Categories: FeaturedMovie News

చంద్ర మోహన్‌కి యంగ్ హీరోలతో ఎదురైన చేదు అనుభవాలు.. అందుకే దణ్ణం పెట్టి ఊరుకున్నాడా..!

సీనియర్ నటీ నటులకు ఇప్పటి తరం హీరోలు గానీ, దర్శకులు గాని అంత గౌరవం ఇవ్వడం లేదని గత కొంతకాలంగా చాలామంది సీనియర్ నటీ నటులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఈ విషయాలను బయటికి చెప్పకపోయినా.. కోట శ్రీనివాస్ రావు, చంద్ర మోహన్ లాంటి వాళ్ళు మాత్రం ఇలా చెప్పడంతోనైనా కొంత నేర్చుకుంటారని ఉండబట్టలేక కొన్ని ఇంటర్వ్యూస్ లో ఓపెన్ అయిపోతున్నారు. నిజంగా చాలామటుకు ఇప్పటి వాళ్ళకి ఆ తరం గొప్ప నటీనటుల గురించి తెలియడం లేదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇక ముంబై హీరోయిన్స్ అయితే చెప్పేదేమీ లేదు. ఆనాటి సీనియర్ స్టార్స్ గురించి ఒక్క ముక్కా తెలియదంటే నమ్మి తీరాల్సిందే.

సీనియర్ హీరో.. ప్రముఖ నటులు చంద్ర మోహన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదురైన కొన్ని సంఘటనలు..యువ హీరోలతో జరిగిన చేదు అనుభవాలను పంచుకున్నారు. అందులో ఆయన బాధ్యత తో పాటు ఆవేదన తీవ్రంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పటి వారు హీరోలు దర్శకులు ఎక్కువ కొంతమంది ఓ రెండు సినిమాలు హిట్ అవగానే మా అంతటి వారు లేరనే గర్వం పెరిగిపోతుంది. ఆ తర్వాత ఒక్క ఫ్లాప్ పడితే ఇక ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోతున్నారు. అదే విషయాన్ని చంద్ర మోహన్ కూడా తన మాటల్లో తెలిపారు.

చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం సినిమాతో సినీ ప్రయాణం మొదలైంది.

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. తెలుగు సినిమా రంగంలోకి నటుడుగా అడుగు పెట్టాక తనపేరు చంద్రమోహన్ గా మారింది. ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఎన్నో విలక్షణమైన, విభిన్నమైన పాత్రలు పోషించారు. చంద్రమోహన్ హీరోగా 175 పైగా సినిమాలు చేయడం విశేషం. ఇక ఆయన నటించిన మొత్తం సినిమాలను చూస్తే దాదాపు 930 కి పైగానే నటించాడు. చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం సినిమాతో సినీ ప్రయాణం మొదలైంది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న సహాయక పాత్రల్లో నటించాడు.

ఆ పాత్రల్లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సెకండ్ హీరోగా, సోలో హీరోగా అవకాశాలు అందుకొని అద్భుతమైన క్లాసిక్స్ లో నటించి గొప్ప నటుడుగా పాపులారిటీని పొందారు. చంద్రమోహన్ సరసన నటించిన కొత్త హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ గా సౌత్ లో ఒక వెలుగుతారని మంచి అభిప్రాయం, నమ్మకం కలిగించాడు. ఒకరకంగా చెప్పాలంటే హీరోలకి హీరోయిన్స్ లక్కీ అనేదానికి రివర్స్‌లో హీరోయిన్స్ కి ఈయన లక్కీ అని చెప్పుకునేలా పేరు సంపాదించారు. అందుకు ఉదాహరణ సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి. చంద్రమోహన్ తో డెబ్యూస్ సినిమా చేసిన వీరు అగ్రతారామణులుగా వెలిగారు.

చంద్ర మోహన్ పర్ఫార్మెన్స్‌కి కన్నీళ్ళతో బరువెక్కిన హృదయాలు చాలానే ఉన్నాయి.

ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించి మంచివిజయాలను అందుకున్న చంద్ర మోహన్ ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. ఆయన చేసిన పాత్రల్లో కామెడి పాత్రలు బాగా గుర్తుండిపోతాయి. ఇక సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో చంద్ర మోహన్ పర్ఫార్మెన్స్‌కి కన్నీళ్ళతో బరువెక్కిన హృదయాలు చాలానే ఉన్నాయి. అంతటి గొప్ప నటుడుకి ఈ తరం హీరోలు కొందరు అంత మర్యాద ఇవ్వడం లేదని, షూటింగ్ స్పాట్లో ఏదైనా సలహాలిస్తే అవి తీసుకు వెళ్ళి దర్శకుడికి చెప్పి సమస్యగా చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

పక్కన కాంతారావు లాంటి వారు వెళుతున్నా పట్టించుకొని వాళ్ళు ఇప్పటితరంలో ఉన్నారని అన్నారు. మమ్మలిని మేము పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని..అందుకే ఇప్పటివారికి ఎలాంటి సలహాలు, ఇవ్వడం లేదని ఒకసారి జరిగిన సంఘటనతో నాదే పొరపాటు అని చేతులెత్తు దణ్ణం పెట్టిన సందర్భం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మా కాలంలో ఉన్న డిసిప్లైన్, కసి, పట్టుదల..నటనకోసం పడే తాపత్రయం ఇప్పటి వారిలో చాలామందికి లేవని తీవ్రంగా తన బాధను వెల్లడించారు. అయితే తనని అంతగా బాధ పెట్టిన ఆ యంగ్ హీరో పేరు మాత్రం చెప్పేందుకు ఇష్టపడలేదు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago