Prabhas: పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… పెళ్లి అప్పుడే అంటూ కామెంట్స్!
Prabhas: టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ ఈ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి పర్వాలేదని అనిపించింది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
ఇకపోతే ప్రభాస్ అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ ఎక్కడికి వెళ్ళినా ప్రభాస్ కు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రభాస్ ప్రేమ విషయంలో తన అంచనాలు చాలా సార్లు తప్పాయి అని తెలిపాడు. అయితే తాజాగా నేషనల్ మీడియా తో ముచ్చటించిన ప్రభాస్ పెళ్లి విషయంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సదరు యాంకర్.. మీరు ఎక్కడికి వెళ్ళినా పెళ్లి టాపిక్ వస్తుంది కదా ఆ సమయంలో మీరు ఎప్పుడైనా అసహనానికి గురయ్యారు అని అడగగా..లేదు నా పెళ్లి గురించి ప్రేక్షకులు అడిగినప్పుడు నాకు ఏమీ చిరాకు అనిపించదు.. అంతేకాకుండా నా పెళ్లి గురించి వారు ఎంతగా ఆలోచిస్తున్నారు అని అనుకుంటాను.. ఒకవేళ అభిమానుల స్థానంలో నేను ఉన్నా కూడా అదే విధంగా ఆందోళన చెందేవాడిని అంటూ కూల్ గా సమాధానం ఇచ్చాడు ప్రభాస్. వెంటనే సదరు యాంకర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? పెళ్లి విషయంపై ఏమైనా ప్లాన్ చేశారా? అని అడగగా.. ఈ విషయంపై స్పందించిన ప్రభాస్ ఆ విషయం పట్ల ప్రస్తుతానికి నా వద్ద సమాధానం లేదు.
నాకు సమాధానం దొరికినప్పుడు తప్పకుండా అందరికీ నా పెళ్లి గురించి చెబుతాను అంటూ చిన్నగా నవ్వేసాడు ప్రభాస్. ప్రభాస్ పెళ్లి విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే బాహుబలి సినిమా తరువాత పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన ప్రభాస్,బాహుబలి సినిమా విడుదల అయ్యి ఇన్ని ఏళ్ళు అవుతున్నా కూడా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అంతే కాకుండా తాజాగా ప్రభాస్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ఇప్పట్లో ప్రభాస్ కి పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదని తెలుస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…