డబ్బులు కాజేయాలనే ఉద్దేశ్యంతో తన కుమారుడు అమ్రీష్‌పై అక్రమ కేసుల్లో ఇరికించారని అందువల్ల ఆ కేసులను మద్రాసు హైకోర్టు కొట్టివేసిందని సీనియర్ నటి జయచిత్ర తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సంగీత దర్శకునిగా రాణిస్తున్న తన కుమారుడిపై ఇరీడియం కేసులో ఇరికించి పెద్ద ఎత్తున డబ్బు కాజేయాలని కుట్ర పన్నారని తెలిపారు. అయితే ఇందులో తన కుమారుడు అమ్రీష్‌కు ఎటువంటి సంబంధం లేదని ఈ నెల 15వ తేదీన కోర్టు తీర్పిచ్చింది.
అదే విధంగా అమ్రీష్ పై పెట్టిన అన్ని కేసులనూ కొట్టివేసినట్లుగా బుధవారం తనకు కోర్టు నుండి పత్రాలు అందాయని ఆమె తెలిపారు. తన కుమారుడు అమ్రీష్ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఈ అక్రమ కేసుల్లో ఇరికించారని.. అది తల్లిగా తనను చాలా బాధ కలిగించిందని.. అయితే దైవానుగ్రహం వల్ల న్యాయమే గెలిచిందని ఆమె అన్నారు. ఇకపై అమ్రీష్‌కు వ్యవహారాలను తానె దగ్గరుండి పర్యవేక్షిస్తానని ఈ సందర్బంగా తెలిపారు.
అలాగే తనపై ఉన్న అన్ని కేసులను కొట్టివేసినట్టుగా కోర్టు నుంచి నాకు బుధవారం పత్రాలు అందాయి. అమ్రీస్ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని అక్రమ కుసుల్లో ఇరికించడం తల్లిగా నాకు చాలా బాధ కలిగించింది. దైవానుగ్రహం వల్ల న్యాయమే గెలిచింది. ఇకపై అమ్రీష్‌కి అన్నీ తానై వ్యవహాలను పర్యవేక్షిస్తాను. కాగా.. జయచిత్ర హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు తోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…