Featured

Somayajulu : 1984లో ఎన్.టి.రామారావు ప్రభుత్వం నటులు జె.వి. సోమయాజులును కోలుకోలేని దెబ్బకొట్టింది.

ఎవరి జీవితానికి ఎవరి వల్ల తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందో.. కెరీర్ ఒక్కసారిగా తలకిందులవుతుందో ఎవరూ ఊహించలేరు. అలా ఊహించని విధంగా దెబ్బతిన్నదే జె.వి. సోమయాజులు జీవితం. ప్రముఖ నటులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో సుపరిచితులైన ఆయన శంకరాభరణం సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. నాటక రంగం నుంచి వచ్చిన ప్రముఖ సినీ నటుల్లో ఆయన కూడా ఒకరు. రంగస్థలం, వెండితెర, బుల్లితెర మీద సినిమాలు, నాటకాలు, సీరీయల్స్ చేసి ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. శంకర శాస్త్రి అనే పేరుతో సోమయాజులును ఇప్పటికీ పిలుస్తున్నారంటే శంకరాభరణం సినిమా ప్రభావం ఇంకా ఆయనపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జె.వి.సోమయజులు 1928 జూన్ 30 న శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు. ఆయన సోదరుడు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు జె.వి.రమణమూర్తి. సోమయాజులు విజయంనగరంలో చదువుకొన్నప్పటినుంచే నాటకాలు వేసేవారు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం అయిన కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 సార్లు ప్రదర్శించి ప్రముఖుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్నారు. కన్యాశుల్కంలో ‘రామప్ప పంతులు’ పాత్ర ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. తండ్రి కంటే కూడా సోమయాజులును ఆయన తల్లి శారదాంబ నాటకరంగంలో ఎక్కువగా ప్రోత్సహించారు.

దర్శకుడు యోగి దర్శకత్వంలో వచ్చిన ‘రాధాకృష్ణయ్య’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించారు. దీని తర్వాత  శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అగ్ర దర్శకులు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీలో అలాగే ప్రేక్షకుల్లో విపరీతంగా క్రేజ్ తీసుకువచ్చింది. సోమయాజులుకి ఆయన గాత్రం బాగా కలిసి వచ్చింది. మంచి బేస్ వాయిస్ కావడంతో ఆయన నటించిన సినిమాలకు సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇలా కూడా సోమయాజులు పాపులర్ అయ్యారు. ఇక శంకరాభరణం సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

వరుసగా 150 సినిమాలలో రక రాకాల పాత్రలు పోషించే అవకాశాలు అందుకున్నారు. ఒకానొక దశలో ఆయన డేట్ కూడా దొరకని పరిస్థితి. వంశవృక్షం’, ‘త్యాగయ్య’ చిత్రాల్లో బాపు దర్శకత్వంలో నటించడం కూడా జె.వి.సోమయాజులుకు గొప్ప అనుభూతినిచ్చింది. నన్ను త్యాగయ్య పాత్రకి, వంశ వృక్షంలోని ఆ పాత్రకి బాపు రమణ ఎంపిక చేయడం కూడా నా పూర్వ జన్మ సుకృతమే అని ఎన్నో సందర్భాలలో ఆయన చెప్పారు. ‘సప్తపది’, ‘పెళ్ళీడు పిల్లలు’, ‘సితార’, ‘స్వాతిముత్యం’, ‘దేవాలయం’, ‘ఆలాపన’, ‘మగధీరుడు’, ‘చక్రవర్తి’, ‘స్వయంకృషి’, ‘స్వరకల్పన’, ‘అప్పుల అప్పారావు’, ‘ఆదిత్య 369’, ‘అల్లరిమొగుడు’, ‘అభినందన’, ‘రౌడీ అల్లుడు’, ‘ముఠామేస్త్రి’, ‘గోవిందా గోవిందా’, ‘సరిగమలు’, ‘కబీర్‌దాస్‌’ ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గవి.

అయితే ఆయన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం పోవడానికి కారణం ఎన్.టి.రామారావు ప్రభుత్వం. 1984 లో 55ఏళ్ళు నిండిన ప్రభుత్వోద్యోగులపై పదవీ విరమణ వేటు వేయడంతో ఆ వేటుకి సోమయాజులు బలైయ్యారు. అయితే, రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేసిన ఆయనను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవించడం విశేషం. అక్కడి రంగస్థల కళల శాఖకు సోమయాజులు అధిపతిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago