కలిసి 50 వరకు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
ఏమాయ చేశావే సినిమా షూటింగ్ లోనే నాగచైతన్యను చూసి మనసు పారేసుకున్నా
సమంత మొదటి సినిమా ఏమాయ చేశావే. ఈ సినిమాతోనే తను తొలిసారి ఇండస్ట్రీకి పరిచయం అవ్వడంతో పాటు.. నాగచైతన్యతో తొలిసారి కలిసి నటించింది. ఆ సమయంలోనే వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వాళ్లు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ వస్తున్నారు. ఏమాయ చేశావే సినిమా షూటింగ్ ఫస్ట్ డే రోజు మాత్రం నాగచైతన్యను చూసి అస్సలు పట్టించుకోలేదట సమంత. నాగ చైతన్యను చూసి హాయ్ అని చెప్పి వెంటనే తల తిప్పుకొని తన స్క్రిప్ట్ చదువుకుందట. కానీ.. తర్వాత తర్వాత.. నాగ చైతన్య మీద అభిమానం పెరిగిందట. అయితే.. నాగ చైతన్య కంటే ముందు.. సమంతే.. ప్రేమలో పడిందట. తనే.. ముందు ప్రేమించిందట. ఆ తర్వాత నాగ చైతన్య ప్రేమించడం మొదలు పెట్టాడట.
తన స్టాఫ్ ను సొంత బిడ్డల్లా చూసుకుంటుంది సమంత
సమంత తన మేకప్ మ్యాన్ ను, తన స్టాఫ్ ను సొంత బిడ్డల్లా చూసుకుంటుందట. తన స్టాఫ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుందట సమంత. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పారు సమంత.
ఇండస్ట్రీలో ఏనాడూ అవకాశాల కోసం సమంత ఎదురు చూడలేదట. ఎందుకంటే.. ఏమాయ చేశావే సినిమా తర్వాత వెంట వెంటనే తనకు బృందావనం, దూకుడు సినిమాలు రావడం.. ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రావడం.. అన్నీ వరుసగా సక్సెస్ కావడంతో ఇక సమంత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదట.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…