అడవి రాముడు లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి తారక రామారావు. తిరిగి అనేక చిత్రాలు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించారు. నిర్మాత అర్జునరాజు ఎన్టీరామారావు దగ్గరికి వెళ్ళేసరికి ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి డేట్స్ ఖాళీ లేకుండా అనేక చిత్రాలతో ఎన్టీరామారావు బిజీగా ఉన్నారు. ఆ క్రమంలో ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలనుందని అడగడంతో… ఇదివరకు ఎన్టీఆర్ తో “పరమానందయ్య శిష్యుల కథ” వంటి చిత్రాలను నిర్మించిన తోట సుబ్బారావు దగ్గర తన డేట్స్ ఉన్నాయని ఆయన సినిమా నిర్మించే ఆర్థిక పరిస్థితులలో లేరని చెప్పడంతో.. నిర్మాత అర్జనరాజు వెళ్లి కొంత డబ్బులు చెల్లించి ఎన్టీఆర్ డేట్స్ తీసుకున్నారు.
అలా 1979 అర్జునరాజు నిర్మాణం, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో “వేటగాడు” చిత్రం విడుదలయ్యింది. అడవి రాముడు చిత్రం లాంటి అడవి నేపథ్యంతో కూడిన వేటగాడు చిత్రాన్ని రూపొందించడం జరిగింది. జంధ్యాల కథ, మాటలు వేటగాడు చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. శ్రీదేవి మొదటి సారిగా ఎన్టీఆర్ తో జోడిగా ఈ సినిమాలో నటించారు.
రావు గోపాల్ రావు, సత్యనారాయణ తండ్రీకొడుకులుగా విలనిజం తో పాటు మంచి హాస్యాన్ని పండించారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి అందించిన “ఆకు చాటు పిందె తడిసే..కొమ్మ చాటు పువ్వు తడిసే.. అనే పాట ఆ రోజుల్లో ఆంధ్ర దేశం అంతటా ఒక ఊపు ఊపింది. ఆ సంవత్సరానికి గాను వేటగాడు సినిమా అద్భుత విజయాన్ని సాధించింది…
అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి చిత్రాలతో యాంగ్రీ యంగ్ హీరోగా రాజశేఖర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి సినీ పరిశ్రమకు సుపరిచితుడు. 1956 లో వచ్చిన ఇంగ్లీష్ నవల ఆధారంగా “ఏ కిస్ బిఫోర్ డైయింగ్” అనే మూవీ వచ్చింది. ఈ చిత్రాన్ని ఆధారం చేసుకొని ఇండియన్ మసాలా జోడిస్తూ… 1993 అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో “బాజీగర్” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్, కాజోల్, శిల్పాశెట్టి హీరో, హీరోయిన్లుగా నటించారు. పగ ప్రతీకారాలతో సాగిన ఈ బాలీవుడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. బాజీగర్ సినిమా హక్కులు తీసుకొని.. 1995 తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ, దర్శకత్వంలో “వేటగాడు” చిత్రం విడుదల అయ్యింది.
ఈ సినిమాలో రాజశేఖర్, సౌందర్య, రంభ హీరో, హీరోయిన్లుగా నటించారు. అలనాటి నటి సుజాత రాజశేఖర్ కు తల్లిగా నటించారు. ప్రత్యేక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా శ్రీకాంత్ నటించారు. రాజశేఖర్ తన తల్లికి జరిగిన అన్యాయంపై ప్రతి కథానాయకుడి మీద ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది ఈ సినిమా ప్రధాన అంశం. ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాకి మాతృకలయిన హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు విజయవంతమైనప్పటికీ రాజశేఖర్ నటించిన “వేటగాడు” సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…