Tag Archives: negative role

Varun Tej: ఆ పని చేస్తే నన్ను చంపేస్తారు.. వరుణ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు!

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పెళ్లి తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా మార్చి ఒకటవ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి నటుడు వరుణ్ రిపోర్టర్స్ నుంచి ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఎదురయింది.

మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్రలలో నటించాలనే ఆలోచనలో ఉన్నారా అనే ప్రశ్న ఈయనకు రిపోర్టర్ నుంచి ఎదురయింది ఇలా ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెబుతూ నేను కనుక అలా నటిస్తే నన్ను కొట్టి చంపేస్తారు అంటూ వరుణ్ తేజ్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పవన్ సినిమాలో విలన్..

ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక మెగా హీరో సినిమాలో మరో మెగా హీరో విలన్ గా నటించాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. పవన్ కళ్యాణ్ బాబాయ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం తాను ఎదురుచూస్తున్నాను కానీ ఇలా విలన్ గా చేయాలని అసలు కోరుకోవడం లేదు అంటూ వరుణ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Samantha: మరోసారి నెగెటివ్ పాత్రలో సమంత.. ఈసారి అలా ప్రేక్షకులను భయపెట్టనుందా!

Samantha: నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత వరస పెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే పుష్ఫ సినిమాలో చేసిన ‘ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా..’ ఐటెం సాంగ్ తో దేశవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత నటించిన ఐటెం సాంగ్ కావడంతో జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు.

Samantha: మరోసారి నెగెటివ్ పాత్రలో సమంత.. ఈసారి అలా ప్రేక్షకులను భయపెట్టనుందా!

సమంత అందాలు, దేశీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే మరోవైపు క్రేజీ ప్రాజెక్ట్ లలో సమంత నటిస్తోంది. గుణ శేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ శాకుంతలం సినిమాలో నటిస్తోంది. మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘యశోధ’ మూవీని చేస్తోంది.

Samantha: మరోసారి నెగెటివ్ పాత్రలో సమంత.. ఈసారి అలా ప్రేక్షకులను భయపెట్టనుందా!

మరోవైపు హాలీవుడ్ మూవీలో కూడా నటిస్తోంది. హాలీవుడ్‌ మూవీ ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ సినిమాలో తాను బై-సెక్సువల్‌ యువతి పాత్ర పోషిస్తున్న విషయాన్ని తానే ప్రకటించింది.  ఇదిలా ఉంటే నెగిటివ్ రోల్ లో ఛాలెజింగ్ పాత్రలను చేస్తోంది సమంత. ఇప్పటికే ‘ ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్ లో నెగిటివ్ రోల్ ఉన్న పాత్రలో నటించింది.


‘ఖతిజా’ పాత్రలో విజయ్ సేతుపతి..

అంతకుముందు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన సమంత… ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో సూపర్ రోల్ చేసింది. అయితే తమిళంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత లీడ్ క్యారెక్టర్లుగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ‘కాత్తువాక్కుల రెండు కాదల్‌’ సినిమా చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో సమంత నెగిటివ్ రోల్ ప్లే చేస్తోంది. ‘ఖతిజా’ పాత్రలో విజయ్ సేతుపతి, నయన తార ప్రేమాయణానికి అడ్డుపడి సమంత తన విలనిజంతో కథను మలుపు తిప్పనుందట. అయితే ఈ క్యారెక్టర్ లో సమంత సూపర్ పెర్ఫామెన్స్ చేసిందని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.