Shanmukh-Deepthi: బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి ఇలా..ఎందుకబ్బా..?
Shanmukh-Deepthi: బిగ్ బాస్ పుణ్యమా అని రెండు జంటలు విడిపోయాయి. ఇప్పటికే షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి. గతంలో బిగ్ బాస్ సీజన్లలో చాలా రొమాంటిక్ ఎపిసోడ్స్ జరిగాయి.
అయితే ఇవన్నీ బిగ్ బాస్ షోలో కామన్ గా జరిగేవిగా అందరూ అనుకునే వారు. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా నార్మల్ అయిపోయేవారు. తరువాత వారి రిలేషన్ లోకి మూవ్ అయ్యేవారు. ఇలా బిగ్ బాస్ తరువాత జంటలు బ్రేకప్ చెప్పుకోవడం జరగలేదు.అసలు ఈ మొత్తం ఉదంతానికి కారణం ఎవరా..? అని చూస్తే వినిపించే పేరు సిరి.
బిగ్ బాస్ సీజన్ 5లో సిరి- షణ్ముక్ మధ్య రొమాంటిక్ వ్యవహరమే దీప్తితో రిలేషన్ షిప్ దెబ్బతినడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న సమయంలో సిరి, షన్నూల మధ్య కిస్సింగ్, హగ్గింగ్ సీన్లు రచ్చకు దారి తీశాయి.
వీరిద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ జరుగుతున్నట్లుగా ఆడియన్స్ అనుమానించారు. అయితే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ.. వీరిద్దరు వ్యవహరించిన తీరును చూస్తే ఎవరైనా ఇది ఫ్రెండ్ షిప్ లా లేదు అని అనుకున్నవాళ్లే ఉన్నారు. ఒకానొక సమయంలో సిరి తల్లి కూడా ఈ కౌంగిలింతలను చూసి హద్దులు దాటుతున్నవని హెచ్చిరించింది. అయితే బిగ్ బాస్ హౌజ్ లోనే సిరి – షణ్ముఖ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దీప్తి సునయన షన్నూకు బ్రేకప్ చెప్పినట్లుగా తెలిసింది. న్యూ ఇయర్ కు ముందు ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తమ దారులు వేరని వెల్లడించింది. ఐదేళ్ల రిలేషన్ షిప్ కు బ్రేక్ పడింది. అయితే ఈవిషయంపై సిరి కూడా స్పందించింది. బ్రేకప్ కు నేను కారణం కాదని అంటోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…