Bala krishana: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వెండితెరపై పలు చిత్రాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఆహాలో ప్రసారమౌతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హాజరు కాగా తాజాగా ఈ కార్యక్రమానికి బల్లాల దేవుడు రానా వచ్చినట్లు తాజాగా ప్రోమోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే బాలకృష్ణ రానా మధ్య ఎన్నో సరదా మాటలు సాగాయి. కరోనా సమయంలోవ్యాక్సిన్ గురించి వార్త వస్తుంది అనుకుంటే నీ పెళ్లి వార్త వచ్చింది ఏంటి అంటూ రానాని ఆట పట్టించారు. పెళ్లి అయిన తర్వాత బాగా దారిలోకి వచ్చినట్లు ఉన్నావు పెళ్లికాకముందు పూలరంగడు మాదిరితిరిగే వాడివి ఎంతమందికి హ్యాండ్ ఇచ్చావు ఎంతమందికి నువ్వు నో చెప్పావో గూగుల్ చెబుతుంది అంటూ తనని ఆట పట్టించారు.
ఇక ఈ కార్యక్రమంలో రానా ఏమంటివి.. ఏమంటివి అనే డైలాగ్ చెబుతూ అందరిని ఆశ్చర్యపరిచారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో రానా బాలకృష్ణ గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే రానా మీరెప్పుడైనా వసుంధర గారికి లవ్ ప్రపోజ్ చేశారా అని ప్రశ్నించారు. ఇలా రానా ఈ ప్రశ్న అడగడంతో బాలకృష్ణ ఇవన్నీ నీకెందుకయ్యా అంటూ తమాషా చేశారు.
ఇలా రానా అడగడంతో బాలకృష్ణ వెంటనే తన భార్య వసుంధరకి ఫోన్ చేశారు. ఫోన్ చేయడంతోనే వసు ఐ లవ్ యూ అంటూ తనకు లవ్ ప్రపోజ్ చేయడంతో వెంటనే వసుంధర నాకు తెలుసు మీరు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు అని సమాధానం చెప్పింది. ఇలా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను ఈ కార్యక్రమం ద్వారా రానా బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇలా వీరి మధ్య సాగిన పూర్తి ఎపిసోడ్ చూడాలంటే జనవరి 7వ తేదీ వరకు వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…