Tag Archives: nagarjuna

బంగార్రాజులో నాగార్జునతో జోడీ కట్టనున్న శ్రీయ..!

గతంలో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో బంగార్రాజు పాత్ర ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బంగార్రాజు టైటిల్ తో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశారు. వీరిద్దరి కాంబోలో బంగార్రాజు సినిమా రాబోతోందని అధికారిక ప్రకటన కూడా చేశారు.అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల లేకపోయింది.

ఈ క్రమంలోనే నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా ఇంకా చిత్రీకరణ ప్రారంభించక ముందే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బంగార్రాజు సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించనున్నారని వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

తాజాగా ఈ సినిమా గురించి మరొక సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా శ్రీయ నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో సందడి చేయనున్నారని మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగచైతన్యకు జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జోడి కట్టనున్నారు.

ఇదివరకే నాగార్జున, శ్రీయ పలు సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే బంగార్రాజు సినిమాలో మరోసారి ఈ జోడి తెరపై సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో ఈ సినిమా ఆగస్టు నెలలో సెట్స్ పైకి వెళ్లి చిత్రీకరణ పనులలో బిజీ కానుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నుంచి తప్పుకున్న నాగ్… రంగంలోకి నేషనల్ స్టార్?

తెలుగు బుల్లితెరపై “బిగ్ బాస్” రియాలిటీ షో నాలుగు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఐదో సీజన్ ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి బిగ్ బాస్ ఐదో సీజన్ ను జూన్‌ నెలలో నిర్వహించాలని షో నిర్వాహకులు భావించినా కరోనా పరిస్థితుల కారణంగా వీలు కాలేదు. దీంతో ఈ షోను ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కచ్చితంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలుగులో నాగార్జున హోస్ట్ చేసిన గత రెండు సీజన్లకి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ ఐదవ సీజన్ కూడా ఆయనకే హోస్టింగ్ బాధ్యతలను అప్పగించాలని షో నిర్వాహకులు భావించారు అయితే నాగార్జున ప్రస్తుతం బంగారు రాజు వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో ఈసారి బిగ్ బాస్ ఐదో సీజన్‌కు హోస్ట్‌గా ఉండకపోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.అలాగే ఐదో సీజన్‌కు హోస్ట్‌గా నేషనల్ స్టార్ రానా ను ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.

ఈసారి బిగ్ బాస్ షోను రానా తనదైన శైలిలో నడిపించి ఏ మేరకు కంటెస్టెంట్లతో ఆడుకుంటారన్నది చూడాలి. అలాగే బిగ్ బాస్ ఐదో సీజన్ కు ఇండస్ట్రీ సెలబ్రిటీలే కాకుండా, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖులను ఈ షో కు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది వీరిలో యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్,యాంకర్ శివ, హైపర్ ఆది, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు సీజన్ ఫైవ్ లోకి అడుగు పెట్టబోతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

జోరు పెంచనున్న ‘నాగార్జున’.. జూన్ నుంచి నాగ్ కొత్త సినిమా మొదలు..!!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో కాస్త వెనకపడ్డాడనే చెప్పాలి.. ఈ సీనియర్ హీరోకి మంచి హిట్ లేక చాలా కాలం అవుతుంది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇటీవల వచ్చిన వైల్డ్ డాగ్ సినిమాకూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకా పోయింది. సినిమాలో రా అండ్ రస్టిక్ యాక్షన్ తో NIA ఆఫీసర్ రోల్ లో కొత్తగా కనిపించారు నాగ్ .

ప్రభు సోలొమన్ టేకింగ్ కూడా రిచ్ గా ఉందన్న కాంప్లిమెంట్స్ వచ్చాయి. కానీ సినిమా మాత్రం నిరాశపరిచింది.సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా నాగ్ స్టోరీ సెలెక్షన్ కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.సినిమాలో ఫిమేల్ లీడ్ లో దియా మీర్జా నటిస్తే.. సయామీ ఖేర్, అతుల్ కుల్ కర్ణి కీలకపాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ ఎవరితో సినిమా చేయబోతున్నారన్నది ఇప్పడు ఆసక్తిగా మారింది.

ఈ క్రమంలో నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌మరార్‌ నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది.ఈ సినిమాలో నాగ్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ను జూన్‌ తొలివారంలో ప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్‌లో నాగార్జున, కాజల్‌ అగర్వాల్‌లపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. హైదరాబాద్‌లో పాటు ఊటీ, లండన్‌, దక్షిణ కొరియాలో ముఖ్యఘట్టాల్ని తెరరకెక్కిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడట నాగ్..!!

‘నాగార్జున – చిరంజీవి’ కలయికలో సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్..!!

ఈ కరోనా వచ్చినప్పటినుంచి జనాలు సినిమా థియేటర్లకు వెళ్లడమే మానేశారు.. ముఖ్యంగా అందరూ ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫాం లకు మొగ్గుచూపుతున్నారు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీ లదే హవా నడుస్తోంది..సోషల్ మీడియా ఎకౌంట్ లో ఫాలోవర్స్ ఎంత ఎక్కవ మంది ఉంటే, అంతగా పాపులారిటీ ఉన్నట్టు.. సినిమా ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీస్ కి కూడా సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉంటే అది అంత పెద్ద బలం అన్నట్టుగా తయారైంది.

ఇప్పటికే అల్లు అరవింద్ అడ్వాన్స్ డ్ గా ఆలోచించి సొంత ఓటీటీ-ఆహాను నెలకొల్పి దాన్ని ఫుల్ సక్సెస్ చేశారు.కేవలం ఏడాది కాలంలోనే ఆహాకి విశేష ఆదరణ దక్కింది. పైగా డిజిటల్ కంటెంట్ విషయంలో కూడా అల్లు అరవింద్ చాల కొత్తగా ఆలోచించారు. అందుకే అల్లు అరవింద్ విజయవంతంగా తన ఆహాను నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీకి భవిష్యత్తు ఉందని మిగిలిన వాళ్లకు కూడా అర్ధమైంది.

అసలుకే తెలుగు ఇండస్ట్రీలో కింగ్ నాగార్జునకి బడా బిజినెస్ మేన్ గా మంచి పేరు ఉంది.ఎలాగూ ఓటిటీకి సక్సెస్ ఫుల్ ఫ్యూచర్ ఉందని నేటి పరిస్థితులు ప్రూవ్ చేస్తున్నాయి కాబట్టి.. తానూ ఎందుకు ఓటిటీ సంస్థను పెట్టకూడదు అని ఆలోచనలో పడ్డాడట నాగ్. పైగా థియేటర్లతో సంబంధం లేకుండా ఓటీటీలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీనికి తోడు కరోనా కూడా ఓటిటీలకు పెద్ద ప్లస్ అయింది. జనం థియేటర్స్ కి వెళ్లడం మానేసారు. చక్కగా ఇంట్లోనే కూర్చుని ఓటిటీలో తమకు నచ్చిన సినిమాని చూసుకుంటున్నారు.అన్నిటికి మించి ఓటీటీలో నష్టాలు తక్కువుగా కనిపిస్తున్నాయి.

పైగా అక్కినేని కుటుంబంలో కూడా ఐదుగురు హీరోలు ఉన్నారు. ఏడాదికి అక్కినేని ఫ్యామిలీ నుండి ఏడు ఎనిమిది సినిమాలు వస్తున్నాయి. అలాగే అక్కినేని బ్యానర్ పై చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ ఉంటారు. అక్కినేని ఫిల్మ్ స్కూల్ నుండి కూడా స్టూడెంట్స్ ఏడాదికి వందల మంది బయటకు వస్తున్నారు. వారికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.అందుకే మెగాస్టార్ తో లేదా మరో పార్ట్నర్ తో కలిసి నాగార్జున సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి కింగ్ నాగార్జునతో ఎవరు భాగస్వామ్యం అవుతారో చూడాలి…!!

‘బంగార్రాజు’ కి లైన్ క్లియర్..ఇక అస్సలు ఆగేదే లేదట..!!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు..ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ లో ఈ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది..దీంతో నాగ్ నటించే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తి మొదలైంది..ఇదిలా ఉంటే తాజాగా నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ పై ఎట్టకేలకూ క్లారిటీ వచ్చింది. బంగార్రాజు సినిమా జులై రెండో వారం నుంచి చిత్రీకరణ మొదలు కానుందని నాగార్జున తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

నిజానికి బంగార్రాజు సినిమాని ఎప్పుడో స్టార్ట్ చేద్దామనుకుని నాగార్జున భావించినా బిగ్ బాస్ షో, వేరే సినిమాలు, మరికొన్ని కారణాల వలన ఇంతకాలం లేట్ అవుతూ వచ్చింది.దాంతో అక్కినేని అభిమానులు గత నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా అప్ డేట్ కోసం కళ్ళు వాచిపోయేలా ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ సినిమా గురించి ఇన్నాళ్లు అధికారికంగా అతిగతి లేకుండా పోవడంతో చివరకు ‘బంగార్రాజు’ రాక పై నాగ్ ఫ్యాన్స్ లో కూడా నిరాశ కమ్ముకుంది.

వారిలో ఉన్న ఆసక్తి కూడా కరిగిపోయినా తరువాత గానీ, మొత్తానికి ‘బంగార్రాజు’ పరిస్థితి ఓ కొలిక్కి రావడం విశేషం. నాగ్ ఈ సినిమాని జులై నుండి డేట్స్ ఇచ్చాడు.ఎంతైనా అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కీలకమైనది. 2016 లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. అప్పటివరకు నాగార్జున హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ సినిమా కింగ్ కెరీర్ కి పెద్ద బలాన్ని ఇచ్చింది.

నాగ్ స్టార్ డమ్ మీద ఏర్పడిన అనుమాలన్నిటిని పటాపంచలు చేసింది. ఈ సినిమాలో నాగ్ రెండు పాత్రల్లో నటించగా అందులో బంగార్రాజు పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.ఆ ఊపులోనే సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇంతకాలం తరువాత ఇప్పుడన్నీ సెట్ కావటంతో ఈ మూవీని మొదలెట్టేందుకు సిద్ధం అవుతున్నారు..ఇక త్వరలోనే

లేటెస్ట్ అప్డేట్.. బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ ఎవరో తెలుసా?

బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షోలో బిగ్ బాస్ కి ఎంతో క్రేజ్ ఉంది. మొదటగా హిందీలో ప్రసారమైన ఈ షో తరువాత పలు భాషలలో ప్రసారం అవుతూ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలోనే తెలుగులో ఈ కార్యక్రమం నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ నెలలోనే నాలుగో సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా ప్రభావం వల్ల సెప్టెంబర్ లో ప్రారంభమై, 106 రోజుల పాటు కొనసాగింది. బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో అభిజిత్ విజేతగా నిలిచారు.

బిగ్ బాస్ నాలుగవ సీజన్ పూర్తికాగానే ఐదవ సీజన్ త్వరలోనే నిర్వహించాలని బిగ్ బాస్ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే సీజన్ 5 లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్ళు అంటూ గత కొద్ది రోజుల క్రితం వరకు ఈ సోషల్ మీడియాలో వార్తలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలోనే సీజన్ ఫైవ్ తొందరలోనే మొదలవుతుందని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో గురించి తాజా సమాచారం వినబడుతోంది.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు గత ఏడాది కంటే దారుణం గా ఉండటం వల్ల ఇప్పుడే ఈ షోను నిర్వహించే ఆలోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు లేరని తెలుస్తోంది.పరిస్థితులు కొద్దిగా చక్కబడిన తరువాత గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సెప్టెంబర్ నెలలో సీజన్ 5 ప్రసారం కానుందని తెలుస్తోంది.

ఇప్పటివరకు ప్రసారమైన నాలుగు సీజన్లలో మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ కాగా, రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. మిగతా రెండు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అయితే తర్వాత రాబోయే సీజన్ 5 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలు అన్నింటి పైనా క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ షో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

కరోనా పరీక్ష చేయించుకున్న యాంకర్ సుమ.. చివరకు..?

దేశంలో కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా భయపెడుతోందనే సంగతి తెలిసిందే. ఈరోజు స్టార్ హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులను కరోనా భయం వెంటాడుతోంది. తాజాగా స్టార్ యాంకర్ సుమ కరోనా పరీక్ష చేయించుకున్నారు. సుమ బిగ్ బాస్ షోకు హాజరు కావడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. రాజమౌళి, బండ్ల గణేష్, తమన్నా కరోనా బారిన పడి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. చిరంజీవికి కరోనా నిర్ధారణ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నాగార్జున, సీఎం కేసీఆర్, రామ్ చరణ్, కొరటాల శివ, రాజమౌళి మరికొందరు రాజకీయ, సినీ ప్రముఖులు రాజమౌళికి సన్నిహితంగా మెలిగారని సమాచారం.

దీంతో వాళ్లందరూ కరోనా పరీక్షలకు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే యాంకర్ సుమ బిగ్ బాస్ షోకు వెళ్లకముందు కరోనా పరీక్ష చేయించుకోగా మారిన పరిస్థితుల నేపథ్యంలో మరోసారి కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాగార్జున రెండు రోజుల క్రితం చిరంజీవితో పాటు సీఎం కేసీఆర్ ను కలిశారు. ఆ సమయంలో అక్కడ చిరంజీవి, నాగార్జున , కేసీఆర్ మాస్కులు ధరించలేదు.

దీంతో నాగార్జునకు కరోనా సోకుతుందేమోనని బిగ్ బాస్ టీంకు సైతం టెన్షన్ పట్టుకుంది. సుమ తాను కరోనా పరీక్ష చేయించుకున్న వీడియోను షేర్ చేస్తూ తాను బిగ్ బాస్ షోకు వెళ్లిన తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసని వెళ్లకముందు ఏం జరిగిందో చూడండంతూ వీడియోతో ట్వీట్ చేసింది. ఆ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఆమె బిగ్ బాస్ షోకు హాజరయ్యారు.