తెలుగు బుల్లితెరపై “బిగ్ బాస్” రియాలిటీ షో నాలుగు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఐదో సీజన్ ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి బిగ్ బాస్ ఐదో సీజన్ ను జూన్ నెలలో నిర్వహించాలని షో నిర్వాహకులు భావించినా కరోనా పరిస్థితుల కారణంగా వీలు కాలేదు. దీంతో ఈ షోను ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కచ్చితంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలుగులో నాగార్జున హోస్ట్ చేసిన గత రెండు సీజన్లకి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ ఐదవ సీజన్ కూడా ఆయనకే హోస్టింగ్ బాధ్యతలను అప్పగించాలని షో నిర్వాహకులు భావించారు అయితే నాగార్జున ప్రస్తుతం బంగారు రాజు వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో ఈసారి బిగ్ బాస్ ఐదో సీజన్‌కు హోస్ట్‌గా ఉండకపోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.అలాగే ఐదో సీజన్‌కు హోస్ట్‌గా నేషనల్ స్టార్ రానా ను ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.
ఈసారి బిగ్ బాస్ షోను రానా తనదైన శైలిలో నడిపించి ఏ మేరకు కంటెస్టెంట్లతో ఆడుకుంటారన్నది చూడాలి. అలాగే బిగ్ బాస్ ఐదో సీజన్ కు ఇండస్ట్రీ సెలబ్రిటీలే కాకుండా, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖులను ఈ షో కు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది వీరిలో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్,యాంకర్ శివ, హైపర్ ఆది, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు సీజన్ ఫైవ్ లోకి అడుగు పెట్టబోతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…