కన్నడ బుల్లితెర నటి నవ్య స్వామి తెలుగు బుల్లితెరపై “నా పేరు మీనాక్షి “సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై తన అందం అభినయంతో తెలుగు బుల్లితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం నవ్య స్వామి “ఆమె కథ “సీరియల్‌లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పడు తన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా ఫాలోవర్స్ ని ఆకర్షిస్తోంది.
నవ్య స్వామి మొదట కన్నడ బుల్లి తెరపై నటించిన “తంగళి ” డైలీ సీరియల్ సూపర్ హిట కావడంతో వరుస అవకాశాలు ఆమెను వరించాయి. అలాగే తమిళంలో “వాణీ రాణీ” సీరియల్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నవ్య స్వామి నటిస్తున్న “ఆమెకథ” సీరియల్ సహానటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణతో ప్రేమ వ్యవహారం విషయంతో మరింత పాపులర్ అయిన విషయం తెలిసిందే.
గతంలో నవ్య స్వామి చాలా సందర్భాల్లో రవి కృష్ణ నాకు మంచి మిత్రుడు. మా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం అంటూ వస్తున్న వార్తలు ఒట్టి అబద్ధాలే అంటూ కొట్టిపారేసింది. అయినప్పటికీ వీరిద్దరూ పలు ఈవెంట్లు,షోలలో క్లోజ్ గా ఉండటం.పైగా నవ్య షేర్ చేసిన ఫొటోలకు రవి కృష్ణ చాలా సందర్భాల్లో లవ్ సింబల్స్‌తో కామెంట్స్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న భావన ఖచ్చితంగా కలుగుతుంది.
తాజాగా నవ్య స్వామి తనకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా రవి కృష్ణ ఎప్పటిలాగే లవ్ సింబల్ తో కామెంట్ చేశాడు.ఈ కామెంట్ పై నెటిజన్లు స్పందిస్తూ రకరకాల కామెంట్స్ చేశారు.ఇందులో ఓ నెటిజన్ గతంలో నవ్యస్వామి అవిష్ గౌడ్ అనే అతనితో రిలేషన్ లో ఉన్నట్టు,అతడితో విడిపోయాక రవి కృష్ణతో రిలషన్ లో ఉన్నట్టు కామెంట్ చేయడంతో అనేక సందేహాలకు దారితీసింది. ఇప్పటివరకు ఈ విషయంపై నవ్య స్వామి, కానీ రవి కృష్ణ కానీ స్పందించకపోవడం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…