Tag Archives: ntr

Super Star Krishna: ఆ సినిమా విషయంలో ఎన్టీఆర్ “మీరు రాయక్కర్లేదు.. మేము తీయక్కర్లేదు పొండి” అన్నారు… ఎన్టీఆర్ గురించి కృష్ణ షాకింగ్ కామెంట్స్!

Super Star Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప కథానాయకులుగా పేరు సంపాదించుకున్న వారిలో నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నందమూరి తారకరామారావు హీరోగా చేస్తున్న సమయంలో కృష్ణ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.ఇకపోతే కృష్ణ కేవలం హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇకపోతే గతంలో ఒక సినిమా విషయంలో ఎన్టీఆర్,కృష్ణ మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు వచ్చాయని ఆ సినిమా కారణంగా వీరి ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని మనకు తెలిసిందే. ఆ సినిమానే అల్లూరి సీతారామరాజు. తాజాగా కృష్ణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సమయంలో కృష్ణ కాలేజీకి వెళ్తున్నానని ఆ సమయంలో ఎన్టీఆర్ సినిమాలు ఏవి వచ్చిన తప్పనిసరిగా ఆ సినిమా చూసే వాడినని తెలిపారు.ఈ క్రమంలోనే అగ్గి రాముడు సినిమాలో బుర్ర కథలో భాగంగా అల్లూరి సీతారామరాజు కథ చెప్పినప్పుడు ఎంతో ఇన్స్పైర్ అయ్యారని కృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇకపోతే ఈ సినిమాని ఎన్టీఆర్ హీరోగా చేస్తే చూడాలని ఉంది అంటూ భావించారు. ఇక తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పదకొండవ చిత్రం అసాధ్యుడు సినిమాలో సీతారామరాజు అంతర్నాటకం పెట్టారు. ఈ నాటకంలో అల్లూరి పాత్రలో నటించానని ఈ పాత్రను ప్రతి ఒక్క ప్రేక్షకుడికి 100% నచ్చిందని కృష్ణ వెల్లడించారు. ఇక అల్లూరి సీతారామరాజు సినిమా ఎప్పుడు చేస్తారంటూ ప్రతిసారి ఎన్టీఆర్ ను అడిగినప్పుడు ఉండవయ్య నువ్వు, తర్వాత చూస్తాను.. ఇప్పుడు కాదు అని సమాధానం చెప్పేవారు. కానీ ఈ సినిమాని మాత్రం చేయలేదు.

ఈ క్రమంలోనే దేవుడు చేసిన మనుషులు తర్వాత తానే అల్లూరి సీతారామరాజు కథను అనౌన్స్ చేసి సినిమా చేశాను. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చేసిన తర్వాత దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఎన్టీఆర్ కు తనకు మాటలు లేవని కృష్ణ తెలిపారు. ఇక ఒక సందర్భంలో భాగంగా రచయితల అందరితో కలిసి మాట్లాడిన ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజు కథ చేద్దాం కథ రాయమని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారు.

ఈ క్రమంలోనే పరుచూరి బ్రదర్స్ ఎన్టీఆర్ తో మాట్లాడుతూ మీరు ఏమి అనుకోకపోతే మాది ఒక చిన్న విన్నపం ముందు మీరు కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూడండి ఆ సినిమా చూసిన తర్వాత మీరు సినిమా చేస్తాను అంటే మేము కథ ఇస్తాము అని చెప్పారు. అయితే ఒక సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ కృష్ణ పక్క పక్క రూములోనే మేకప్ వేసుకుని బయటకు రాగా ఎన్టీఆర్ బ్రదర్ అని పిలిచారు.

ఇంతకన్నా అద్భుతంగా ఎవరు నటించలేరు….

మీరు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ఇప్పటి వరకు నేను చూడలేదు అయితే నేను ఆ సినిమాని చూడాలనుకుంటున్నాను అది కూడా మీరు పక్కన ఉంటేనే నేను చూస్తాను అంటూ చెప్పారు. ఎన్టీఆర్ ఇలా చెప్పడంతో అప్పటికప్పుడు ఈ సినిమా రీల్ తెప్పించి చూసే ఏర్పాట్లు చేసాము. ఇలా పూర్తి సినిమా చూసిన ఎన్టీఆర్ సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంది ఇంత కన్నా అద్భుతంగా ఎవరు చేయలేరు గుడ్ జాబ్ బ్రదర్ అంటూ తనని ప్రశంసించారని కృష్ణ వెల్లడించారు. ఇక ఈ సినిమా చూసిన తరువాత పరుచూరి బ్రదర్స్ ఎన్టీఆర్ ను కలిసి అన్నగారు అల్లూరి సీతారామరాజు కథ రాయమంటారా? అని అడిగారు. దీంతో మీరు రాయనక్కర్లేదు మేము తీయాల్సిన పని లేదు… ఇంత కన్నా అద్భుతంగా ఇంకెవరూ చేయలేరు అంటూ అల్లూరి సీతారామరాజు సినిమా గురించి ఎన్టీఆర్ ప్రశంశలు అందించారని కృష్ణ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

Balakrishna: ఎన్టీఆర్ చేసిన సినిమాలలో బాలకృష్ణ ఏ ఏ సినిమాలను రీమేక్ చేశారో తెలుసా?

Balakrishna: సాధారణంగా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు చేయడం సర్వసాధారణం ఈ క్రమంలోనే వివిధ భాషలలో మంచి విజయాలను అందుకున్న చిత్రాలను ఇతర భాషలలో రీమేక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నందమూరి తారకరామారావు ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలు పౌరాణిక చిత్రాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఈయన బాటలోనే ఆయన వారసుడిగా నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మరిన్ని విజయాలను అందుకున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ నటించిన పలు క్లాసికల్ చిత్రాలను బాలకృష్ణ రీమేక్ చేశారు. మరి ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో బాలకృష్ణ ఏ ఏ సినిమాలను రీమేక్ చేశారో ఇక్కడ తెలుసుకుందాం…ఎన్టీఆర్ హీరోగా కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన నర్తనశాల చిత్రాన్ని బాలకృష్ణ ‘శ్రీ మద్విరాట పర్వము’ పేరుతో రీమేక్ చేసారు.

అలాగే ఎన్టీఆర్ నటించిన వద్దంటే డబ్బు సినిమాని కొద్దిగా మార్పులు చేసి జంధ్యాల దర్శకత్వంలో బాబాయ్ అబ్బాయి అనే సినిమాని చేసి మంచి హిట్ అందుకున్నారు. అలాగే ఎన్టీఆర్ రాముడు భీముడు అనే సినిమాని బాలకృష్ణ కథలో కొన్ని మార్పులు చేసి రాముడు భీముడు అనే టైటిల్ తో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.

ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు..


ఎన్టీఆర్ నటించిన గులేబకావళి కథ’, ‘జగదేకవీరునికథ’, ‘రాజపుత్ర రహస్యం’ వంటి సినిమాల నుంచి కొద్దిగా కథను తీసుకొని భైరవద్వీపం కథ తెరకెక్కించారు. బాలకృష్ణ సినీ కెరీయర్ లో భైరవద్వీపం మంచి హిట్ అందుకుంది.ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం సినిమానీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ పాండురంగడు సినిమాగా రీమేక్ చేశారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాలో కొంత భాగం ఆధారంగా చేసుకొని శ్రీకృష్ణార్జున విజయము అనే సినిమాని తెరకెక్కించారు. ఎన్టీఆర్ లవకుశ చిత్రాన్ని బాలకృష్ణ శ్రీరామరాజ్యంగా రీమేక్ చేశారు. అలాగే ఎన్టీఆర్ జీవిత కథాంశంతో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహా నాయుడు అనే సినిమాలలో కూడా బాలకృష్ణ నటించారు.

Vetagadu : ఒకే టైటిల్ తో వచ్చిన ఎన్టీఆర్, రాజశేఖర్ ల చిత్రాలలో ఒక్క సినిమానే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.!!

అడవి రాముడు లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి తారక రామారావు. తిరిగి అనేక చిత్రాలు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించారు. నిర్మాత అర్జునరాజు ఎన్టీరామారావు దగ్గరికి వెళ్ళేసరికి ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి డేట్స్ ఖాళీ లేకుండా అనేక చిత్రాలతో ఎన్టీరామారావు బిజీగా ఉన్నారు. ఆ క్రమంలో ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలనుందని అడగడంతో… ఇదివరకు ఎన్టీఆర్ తో “పరమానందయ్య శిష్యుల కథ” వంటి చిత్రాలను నిర్మించిన తోట సుబ్బారావు దగ్గర తన డేట్స్ ఉన్నాయని ఆయన సినిమా నిర్మించే ఆర్థిక పరిస్థితులలో లేరని చెప్పడంతో.. నిర్మాత అర్జనరాజు వెళ్లి కొంత డబ్బులు చెల్లించి ఎన్టీఆర్ డేట్స్ తీసుకున్నారు.

అలా 1979 అర్జునరాజు నిర్మాణం, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో “వేటగాడు” చిత్రం విడుదలయ్యింది. అడవి రాముడు చిత్రం లాంటి అడవి నేపథ్యంతో కూడిన వేటగాడు చిత్రాన్ని రూపొందించడం జరిగింది. జంధ్యాల కథ, మాటలు వేటగాడు చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. శ్రీదేవి మొదటి సారిగా ఎన్టీఆర్ తో జోడిగా ఈ సినిమాలో నటించారు.

రావు గోపాల్ రావు, సత్యనారాయణ తండ్రీకొడుకులుగా విలనిజం తో పాటు మంచి హాస్యాన్ని పండించారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి అందించిన “ఆకు చాటు పిందె తడిసే..కొమ్మ చాటు పువ్వు తడిసే.. అనే పాట ఆ రోజుల్లో ఆంధ్ర దేశం అంతటా ఒక ఊపు ఊపింది. ఆ సంవత్సరానికి గాను వేటగాడు సినిమా అద్భుత విజయాన్ని సాధించింది…

అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి చిత్రాలతో యాంగ్రీ యంగ్ హీరోగా రాజశేఖర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి సినీ పరిశ్రమకు సుపరిచితుడు. 1956 లో వచ్చిన ఇంగ్లీష్ నవల ఆధారంగా “ఏ కిస్ బిఫోర్ డైయింగ్” అనే మూవీ వచ్చింది. ఈ చిత్రాన్ని ఆధారం చేసుకొని ఇండియన్ మసాలా జోడిస్తూ… 1993 అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో “బాజీగర్” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్, కాజోల్, శిల్పాశెట్టి హీరో, హీరోయిన్లుగా నటించారు. పగ ప్రతీకారాలతో సాగిన ఈ బాలీవుడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. బాజీగర్ సినిమా హక్కులు తీసుకొని.. 1995 తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ, దర్శకత్వంలో “వేటగాడు” చిత్రం విడుదల అయ్యింది.

ఈ సినిమాలో రాజశేఖర్, సౌందర్య, రంభ హీరో, హీరోయిన్లుగా నటించారు. అలనాటి నటి సుజాత రాజశేఖర్ కు తల్లిగా నటించారు. ప్రత్యేక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా శ్రీకాంత్ నటించారు. రాజశేఖర్ తన తల్లికి జరిగిన అన్యాయంపై ప్రతి కథానాయకుడి మీద ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది ఈ సినిమా ప్రధాన అంశం. ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాకి మాతృకలయిన హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు విజయవంతమైనప్పటికీ రాజశేఖర్ నటించిన “వేటగాడు” సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Rakta Sambandham : ఈ సినిమాలో సావిత్రి మీకు చెల్లి పాత్రలో అనగానే అక్కినేని జారుకున్నారు.. కానీ ఎన్టీఆర్ ఒప్పుకున్నారు.!!

తమిళంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ సినిమా పాశమలర్. అన్నాచెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే భారీ నాటకీయ చిత్రం ఇది. సినిమా నిర్మాత డూండీ తమిళ చిత్రం హక్కులు కొని, రచయితగా అప్పటికి సినీరంగానికి పూర్తి కొత్తవారైన ముళ్ళపూడి వెంకటరమణను నియమించుకున్నారు. అయితే భారీ నాటకీయత, శోకభరితమైన సన్నివేశాలూ ఉన్న హెవీ డ్రామా సాహిత్యరంగంలో హాస్యరచయితగా పేరొందిన ముళ్ళపూడి వల్ల ఏమవుతుందని పరిశ్రమ వర్గాలు పెదవి విరిచినా, డుండీ మాత్రం “హాస్యం, విరుపు తెలిసినవాడే హెవీడ్రామా రాయగలడు” అంటూ ప్రోత్సహించారు.

తమిళ స్క్రిప్ట్ అందగానే రమణ తెలుగు స్క్రిప్టును ముఖ్యమైన షాట్ విభజనలు సూచించడంతో సహా సినిమాను దాదాపు రెండు వారాల్లో రాసేశారు. దర్శకుడు వి.మధుసూదనరావు స్క్రిప్ట్ అయినంతవరకూ తీసుకురమ్మని రెండు వారాలకు అడగ్గానే, మొత్తం స్క్రిప్టును చేతిలో పెట్టడంతో ఒకేసారి స్క్రిప్ట్ చూసి ఒకే చేసేశారు. ఆ తర్వాత నిర్మాత డూండీ ఫ్యామిలీ, సెంటిమెంట్ పాత్రలకు పెట్టింది పేరైన అక్కినేనిని వెళ్లి కలిశారు. “పాశమలార్” తమిళ చిత్ర కథను అక్కినేనికి వినిపించడం జరిగింది.

అయితే ఈ చిత్రంలో అన్నా చెల్లెలు సెంటిమెంట్ తో ఉండడం వలన చెల్లి పాత్రలో సావిత్రిని తీసుకుంటున్నామని అక్కినేనితో చెప్పడంతో.. ఆయన ఒక్కసారి అవాక్కయ్యారు. గతంలో తను, సావిత్రి అనేక చిత్రాల్లో హీరో, హీరోయిన్ గా నటించమని.. ఇప్పుడు ఒక్కసారిగా “అన్నా చెల్లెలు” గా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారేమోనని అక్కినేని సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇదే తమిళ చిత్ర కథని మరో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ కు చెప్పడంతో.. ముందు సందేహం వ్యక్తం చేసినప్పటికీ.. కథ బాగా నచ్చడంతో సావిత్రిని చెల్లెలి పాత్రకు ఎన్టీఆర్ ఓకే చేశారు. సరిగ్గా 6 నెలల క్రితం ఎన్టీఆర్, అక్కినేని నటించిన మల్టీ స్టారర్ చిత్రం “గుండమ్మ కథ” విడుదలైంది.

ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా సావిత్రి నటించగా.. అక్కినేనికి జోడిగా జమున నటించింది. అయినా ఎన్టీఆర్ ధైర్యంగా ఆయనతో సావిత్రి చెల్లెలిగా నటించడానికి ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ సరసన దేవిక నటించారు. సావిత్రి సరసన కాంతారావు నటించారు. 1962 వి.మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన “రక్త సంబంధం” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లెలుగా నటించి ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటసాల స్వరపరిచిన “బంగారు బొమ్మ రావేమే.. పందిట్లో పెళ్లి జరిగేనే” ఇప్పటికీ కొన్ని సినిమాల్లో పెళ్లికి సంబంధించిన సన్నివేశం రాగానే బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాట రావడం అనేది సహజంగా మారిపోయింది.

ఒకే బాణి గల పాటకు చిందులేసిన అమితాబ్, ఎన్టీఆర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో తెలుసా.?!

1970 ద్వితీయార్థంలో జి.పి.సిప్పి నిర్మాణ సారధ్యంలో రమేష్ సిప్పి దర్శకత్వంలో “షోలే” చిత్రం విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర పోటీపడి నటించి షోలే చిత్రాన్ని విజయవంతం చేశారు. ఈ చిత్రంతో అమితాబచ్చన్ కు తిరుగులేని స్టార్డం వచ్చింది. ఇక అమితాబచ్చన్ వెనుతిరిగి చూసుకోలేదు. అందుకే ఆయన ఇండియన్ సూపర్ స్టార్ అయ్యారు.

ఆ క్రమంలో 1978 నారీమన్ ఇరానీ నిర్మాణం, చంద్రబరోత్ దర్శకత్వంలో “డాన్” చిత్రం విడుదలయ్యింది. ఇందులో అమితాబచ్చన్, జీనత్ అమన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. సలీమ్ జావేద్ అందించిన ఈ సినిమా కథలో అమితాబచ్చన్ ద్విపాత్రాభినయం చేశారు. 1978 చిత్రాల్లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా డాన్ చిత్రం ఒకటిగా ఉంటుంది.

కళ్యాణ్ జీ ఆనంద్ జీ సంగీత సారధ్యంలో వచ్చిన “కైకే పాను బనారస్ వాలా.. అనే పాట గాయకుడు కిషోర్ కుమార్ గొంతులోంచి భారతదేశమంతటా వ్యాపించింది. ఆ రోజుల్లో ఈ పాటకు చిందులేయని ప్రేక్షకుడంటూ లేరేమో అనిపిస్తుంది. దేశమంతట ఓ ఊపు ఊపిన టాప్ టెన్ పాటల్లో ఈ పాట ఒకటిగా ఉండడం గమనార్హం. ఈ పాట ఆలపించిన కిషోర్ కుమార్ కి ఉత్తమ గాయకుడిగా అవార్డు వచ్చింది. భాష ఏదైనా ఒక విజయవంతమైన చిత్రాన్ని మరొక భాషలోకి రీమేక్ చేయడం ఆనాటి నుంచి వస్తున్న సంప్రదాయం అనే చెప్పవచ్చు.

ఆ క్రమంలో డాన్ చిత్రాన్ని మొట్టమొదటగా ఎన్టీఆర్ హీరోగా తెలుగులో రూపొందించడం జరిగింది. అలా 1979 శ్రీ గజలక్ష్మి ఆర్ట్స్, విద్యాసాగర్ నిర్మాణం, కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో “యుగంధర్” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో నందమూరి తారక రామారావు, జయసుధ హీరో, హీరోయిన్లుగా నటించారు. డాన్ చిత్రాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించినప్పటికీ.. అంతకుముందే విడుదలైన హిందీ చిత్రం “చైనా టౌన్” ఆధారంగా తెలుగులో నిర్మించబడిన “భలే తమ్ముడు” చిత్ర కథకు యుగంధర్ సినిమా దగ్గరగా ఉంటుంది.

ఇకపోతే ఎన్టీఆర్, ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక చిత్రం యుగంధర్ గా పేర్కొనవచ్చు. ఎన్టీఆర్ ఒకే చిత్రానికి సంగీత సారథ్యం వహించిన ఇళయరాజా హిందీలో బహుళ జనాదరణ పొందిన “కైకే భానారస్ వాలా.. అనే పాట బాణిని తీసుకొని.. “ఒరబ్బా వేసుకున్న కిల్లి… ఒరే.. ఒరే..ఒళ్ళంత తిరిగెను మళ్ళీ.. మత్తుగా ఉందిరా ఓ బేటా.. ఆ నిజమే చెబుతా ఈ పూట.. అనే పాట ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గొంతునుంచి జాలువారింది. ఈ పాటకు ఆంధ్రదేశమంతటా అన్నగారి అభిమానులే కాకుండా ప్రేక్షకులందరూ కాలు కదిపారనడంలో సందేహం లేదు.

సంవత్సరం తేడాతో వచ్చిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగించాయి. ఆ తర్వాత హిందీ డాన్ చిత్రం ఆధారంగా తమిళంలో రజనీకాంత్, సుప్రియ హీరో, హీరోయిన్లుగా “బిల్లా” (1980) చిత్రం రూపొందించబడింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో రజినీకాంత్ ఒక్కసారిగా టాప్ స్టార్ గా ఎదిగిపోయారు. ఆ తర్వాత డాన్ చిత్రం ఇతర దక్షిణాది భాషల్లోకి కూడా అనువదించబడింది.

Gummadi : ఎన్.టి. రామారావు ఇచ్చిన మాటతో గుమ్మడి తిరుగులేని నటుడిగా ఎదిగి పద్మశ్రీ అందుకున్నారు.

Gummadi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు గుమ్మడి వెంకటేశ్వరరావు. కెరీర్ ప్రారంభంలో విలన్, స్నేహితుడు, సహయాక పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తండ్రి, తాత పాత్రలకు ఆయనే బెస్ట్ ఛాయిస్ అని దర్శక, నిర్మాతలు భావించారు. అలా ఆయన 500 చిత్రాలలో చక్కటి పాత్రలు పోషించారు.  పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఇలా అన్ని రకాలైన సినిమాల్లో గుమ్మడికి అవకాశాలు దక్కాయి.

గుమ్మడి వెంకటేశ్వరరావు అసలు పేరైనప్పటికి ఇంటిపేరుతోనే ఆయన క్రేజీ స్టార్‌గా మారారు. నటుడవ్వాలని ఆసక్తి ఉన్నా కూడా ఆయన సినిమా రంగ ప్రవేశం అనూహ్యంగా జరిగింది. అవకాశాల కోసం ఎదురు చూడని సమయంలో నటించే  అవకాశం దక్కింది. లక్షమ్మ, శ్రీలక్షమ్మ పేరుతో పోటీ చిత్రాలు ప్రారంభమయ్యాయి. లక్షమ్మ చిత్రానికి గోపీచంద్ దర్శకుడు, అలనాటి కథానాయిక కృష్ణవేణి నిర్మాత. ఇక శ్రీలక్షమ్మ చిత్రానికి ఘంటసాల రఘురామయ్య దర్శక నిర్మాత కాగా, అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి జంటగా నటించారు. అందులో ఒక పాత్రకు గుమ్మడికి అవకాశం ఇవ్వమని సిఫారసు చేసారు. సరేనన్నప్పటికీ అవకాశం మాత్రం ఇవ్వలేదు.

Gummadi : గుమ్మడికి మాట ఇచ్చిన ఎన్టీ రామారావు :

అయితే గుమ్మడి ప్రయత్నాలు మాత్రం మానలేదు. తెలిసిన వారి ద్వారానే మద్రాసు చేరుకున్నారు. ఈ క్రమంలో అదృష్టదీపుడు అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసే అవకాశం అందుకున్నారు. ఈ సినిమా 1950 లో వచ్చింది. అయితే గుమ్మడి కెరీర్ ప్రారంభంలో అంత సాఫీగా సాగలేదు. చేసిన సినిమాలలో చిన చిన్న పాత్రలు కావడం..దాంతో అంతగా గుర్తింపు దక్కకపోయేసరికి నాకు ఇండస్ట్రీ సరిపడదని తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న ఎన్.టి. రామారావు.. మీరు ఎక్కడికీ వెళ్ళొద్దని.. నా తరువాత సినిమాలో మంచి వేషం ఇస్తానని మాటిచ్చారు.  

ఎన్.టి.రామారావు ఇచ్చిన మాట ప్రకారమే గుమ్మడికి ఆయన నటించిన పిచ్చిపుల్లయ్య సినిమాలో విలన్ పాత్ర ఇచ్చారు. ఈ పాత్రతో గుమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆయన ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమా తర్వాత మళ్ళీ కూడా ఎన్.టి.రామారావు నటించిన తరువాతి చిత్రం తోడుదొంగలు లోనూ ప్రధాన పాత్ర అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కించుకుంది.

అలా గుమ్మడి కెరీర్ సక్సెస్ కావడానికి ఎన్.టి. రామారావు ప్రధాన కారణమయ్యారు. వాస్తవంగా రామారావు, నాగేశ్వరరావుల కంటే గుమ్మడి వయసులో చిన్నవాడు. అయినా చాలా చిత్రాలలో వీరిద్దరికి తండ్రిగా, మామగా నటించడం విశేషం. వశిష్ట, విశ్వామిత్ర పాత్రలతో గుమ్మడికి గొప్ప పేరు వచ్చింది. దశరథునిగా, భీష్మునిగా,ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్, బలరాముడు, భృగుమహర్షి, వంటి పౌరాణిక పాత్రలు ఆయన కోసమే తయారయ్యాయా అని చెప్పుకున్నారు. ఇక కమర్షియల్ సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించారు.

Somayajulu : 1984లో ఎన్.టి.రామారావు ప్రభుత్వం నటులు జె.వి. సోమయాజులును కోలుకోలేని దెబ్బకొట్టింది.

ఎవరి జీవితానికి ఎవరి వల్ల తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందో.. కెరీర్ ఒక్కసారిగా తలకిందులవుతుందో ఎవరూ ఊహించలేరు. అలా ఊహించని విధంగా దెబ్బతిన్నదే జె.వి. సోమయాజులు జీవితం. ప్రముఖ నటులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో సుపరిచితులైన ఆయన శంకరాభరణం సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. నాటక రంగం నుంచి వచ్చిన ప్రముఖ సినీ నటుల్లో ఆయన కూడా ఒకరు. రంగస్థలం, వెండితెర, బుల్లితెర మీద సినిమాలు, నాటకాలు, సీరీయల్స్ చేసి ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. శంకర శాస్త్రి అనే పేరుతో సోమయాజులును ఇప్పటికీ పిలుస్తున్నారంటే శంకరాభరణం సినిమా ప్రభావం ఇంకా ఆయనపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జె.వి.సోమయజులు 1928 జూన్ 30 న శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు. ఆయన సోదరుడు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు జె.వి.రమణమూర్తి. సోమయాజులు విజయంనగరంలో చదువుకొన్నప్పటినుంచే నాటకాలు వేసేవారు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం అయిన కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 సార్లు ప్రదర్శించి ప్రముఖుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్నారు. కన్యాశుల్కంలో ‘రామప్ప పంతులు’ పాత్ర ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. తండ్రి కంటే కూడా సోమయాజులును ఆయన తల్లి శారదాంబ నాటకరంగంలో ఎక్కువగా ప్రోత్సహించారు.

దర్శకుడు యోగి దర్శకత్వంలో వచ్చిన ‘రాధాకృష్ణయ్య’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించారు. దీని తర్వాత  శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అగ్ర దర్శకులు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీలో అలాగే ప్రేక్షకుల్లో విపరీతంగా క్రేజ్ తీసుకువచ్చింది. సోమయాజులుకి ఆయన గాత్రం బాగా కలిసి వచ్చింది. మంచి బేస్ వాయిస్ కావడంతో ఆయన నటించిన సినిమాలకు సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇలా కూడా సోమయాజులు పాపులర్ అయ్యారు. ఇక శంకరాభరణం సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

వరుసగా 150 సినిమాలలో రక రాకాల పాత్రలు పోషించే అవకాశాలు అందుకున్నారు. ఒకానొక దశలో ఆయన డేట్ కూడా దొరకని పరిస్థితి. వంశవృక్షం’, ‘త్యాగయ్య’ చిత్రాల్లో బాపు దర్శకత్వంలో నటించడం కూడా జె.వి.సోమయాజులుకు గొప్ప అనుభూతినిచ్చింది. నన్ను త్యాగయ్య పాత్రకి, వంశ వృక్షంలోని ఆ పాత్రకి బాపు రమణ ఎంపిక చేయడం కూడా నా పూర్వ జన్మ సుకృతమే అని ఎన్నో సందర్భాలలో ఆయన చెప్పారు. ‘సప్తపది’, ‘పెళ్ళీడు పిల్లలు’, ‘సితార’, ‘స్వాతిముత్యం’, ‘దేవాలయం’, ‘ఆలాపన’, ‘మగధీరుడు’, ‘చక్రవర్తి’, ‘స్వయంకృషి’, ‘స్వరకల్పన’, ‘అప్పుల అప్పారావు’, ‘ఆదిత్య 369’, ‘అల్లరిమొగుడు’, ‘అభినందన’, ‘రౌడీ అల్లుడు’, ‘ముఠామేస్త్రి’, ‘గోవిందా గోవిందా’, ‘సరిగమలు’, ‘కబీర్‌దాస్‌’ ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గవి.

అయితే ఆయన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం పోవడానికి కారణం ఎన్.టి.రామారావు ప్రభుత్వం. 1984 లో 55ఏళ్ళు నిండిన ప్రభుత్వోద్యోగులపై పదవీ విరమణ వేటు వేయడంతో ఆ వేటుకి సోమయాజులు బలైయ్యారు. అయితే, రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేసిన ఆయనను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవించడం విశేషం. అక్కడి రంగస్థల కళల శాఖకు సోమయాజులు అధిపతిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. 

Krishna: ఎన్టీఆర్ ఈ సినిమా ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూసా… నా జీవితంలో ఇదే బెస్ట్ సినిమా: కృష్ణ

Krishna: టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన దాదాపు గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు పలు సినిమాలలో తండ్రి పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం వయసు పైబడటంతో కృష్ణ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ కృష్ణకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, మోహన్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత అశ్వినీదత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

Krishna: ఎన్టీఆర్ ఈ సినిమా ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూసా… నా జీవితంలో ఇదే బెస్ట్ సినిమా: కృష్ణ

ఈ కార్యక్రమంలో వీరు అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Krishna: నా 365 సినిమాలలో బెస్ట్ మూవీ అదే…

చిన్నప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు గురించి ఎన్నో బుర్రకథలలో విన్నాను. ఈ సినిమాని ఎన్టీఆర్ గారు ఎప్పుడు చేస్తారా అని ఈ సినిమా కోసం ఎదురు చూశాను. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఎన్టీఆర్ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే తన 100వ చిత్రంగా తానే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించి ఇందులో నటించాను. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. నేను నటించిన 365 చిత్రాలలో అల్లూరి సీతారామరాజు సినిమా బెస్ట్ చిత్రం అని ఈ కార్యక్రమంలో కృష్ణ తెలియజేశారు.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

నందమూరి తారక రామారావు తెలుగు భాషా కీర్తి బావుటాను దశదిశలా ఎగురవేసిన గొప్పనటుడు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలను తనదైన శైలిలో నటిస్తూ కఠిన సంభాషణలను సైతం అవలీలగా పలుకుతూ.. త్రేతా ద్వాపర యుగం నాటి పాత్రలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు.. కర్ణుడు, అర్జునుడు, భీముడు లాంటి పాత్రలను ధరించి.. ఆ దేవుళ్ళు సైతం కళ్లముందు సాక్షాత్కరించేల ప్రేక్షకులను ఆనందింపజేసారు.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

మన దేశం, పల్లెటూరిపిల్ల, షావుకారు చిత్రాల తర్వాత ఎన్టీరామారావు తనను తాను నిరూపించుకోవడానికి “పాతాళభైరవి’ చిత్రం ఆయన సినిమా కెరీర్ కు ఎంతగానో దోహదపడింది. విజయ సంస్థతో తీసిన చిత్రాలు ఆయనకు ఎంతగానో పేరు తీసుకువచ్చాయి. ఆ తర్వాత వారు నిర్మించిన ‘మాయాబజార్’ చిత్రంలో ఆయన శ్రీకృష్ణుని పాత్రలో కనిపించారు. ఆ సినిమా విజయవంతమవడంతో పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుని పాత్రలకు ఎన్టీరామారావుని దర్శకులు తీసుకునేవారు.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

ఆ తర్వాత సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి.. అనేక చిత్రాలు రూపొందిస్తూ ఆ చిత్రాల్లో ఆయనే కథానాయకుడిగా నటించారు. 1970 దశకం వచ్చేసరికి సాంఘిక చిత్రాల హవా కొనసాగింది.. ఆ సమయంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అడవిరాముడు’ చిత్రం ఆయన కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అదే సంవత్సరంలో ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని నిర్మిస్తూ.. స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయ దుందుభి మోగించింది. ఆ తర్వాత వేటగాడు, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, బెబ్బులిపులి లాంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలలో నటించారు.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

1980 దశకం ప్రారంభంలో సినిమాలకు స్వస్తి చెప్పి 1982లో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు. ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన ఏడాదిలోపే ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పొందింది. ఈ రాజకీయ విరామంలో అన్నగారు కొన్ని చిత్రాల్లో నటించారు.

ఎన్టిఆర్ అధికారం కోల్పాయక తీసిన సినిమాలు ఇవే..!

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

1991 ఎన్టీఆర్ పిక్చర్స్, హరికృష్ణ నిర్మాణం, ఎన్టీరామారావు దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీ రామారావు, మీనాక్షి శేషాద్రి ప్రధాన పాత్రలో కనిపించారు. పురాణాల్లో విశ్వామిత్రుని కథను ఆధారంగా చేసుకుని నేటి సాంఘిక, ఆర్ధిక, రాజకీయలపై విమర్శనాస్త్రంగా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ రూపొందించారు. అన్నగారు అధికారం కోల్పోయాక వచ్చిన ఈ మొదటి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పొందింది.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

1992 రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్, ఎన్టీఆర్ నిర్మాణ, దర్శకత్వంలో ‘సామ్రాట్ అశోక’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, వాణి విశ్వనాథ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చారిత్రక చిత్రంలో అశోకుడు, చాణక్యుడిగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

1993 రామకృష్ణ హార్టీకల్చరల్ సినీ స్టూడియోస్, బాపు దర్శకత్వంలో ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో ఎన్.టి.రామారావు, జయసుధ ప్రధాన పాత్రల్లో కనిపించారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీనాథుని జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఇతిహాస, పురాణ, చారిత్రక పురుషుల పాత్రలను ఎన్టీఆర్ తన సినీ ప్రయాణంలో పోషించి.. ఆ పాత్రలకే వన్నెతెచ్చినప్పటికీ ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పొందింది.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

1993,లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో వచ్చిన ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 1994లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి తిరిగి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో లైనా మెగా రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ ఇద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్ లు చిత్ర బృందం విడుదల చేశారు.అయితే ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ఆతృతతో అటు మెగా అభిమానులు,ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వీరి అభిమానులకు చిత్రబృందం శుభవార్తను తెలియజేసింది.

ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ సినిమా కు సంబంధించి కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) గుర్రంపై స్వారీ చేస్తూ ఉండగా, కొమరం భీమ్ (ఎన్టీఆర్) బుల్లెట్ నడుపుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బామ అలియా భట్ సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అదేవిధంగా కొమరం భీమ్ పాత్రలో పోషిస్తున్న ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బామ ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్ ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్టు డి.వి.వి.దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.