Tag Archives: odisha

Rahul Ramakrishna: రైలు ఘటనపై కామెడీ చేసిన రాహుల్ రామకృష్ణ… బుద్ధుందా అంటూ మండిపడుతున్న నేటిజన్స్!

Rahul Ramakrishna:ఒడిస్సాలో జరిగిన రైలు ప్రమాద ఘటన అందరిని ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకేసారి మూడు రైలు ఢీకొనడంతో వందల మంది ప్రాణాలు కోల్పోగా వేల మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు.ఇంత విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఎంతోమంది ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రజలలో మానవత్వం పరిమళించి క్షతగాత్రులకు రక్తదానం చేయడానికి వేల సంఖ్యలో ప్రజలు రక్తదానం చేస్తున్నారు.

ఇలా ఈ రైలు ప్రమాద ఘటన అందరిని ఎంతగానో కలిసి వేసింది అయితే కమెడియన్ రాహుల్ రామకృష్ణ మాత్రం రైలు ప్రమాద ఘటనపై కామెడీ చేయడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా తనపై నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయన చేసిన ట్వీట్ వెంటనే డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అట్వీట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన ఏం చేశారు అనే విషయానికి వస్తే…

రైలు ప్రమాదం జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సమయంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో హాలీవుడ్ నటుడు బస్టర్ కీటన్ సైలెంట్ అనే సినిమాలో రైలు ముందు చేసే విన్యాసాలకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. దీంతో నేటిజన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా వెంటనే ఆ వీడియో డిలీట్ చేశారు. ఓ పక్క వందల కుటుంబాలలో మరణాలు సంభవించి అందరూ బాధపడుతుంటే మీకు కామెడీగా ఉందా అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Rahul Ramakrishna: ఒట్టేసి చెబుతున్నా… క్షమించండి…


దీంతో ఆ ట్వీట్ డిలీట్ చేసిన రాహుల్ రామకృష్ణ అందరికీ క్షమాపణలు చెబుతున్నా అంటూ మరొక ట్వీట్ చేశారు. నిజానికి నాకు ఈ ఈ ఘటన గురించి ఏమాత్రం తెలియదు అర్ధరాత్రి నుంచి నేను స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాను అందుకే న్యూస్ అప్డేట్ కాలేదని అందుకే తన వల్ల జరిగిన ఈ తప్పిదానికి తాను క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి మరొక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దొంగతనం చేసిన సొమ్మును ఆ దొంగ ఏం చేస్తాడో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

దొంగతనం చేయడంలో కూడా చాలామందికి తమకంటూ ఓ ప్రత్యేక స్టైల్ ను ఫాలో అవుతూ ఉంటారు. వారి శైలి మరే ఇతర దొంగ కూడా అనుసరించలేడు. అయితే దొంగల్లో కూడా కొంతమంది మంచి దొంగ ఉంటాడు. చెడుదొంగ కూడా ఉంటారు.

వాళ్లు ఏం చేసినా దొంగతనం అనేది మాత్రం నేరం. ఇక్కడ అవి రెండు కాకుండా మరో దొంగను చూడొచ్చు. అదే సరదా దొంగ. దొంగల్లో చాలా మంది దొచుకున్న సొమ్మును ఆస్తులు కొనడం, బ్యాంకుల్లో ఆ నగదును దాచుకోవడం వంటివి చేసుకొని వారి వృత్తికి న్యాయం చేస్తూ ఉంటారు. వీరు ఏ ఇంటిలో పడినా డబ్బులతో పాటు నగలును కూడా దొచుకెళ్తుంటారు.

మరికొంత మంది కేవలం నగదును మాత్రమే తీసుకెళ్తారు. ఇలాంటి దొంగ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.. ఒడిషాకు చెందిన హేమంత్ దాస్ 35 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతూ ఉన్నాడు. అతడు పెద్ద చదువులే చదువుకున్నా.. బుద్ధి మాత్రం దోపిడీల వైపు మళ్లించింది. అతడు దొంగగా మారడానికి కారణం.. అతడు కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఓ గొడవలో అతడిని అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు.

అందులో ఒక దొంగ పరిచయమయ్యాడు. అతడి వద్ద మెళకువలు నేర్చొకొని బయటకు వచ్చి అదే పని చేయడం ప్రారంభించాడు. తర్వాత అతడు చిన్నగా ప్రొఫెషనల్ దొంగగా ఎదిగాడు. అతడు ఇలా దొచుకున్న డబ్బులను సిమ్లా, గ్యాంగ్ టక్, కశ్మీర్ వెళ్లి ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి దొంగతనాలు చేస్తాడు. కేవలం డబ్బులను మాత్రమే తీసుకెళ్తాడు. తాజాగా మళ్లీ కటక్ లో ఇలా చోరీకి పాల్పడుతుండగా.. పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.

తీరం దాటిన గులాబ్.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న అధికారులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ గుబులు పట్టుకుంది. ప్రస్తుతం ఈ తుఫాను సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మధ్య తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షం కురవగా.. శ్రీకాకుళం నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. అన్ని శాఖలు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాయి.

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వాధికారులు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోమవారం మధ్యాహ్నం వరకు కోస్తా తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంధ్ర తీరం వెంబడి సముద్రంలో అలజడి ఉధృతంగా ఉంటుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో మరో 24 గంటల వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. ప్రస్తుతం ఈ భారీ వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రానున్న ఆరు గంటల్లో తుఫాన్ బలహీన పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లకు అడ్డంగా చెట్లు పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా పోలీసు యంత్రాగం సహాయ చర్యలు చేపట్టారు. విద్యుత్ లేకపోవడంతో మినీ ల్యాంప్స్, సెల్ ఫోన్ వెలుగులోనే విరిగిన చెట్లను తొలగిస్తున్నారు.

అంగన్ వాడీ కార్యకర్త వద్ద రూ.కోట్ల ఆస్తులు.. ఎక్కడ నుంచి వచ్చాయి..?

ఒక అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు ఎంత సాలరీ ఉంటుంది.. దాదాపు రూ.20 వేలలోపు ఉంటుంది. అయితే ఒరిస్సాలోని భువనేశ్వర్ నగరంలోని కొరొడొకొంటా అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేసే కబితా మఠాన్ కార్యకర్త వద్ద కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ కార్యకర్త వద్ద అంత డబ్బు ఎక్కడిది అంటూ.. చర్చించుకుంటున్నారు.

అయితే ఆమె వద్ద ఆక్రమఆస్తులు కలిగి ఉన్నారనే ఆనోట.. ఈనోట కాస్త విజిలెన్సు అధికారువల వద్దకు వెళ్లింది. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్లు తనిఖీలు చేపట్టడం మొదలు పెట్టారు. ఒరిస్సా లోని జగత్‌సింఘ్‌పూర్‌, కేంద్రాపడా, ఖుర్దా వంటి జిల్లాల్లో దాదాపు ఆరు ప్రదేశాల్లో ఆమెకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ సోదాలు జరిపిన వారిలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, 10 మంది డీఎస్పీలు పాల్గొన్నారు. ఇంకా ఆమె అక్రమ సొమ్ముతో మొత్తం 4 భవానలు కలిగి ఉండగా.. విలువైన కార్లు, బంగారు ఆభరణాలు కూడా కలిగి ఉంది. వీటితో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జగత్‌సింఘ్‌పూర్‌ జిల్లాలోని తొలొకుసుమ ప్రాంతంలో 3 ఇళ్ల స్థలాలు, రూ.2.20 లక్షల విలువైన బీమా పొదుపు ఖాతాలు, రూ.6.36 లక్షలు విలువ చేసే 212 గ్రాముల బంగారం ఆభరణాలు.. ఖుర్దా జిల్లాలోని బలియంత ప్రాంతంలో ఒక ఇంటి స్థలం, ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇవన్ని ఎలా వచ్చాయనే వాటిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు ఆమె వద్ద మొత్తం స్థిరాస్తులతో కలిపి రూ. 4 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలో దొరికిన విలువైన వాటిని స్వాధీనం చేసుకొని.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ఆ ఊరిలో 75 ఏళ్లకు బ్యాంకింగ్ సేవలు.. బ్రిడ్జి నిర్మాణంతో అందుబాటులోకి..

మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది.. కానీ అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇంకా కొన్ని గ్రామాల్లో, పట్టాణాల్లో అభివృద్ధి ఫలాలు, ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. అటువంట కోవలోకి చెందిందే.. ఒడిశాలోని సంబాల్‌పూర్‌ జిల్లాలోని కుద్‌ గుండేర్‌పూర్‌ గ్రామం. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లకు ఇక్కడ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఇక్కడ మహానది పాయలుగా విడిపోయి కుద్‌ గుండేర్‌ఫూర్ ఒక దీవిలో ఉంది. దీంతో వాళ్లు ప్రధాన భూభాగంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అక్కడ జనాభా 5 వేల మంది ఉంటారు. అక్కడ ప్రభుత్వ పథకాలు కూడా సరిగా అందడం లేదు. రవాణా, విద్య, ఆరోగ్య సంరక్షణ సోకర్యాలను పొందడంలో అక్కడ అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. గర్భిణుల ఇబ్బందులు చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి. రైతులు పండించిన పంటలను ఎక్కడ విక్రయించాలో తెలియని దుస్థితి.

వారు అక్కడ నుంచి పడవలో ప్రధాన భూభాగానికి చేరి అక్కడ విక్రయించేవారు. ఈ సమస్యలన్నీ సంబాల్ పూర్ జిల్లా కలెక్టర్ దృష్టికి చేరాయి. అక్కడ 2015లో వంతెన నిర్మాణాన్ని నిర్మించి వేగవంతం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఆ ఉరిని ప్రధాన భూభాగంతో కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. దీంతో అక్కడ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఊరిలో ఉత్కల్ గ్రామీణ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ను ఏర్పాటు చేసింది.

ఈ విధంగా ఆ గ్రామానికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వంతెన నిర్మాణం పూర్తవడంతో వాళ్లు ప్రధాన భూభాగానికి చేరుకున్నారు. తర్వాతనే వారికి పలు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని.. జిల్లా కలెక్టర్‌గా ఉన్న సుకాంత్ త్రిపాఠి పేర్కొన్నారు. ఇతర అవసరాల కోసం ప్రధాన భూభాగానికి చేరుకోవడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి చిన్న పడవల్లో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ 75 సంవత్సరాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవని కలెక్టర్ అన్నారు.

పెళ్లిలో వధువు చేసిన పనికి పరుగులు పెట్టిన వరుడు… వీడియో వైరల్!

ప్రస్తుత కాలంలో కొన్ని పెళ్లిళ్లలో ఎన్నో హాస్యాస్పద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా పెళ్లిలో ఇలాంటి ఒక హాస్యాస్పద సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

సాధారణంగా పెళ్లిళ్లు అన్ని సక్రమంగా జరుగుతాయి అన్న గ్యారెంటీ లేదు. కొన్ని పెళ్లిళ్లు మనస్పర్థల కారణంగా ఆగిపోతే,మరికొన్ని పెళ్లిళ్లు వివిధ కారణాల చేత ఆగిపోతూ ఉంటాయి. అయితే ఈ పెళ్లి మాత్రం అన్ని పెళ్లిళ్ల కంటే ఎంతో విభిన్న కారణం చేత ఆగిపోయింది. అప్పటివరకు పెళ్లి పీటలపై ఎంతో బుద్ధిగా కూర్చున్న వధువు ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడంతో వరుడు పెళ్లి పీటల నుంచి పరుగులు పెట్టాడు.

పెళ్లి పీటల పై కూర్చున్న వధువుకు వరుడు సింధూరం పెట్టగానే వధువు గట్టిగా అరుపులు అరుస్తూ కిందపడి పోయింది. దీంతో తనకు ఏమైందోనని భయపడిన వరుడు మెడలో వేసుకున్న దండలను అక్కడే విసిరి అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. ఈ క్రమంలోనే వేదికపై ఉన్న ఓ మహిళ వరుడిని ఆపాలని ప్రయత్నించిన అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియోను నిరంజన్ మహాపాత్ర తన ఇంస్టాగ్రామ్ పేజ్ ద్వారా పోస్ట్ చేశారు. క్షణాలలో ఈ వీడియో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

దేవుడా.. మటన్ కర్రీ లేదని పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు… కానీ మరుసటి రోజే?

సాధారణంగా కొన్ని గంటలలో వివాహం జరగబోతున్న నేపథ్యంలో ఎన్నో వివాహాలు వాయిదా పడి రద్దయిన సంఘటనలను గురించి మనం వినే ఉంటాం. అయితే వరుడు వధువు గురించి పలు నిజాలు బయట పడటం, లేదా వారు వేరే ఎవరైనా ప్రేమించి ఉంటే వారితో వెళ్లిపోవడం వంటి సంఘటనలు జరిగినప్పుడు వివాహాలు రద్దు కావడం మనం చూస్తుంటాము. కానీ ఒడిశాలో రాష్ట్రంలో కేవలం పెళ్లి విందులో మటన్ కర్రీ లేదని పెళ్లిని రద్దు చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.

పెళ్ళిలో మటన్ కర్రీ పెద్ద తంటాను తీసుకు వచ్చింది. ఈ విధంగా పెళ్లిలో మటన్ కర్రీ లేదని పెళ్లిని రద్దు చేసుకోవడమేకాకుండా, మరుసటి రోజే మరొక యువతిని వివాహం చేసుకున్న ఘటన జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి విందులో భాగంగా పెళ్లి కొడుకు బంధువులు, తోడు పెళ్లి కొడుకు భోజనం చేయడానికి వెళ్లారు.

ఈ క్రమంలోనే తోడు పెళ్లి కొడుకు తనకు మటన్ కర్రీ కావాలి అని అడిగారు. అయితే వధువు కుటుంబ సభ్యులు మటన్ కర్రీ లేదని చెప్పడంతో వారిరువురి మధ్య మాటలు పెరిగి తీవ్ర వాగ్వాదానికి చోటు చేసుకుంది.వీరిరువురి మధ్య వివాదం పెద్దగా మారడంతో చివరికి వరుడు ఈ పెళ్లిని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ఈ విధంగా పెళ్లి చేసుకున్న వరుడు అతని బంధువులు కుహికా పంచాయతీ పరిధిలోని గాంధపాలం గ్రామంలోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తమ్కా పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతితో మరుసటి రోజే ఆ యువకుడు వివాహం చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రిజిస్ట్రేషన్ లేకుండా బైక్ నడుపుతున్నారా.. లక్షల్లో ఫైన్ కట్టాల్సిందే..?

సాధారణంగా బైక్ పై వెళ్లే వాహనదారులు లైసెన్స్, ఇతర డాక్యుమెంట్లు మరిచిపోయినా నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపినా చేసిన తప్పును బట్టి 100 రూపాయల నుంచి వేల రూపాయలు జరిమానా విధిస్తారు. అయితే ఒక వ్యక్తికి మాత్రం ఏకంగా లక్షల్లో ఫైన్ వేశారు. ఆ వ్యక్తి బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల అంత భారీ మొత్తంలో జరిమానా విధించారని సమాచారం.

ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రకాశ్ అనే వ్యక్తి తన బైక్ కు ప్లాస్టిక్ డ్రమ్ములను కట్టుకొని ఊరూరా తిరుగుతూ అమ్మేవాడు. అయితే అతను తిరుగుతున్న వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించలేదు. రాయగడ పోలీసులు తనిఖీల్లో భాగంగా అతని వాహనాన్ని ఆపి బైక్ కు సంబంధించిన పత్రాలను అడిగారు.

అయితే ఆ వ్యక్తి దగ్గర బండికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పాటు బైక్ కు రిజిస్ట్రేషన్ కూడా లేదు. దీంతో పోలీసులు ఏకంగా 1,13,000 రూపాయలు ఫైన్ విధించారు. భారీ మొత్తంలో ఫైన్ విధించడంతో అవాక్కైన ప్రకాష్ ఏం చేయాలో పాలుపోక చివరకు స్నేహితులు, బంధువుల దగ్గర డబ్బులను అప్పు చేసి ఫైన్ ను చెల్లించాడు. కొత్త బైక్ కు సమానమైన మొత్తాన్ని ఆ వ్యక్తి జరిమానా చెల్లించడం గమనార్హం.

అయితే పోలీసులు భారీ మొత్తంలో జరిమానా విధించడాన్ని కొందరు సమర్థిస్తుంటే మరి కొందరు మాత్రం తప్పుబడుతున్నారు. వీధివ్యాపారులకు భారీ మొత్తంలో ఫైన్ వేయడం సరికాదని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు వీధి వ్యాపారి ఫైన్ చెల్లించకుండా కొత్త బైక్ కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.