తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హాస్య నటీమణిగా పేరు తెచ్చుకున్న రమాప్రభ మహానటుల సరసన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటిగా నటించి తెలుగు ప్రేక్షక అభిమానులను ఎంతగానో అలరించారు. ఆమె తన తమ్ముడు గా భావించే దివంగత నటుడు రాజబాబు తో కలసి దాదాపు 300 పైచిలుకు సినిమాల్లో నటించారు అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో వీళ్ళిద్దరి కాంబినేషన్ కు చాలా డిమాండ్ ఉండేది. అలాగే అల్లు రామలింగయ్య, రమణారెడ్డి వంటి గొప్ప హాస్య నటుల సరసన కూడా నటించి వాహ్వా అనిపించారు.
కమెడియన్ రేలంగి సరసన ప్రాముఖ్యత కలిగిన పాత్రలలో కూడా నటించి తన నటనా చాతుర్యాన్ని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించారు. సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఆమె శరత్ బాబు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ 13 సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించారు కానీ తరువాత మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో విడిపోయారు. తదనంతరం అడపాదడపా తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మొన్నటి వరకు అలరించారు రమాప్రభ. ఎక్కువగా మదనపల్లిలో తన సమయాన్ని గడిపే రమాప్రభ సినిమా షూటింగ్ల నిమిత్తం నగరానికి విచ్చేస్తారు తప్ప మిగతా అన్ని సమయాల్లో మదనపల్లి దాటి వెళ్లరు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమాప్రభ ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలు వెల్లడించి అందర్నీ విస్తుపోయేలా చేశారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన అల్లుడు అని, ఏడాది వయసులో ఉన్న తన అక్క కూతురు విజయ చాముండేశ్వరిని తాను దత్తత తీసుకున్నానని, ఆమెని రాజేంద్రప్రసాద్ కు ఇచ్చి పెళ్లి చేశానని రమాప్రభ వెల్లడించారు. అలాగే ‘మా’ అసోసియేషన్ వల్ల తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు. తాను చనిపోయినా… ఆ విషయాన్ని మా అసోసియేషన్ కి ఎవరు చెప్పవద్దని ఆమె ఇంటర్వ్యూ లో కోరుతూ అందరినీ కంటతడి పెట్టించారు. మా అసోసియేషన్ వారు తనని అవమానించడం తో పాటు ఏ రోజు కూడా సముచిత గౌరవాన్ని ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరొక విస్తుపోయే నిజమేమిటంటే ఒకానొక దశలో రాజేంద్రప్రసాద్ మా అసోసియేషన్ కి చీఫ్ గా బాధ్యతలు వ్యవహరించారు. కానీ ఆ సమయంలో కూడా రమాప్రభ గౌరవ భంగం తప్ప లేదట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…