Tag Archives: netflix

Gangavva: గంగవ్వ కోసం ప్రత్యేకంగా కేరవాన్.. గంగవ్వ రేంజ్ మామూలుగా లేదుగా.. వైరల్ వీడియో?

Gangavva: గంగవ్వ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు గంగవ్వ అందరికీ సుపరిచితమే.గంగవ్వకు ఏమాత్రం లోకజ్ఞానం తెలియకపోయినా చదువు గురించి ఏ మాత్రం పట్టు లేకపోయిన కేవలం తనలో ఉన్న టాలెంట్ బయట పెట్టడంతో కొంతమంది కుర్రాళ్ళు ఆమె టాలెంట్ గుర్తించి మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి గంగవ్వ వీడియోలను షేర్ చేసేవారు.

ఈ విధంగా యూట్యూబ్ లో గంగవ్వ వీడియోలు ఓ రేంజ్ లో అందరిని ఆకట్టుకున్నాయి. ఇలా రోజురోజుకు గంగవ్వ తనలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ రోజు రోజుకు విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇదే పాపులారిటీతో ఈమెకు ఏకంగా బిగ్ బాస్ సీజన్ 4 అవకాశం కూడా వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన గంగవ్వ అనారోగ్యం కారణంగా మధ్యలోనే బయటకు వచ్చింది.

గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయానికి తన దగ్గర కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేకపోవడంతో తనకు ఇల్లు కట్టిస్తానని నాగార్జున మాటిచ్చారు.ఆయన మాట ప్రకారం గంగవ్వ కొత్త ఇల్లు కట్టడమే కాకుండా గత ఏడాది గృహప్రవేశం కూడా చేశారు. ఇక గంగవ్వ గృహ ప్రవేశ కార్యక్రమంలో భాగంగా కొందరు సెలబ్రిటీలు సందడి చేశారు. ఇదిలా ఉండగా ఈమెకు వచ్చిన పాపులారిటీతో ఏకంగా ఈమె వరస సినిమా అవకాశాలను అందుకుని బిజీగా ఉన్నారు.

క్యారవాన్ రేంజ్ కు వెళ్లిన గంగవ్వ…

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా గంగవ్వ కోసం నిర్మాతలు ఏకంగా ప్రత్యేకంగా కేరవాన్ ఏర్పాటు చేశారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలకు మాత్రమే కేరవాన్ ఏర్పాటు చేస్తారు. ఓ మోస్తారు నటీనటులకు ఇలాంటి క్యారవాన్ సదుపాయం ఉండదు. అయితే గంగవ్వ కోసమే ప్రత్యేకంగా క్యారవాన్ ఏర్పాటు చేశారంటేనే గంగవ్వ రేంజ్ ఏంటో ఎంతో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే గంగవ్వ కేరవాన్ కి సంబంధించిన ఒక వీడియోని ఆ అనుభూతులను వీడియో రూపంలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Puspha Movie: పుష్ప మూవీపై ఫన్నీ ట్వీట్స్ చేసిన.. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్!

Puspha Movie: ఓటీటీ బిజినెస్.. కరోనాకు మందు కరోనా తర్వాత చూడాలేమో. కరోనా పుణ్యమా అని ఓటీటీలు అందరికి చేరువయ్యాయి. లాక్ డౌన్ కాలంలో ఓటీటీలు జనాలకు దగ్గరయ్యాయి. లాక్ డౌన్ కాలంలో ఎక్కువగా వినోదాన్ని పంచినవి ఓటీటీలే.. అరచేతిలోనే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తుండటంతో పెద్ద సంఖ్యలో జనాలు ఓటీటీల వైపు మళ్లారు.

Puspha Movie: పుష్ప మూవీపై ఫన్నీ ట్వీట్స్ చేసిన.. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్!

ఆహా, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ రావడంతో సినిమాలు థియేటర్లు విడుదలైన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. కరోనా కారణంగా విడుదలకు నోచుకోని ఎన్నో సినిమాలు ఓటీటీ దారి పట్టాయి. 

Puspha Movie: పుష్ప మూవీపై ఫన్నీ ట్వీట్స్ చేసిన.. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్!

ఇదిలా ఉంటే దిగ్గజ ఓటీటీ సంస్థలు అయిన అమెజాన్ ప్రైమ్, నెటి ఫ్లిక్స్ మధ్య ఫన్నీగా ట్విట్ వార్ జరిగింది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ‘ఈ వారాంతంలో చూడటానికి మీ వాచ్‌లిస్ట్‌లో ఏం ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. దీనికి అమేజాన్ రిప్లై ఇస్తూ.. ‘అందరూ పుష్ప: ది రైజ్ చూస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. 

ప్రస్తుతం జనాలు విపరీతంగా పుష్ప సినిమాను..

అయితే దీనికి నెట్‌ఫ్లిక్స్ ఫ‌న్నీగా రిప్లై ఇస్తూ.. ‘ఆ అంద‌రూ అంటే..మేమేనా.? ఊ అనం.. కానీ ఊ ఊ కూడా అనం..’ అని ట్వీట్ చేశారు. ఫన్నీగా జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రెండు దిగ్గజ ఓటీటీలు ఇలా స్పందించడం జనాలకు ఫన్నీగా అనిపించింది. ఇదిలా ఉంటే ఈనెల 7న అమెజాన్ ప్రైమ్ లో పుష్ప రిలీజ్ అయింది. హిందీ మినహా తమిళ్, కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం జనాలు విపరీతంగా పుష్ప సినిమాను చూస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్.. ఈ తేదీల్లో ఫ్రీగా వీడియోలు చూసే ఛాన్స్..?

కరోనా మహమ్మారి ధాటికి ప్రజలు థియేటర్ల పేరు చెబితేనే భయపడిపోతున్నారు. థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులు ఇప్పట్లో సినిమాలు చూసే పరిస్థితులు కనిపించడం లేదు. 50 శాతం ఆక్యుపెన్సీతో కేంద్రం థియేటర్లకు అనుమతులిచ్చినా దేశంలోని ప్రజలు ఓటీటీ ద్వారా, యూట్యూబ్ ద్వారా దొరికే ఎంటర్టైన్మెంట్ నే ఇష్టపడుతున్నారు. అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్, ఆహా, జీ5 లాంటీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది.

ఓటీటీల ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్ లు, టాక్ షోలను వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫాం ద్వారా సినిమాలు, వీడియోలు, వెబ్ సిరీస్ లు చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. ఎవరైతే సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారో వారు మాత్రమే ఆన్ లైన్ లో వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది స్నేహితుల దగ్గరో, బంధువుల దగ్గరో నెట్ ఫ్లిక్స్, ఇతర ఓటీటీ యాప్స్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తీసుకొని సినిమాలను వీక్షిస్తూ ఉంటారు.

అయితే నెట్‌ఫ్లిక్స్ తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా సినిమాలు, ఇతర ప్రోగ్రామ్ లు చూడాలనుకునే వారి కోసం అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 5, 6 డబ్బులు చెల్లించకుండానే ఉచితంగా వీడియోలను చూసే అవకాశాన్ని నెట్ ఫ్లిక్స్ కల్పిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ ఫెస్ట్‌ పేరుతో ఈ ఆఫర్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ రెండు రోజుల తరువాత మాత్రం ఉచితంగా వీక్షించడానికి వీలు కాదు.

ఓటీటీలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా ప్రేక్షకుల నుంచి ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఈ ఛార్జీలు 200 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో ఉండటం గమనార్హం. కొన్ని ఓటీటీలు నెలవారీ ఛార్జీలను వసూలు చేస్తుంటే మరికొన్ని మాత్రం సంవత్సరానికి వసూలు చేస్తుండటం గమనార్హం.