సాధారణంగా కొన్ని గంటలలో వివాహం జరగబోతున్న నేపథ్యంలో ఎన్నో వివాహాలు వాయిదా పడి రద్దయిన సంఘటనలను గురించి మనం వినే ఉంటాం. అయితే వరుడు వధువు గురించి పలు నిజాలు బయట పడటం, లేదా వారు వేరే ఎవరైనా ప్రేమించి ఉంటే వారితో వెళ్లిపోవడం వంటి సంఘటనలు జరిగినప్పుడు వివాహాలు రద్దు కావడం మనం చూస్తుంటాము. కానీ ఒడిశాలో రాష్ట్రంలో కేవలం పెళ్లి విందులో మటన్ కర్రీ లేదని పెళ్లిని రద్దు చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.
పెళ్ళిలో మటన్ కర్రీ పెద్ద తంటాను తీసుకు వచ్చింది. ఈ విధంగా పెళ్లిలో మటన్ కర్రీ లేదని పెళ్లిని రద్దు చేసుకోవడమేకాకుండా, మరుసటి రోజే మరొక యువతిని వివాహం చేసుకున్న ఘటన జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి విందులో భాగంగా పెళ్లి కొడుకు బంధువులు, తోడు పెళ్లి కొడుకు భోజనం చేయడానికి వెళ్లారు.
ఈ క్రమంలోనే తోడు పెళ్లి కొడుకు తనకు మటన్ కర్రీ కావాలి అని అడిగారు. అయితే వధువు కుటుంబ సభ్యులు మటన్ కర్రీ లేదని చెప్పడంతో వారిరువురి మధ్య మాటలు పెరిగి తీవ్ర వాగ్వాదానికి చోటు చేసుకుంది.వీరిరువురి మధ్య వివాదం పెద్దగా మారడంతో చివరికి వరుడు ఈ పెళ్లిని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ఈ విధంగా పెళ్లి చేసుకున్న వరుడు అతని బంధువులు కుహికా పంచాయతీ పరిధిలోని గాంధపాలం గ్రామంలోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తమ్కా పోలీసుస్టేషన్ పరిధిలోని ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతితో మరుసటి రోజే ఆ యువకుడు వివాహం చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…