Deepthi Sunaina: తెలుగు బిగ్ బాస్ మొదలై 5 సీజన్లు పూర్తి చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఎవరి పర్సనల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. మొదటి సారి హౌస్ లో జరిగిన వ్యవహారాల కారణంగా రెండు జంటలు బయట ఇబ్బందులకు గురవుతున్నారు. అందులో ఓ జంట విడిపోయే వరకు వచ్చింది.
టైటిల్ ఫేవరేట్ గా సీజన్ 5 లో హౌస్ లోకి అడుగు పెట్టిన షణ్ముఖ్ జశ్వంత్.. సిరితో స్నేహాన్ని సాగించాడు. ఈ స్నేహం కాస్త.. రొమాన్స్ గా మారిపోయింది. సిరి- షన్నూల ఎపిసోడ్స్ సీజన్ కే హైలెట్ గా నిలిచిపోయింది. కిస్సింగులు, హగ్గింగులతో హౌస్ అంతా రచ్చ రచ్చ చేసేశారు. దీంతో వాళ్లు కావాలని అలా చేయకున్నా.. బయట జనాలు మాత్రం వేరే విధంగా తీసుకున్నారు.
దీంతో షణ్ముఖ్ లవర్ దీప్తిపై ఒత్తిడి పెరిగిపోయింది. షణ్ణు ఇలా చేస్తున్నాడేంటి..అని ఆమెను పరోక్షంగా సన్నిహితులు, స్నేహితులు అడగడం మొదలు పెట్డడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. దీంతో కొత్త సంవత్సరం రోజున ఆమె తన ఇన్ స్టా వేదికగా.. తాము ఇద్దరం విడిపోతున్నాం అంటూ ఓ పోస్టు పెట్టింది. .
దీంతో ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. తర్వాత కొన్ని గంటలకే షణ్ముఖ్ కూడా.. అది ఆమె డెసిషన్.. ఎవరి ఇష్టం వాళ్లది అన్నట్లు మరో పోస్టు పెట్డాడు. దీంతో ఇద్దరు అధికారికంగా.. ఇష్టంగానే విడిపోతున్నట్లు అందరికీ అర్థం అయిపోయింది. దీంతో మరో సారి దీప్తి ఇన్ స్టా లైవ్ లోకి వచ్చి.. తమ అభిమానులతో ఆమె బాధలను పంచుకుంది. నా లైఫ్ లో తాను ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మొదటి సారి ఆమె ఇన్ స్టా లైవ్ లోకి వచ్చి.. భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఫ్యాన్స్ ఆమెను కామెంట్ల రూపంలో ఓదార్చే పని చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…