Puspha Movie: పుష్ప మూవీపై ఫన్నీ ట్వీట్స్ చేసిన.. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్!
Puspha Movie: ఓటీటీ బిజినెస్.. కరోనాకు మందు కరోనా తర్వాత చూడాలేమో. కరోనా పుణ్యమా అని ఓటీటీలు అందరికి చేరువయ్యాయి. లాక్ డౌన్ కాలంలో ఓటీటీలు జనాలకు దగ్గరయ్యాయి. లాక్ డౌన్ కాలంలో ఎక్కువగా వినోదాన్ని పంచినవి ఓటీటీలే.. అరచేతిలోనే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తుండటంతో పెద్ద సంఖ్యలో జనాలు ఓటీటీల వైపు మళ్లారు.
ఆహా, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ రావడంతో సినిమాలు థియేటర్లు విడుదలైన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. కరోనా కారణంగా విడుదలకు నోచుకోని ఎన్నో సినిమాలు ఓటీటీ దారి పట్టాయి.
ఇదిలా ఉంటే దిగ్గజ ఓటీటీ సంస్థలు అయిన అమెజాన్ ప్రైమ్, నెటి ఫ్లిక్స్ మధ్య ఫన్నీగా ట్విట్ వార్ జరిగింది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ‘ఈ వారాంతంలో చూడటానికి మీ వాచ్‌లిస్ట్‌లో ఏం ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. దీనికి అమేజాన్ రిప్లై ఇస్తూ.. ‘అందరూ పుష్ప: ది రైజ్ చూస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
అయితే దీనికి నెట్‌ఫ్లిక్స్ ఫన్నీగా రిప్లై ఇస్తూ.. ‘ఆ అందరూ అంటే..మేమేనా.? ఊ అనం.. కానీ ఊ ఊ కూడా అనం..’ అని ట్వీట్ చేశారు. ఫన్నీగా జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రెండు దిగ్గజ ఓటీటీలు ఇలా స్పందించడం జనాలకు ఫన్నీగా అనిపించింది. ఇదిలా ఉంటే ఈనెల 7న అమెజాన్ ప్రైమ్ లో పుష్ప రిలీజ్ అయింది. హిందీ మినహా తమిళ్, కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం జనాలు విపరీతంగా పుష్ప సినిమాను చూస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…