Tag Archives: Movie Jailer

Tamannah: ఆ సినిమాలో నా నటన నాకే నచ్చలేదు… రిజల్ట్ అప్పుడే తెలిసిపోయింది: తమన్నా?

Tamannah:టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈమె నటించిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించిన ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తమన్న వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు ఈ ఇంటర్వ్యూలలో భాగంగా తన సినీ కెరియర్ లోని కొన్ని సినిమాల గురించి ఈమె ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తమన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతితో కలిసి సుర అనే సినిమాలో నటించారు.ఈ సినిమా మ్యూజికల్ గా చాలా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటికి ఈ సినిమాలోని పాటలు వినపడుతూనే ఉంటాయి. అయితే కమర్షియల్ గా ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. విజయ్ సినీ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ ఎదుర్కొన్నటువంటి చిత్రం ఇదేనని చెప్పాలి.

Tamannah: నటీనటులుగా అది మా బాధ్యత…


తాజాగా తమన్నా ఈ సినిమా గురించి మాట్లాడుతూ సుర సినిమాలోని పాటలు నాకు చాలా ఇష్టం ఇప్పటికీ ఈ పాటలు అక్కడక్కడ వినపడుతూనే ఉంటాయని తెలిపారు. అయితే ఈ సినిమాలో నా నటన నాకే నచ్చలేదు అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాషూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలు సరిగా చిత్రీకరించలేదు అప్పుడే ఈ సినిమా ఫలితం ఏంటో తమకు అర్థమైందని కాకపోతే ఒక సినిమాకి కమిట్ అయిన తర్వాత నటీనటులుగా ఆ సినిమాని పూర్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంటుందని తెలిపారు.

Ramya Krishna: వామ్మో ఇదేం ఎనర్జీ మేడమ్… తమన్నా పాటకు డాన్స్ ఇరగదీసిన రమ్యకృష్ణ?

Ramya Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రమ్యకృష్ణ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటించి అక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం జైలర్ ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదలకు సిద్ధమైంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన నువ్వు కావాలయ్యా అనే పాట ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే.

ఇక తమన్నా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ఈ పాటకు స్టెప్పులు వేస్తూ అందరిని సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పాటకు నటి రమ్యకృష్ణ డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. రమ్యకృష్ణ తన వ్యానిటీ వ్యాన్‏లో తన ముగ్గురు సిబ్బందితో కలిసి నువ్వు కావాలయ్యా పాటకు డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.


Ramya Krishna: అదరగొట్టిన రమ్యకృష్ణ…

ఈ విధంగా రమ్యకృష్ణ ఈ పాటకు డాన్స్ చేయడంతో ఈ వీడియో చూసినటువంటి పలువురు నెటిజెన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ ..52 ఏళ్ల వయసులో ఇంత ఎనర్జిటీక్ గా డాన్స్ చేయడం ఏంటి మేడం మీరు కేక అంటూ ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో కూడా రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె కూడా ఈ డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలుస్తుంది.