Tag Archives: political entry

Hyper Aadi: పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా.. పొలిటికల్ ఎంట్రీపై ఆది కామెంట్స్!

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హైపర్ ఆది మెగా అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఆది విపరీతమైనటువంటి అభిమానాన్ని చూపిస్తుంటారు. ఇక ఈయన ఇటీవల కాలంలో జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున మాట్లాడి వార్తలలో నిలిచారు.

ఈ క్రమంలోనే హైపర్ ఆది రాజకీయాలలోకి రాబోతున్నారంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఆది స్పందించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ ప్రొఫెషన్ వేరు పాలిటిక్స్ వేరని తెలిపారు. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం జబర్దస్త్ కార్యక్రమమని తెలిపారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నప్పుడు రోజా గారు మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు ఆమె రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని తనతో నాకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమాని ఆయనని వ్యక్తిగతంగా ఎవరైనా దూషిస్తూ తప్పకుండా నేను రియాక్ట్ అవుతాను పవన్ కళ్యాణ్ ఎవరి వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. ఆయన ఎన్నికలలో గెలవాలని నేను కోరుకుంటాను ఈసారి కూడా ఎన్నికలలో నేను జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు..

పవన్ గెలవాలని కోరుకుంటా..

ఇక ఎన్నికలలో పోటీ చేసే అవకాశం నాకు కనక వస్తే పవన్ కళ్యాణ్ ని గెలిపించడం కోసం నేను గెలుస్తానని హైపర్ ఆది కామెంట్ చేయడంతో ఈయన జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికి సిద్ధంగా ఉన్నానని టికెట్ ఇస్తే ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా సిద్ధమేనంటూ ఈ సందర్భంగా హైపర్ ఆది పరోక్షంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Upasana: ఉపాసన రాజకీయాలలోకి రాబోతున్నారా.. విజయ్ పార్టీ పెట్టడం పై ఉపాసన కామెంట్స్ వైరల్!

Upasana: ఉపాసన ఇటీవల తన తాతయ్య పుట్టినరోజు సందర్భంగా ది అపోలో స్టోరీస్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో భాగంగా ఉపాసన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఈమెకు పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

ముఖ్యంగా హీరో విజయ్ పార్టీ స్థాపించడం పట్ల ఈమెకు ప్రశ్నలు ఎదురు కాగ ఉపాసన సమాధానం చెబుతూ.. విజయ్ సినిమాల ద్వారా ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు సామాజిక సేవ కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం ఈ విషయంలో నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరికైనా సహాయం చేయాలి అంటే నాయకుడు ఎవరు అని ఆలోచించకుండా సహాయం చేయండి లేదంటే చేసే వారిని వెనక్కి లాగకండి అంటూ సమాధానం చెప్పారు.

మనం ఎప్పుడైతే కొత్త నాయకుడికి సపోర్ట్ చేస్తామో అప్పుడే మార్పు అనేది కూడా వస్తుందని ఉపాసన తెలిపారు. తమిళనాడులో కూడా ఆ మార్పులు వస్తాయని నేను ఆశిస్తున్నాను అంటూ ఈమె వెల్లడించారు సామాజిక సేవ కార్యక్రమాలలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన రాజకీయాలలోకి రాబోతున్నారా అనే ప్రశ్న ఎదురయింది.

రాజకీయాలలోకి మాత్రం రాను..

ఈ ప్రశ్నకు ఉపాసన సమాధానం చెబుతూ నేను రాజకీయాలలోకి రావడం అనేది మాత్రం జరగదని తెలిపారు. కానీ మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నించే నాయకుడికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఈమె తెలిపారు. ఇలా రాజకీయాల గురించి ఉపాసన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈమె పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

https://www.instagram.com/reel/C3AbbHHy4xv/?utm_source=ig_embed&ig_rid=632d59bb-6963-4d2d-a732-ce171538d024

Shayamala Devi: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ పెద్దమ్మ.. ఇందులో నిజమెంత?

Shayamala Devi: సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా ప్రభాస్ పెద్దమ్మ దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. తాజాగా కృష్ణం రాజు జయంతి సందర్భంగా మీడియాతో ముచ్చటించిన శ్యామలా దేవి తన భర్త గురించి, హీరో ప్రభాస్ గురించి తన ఫ్యామిలీ విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. అందులో భాగంగానే తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.

అదేమిటంటే శ్యామల దేవి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా మారింది. అయితే శ్యామలా దేవి భర్త దివంగత నటుడు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు రాజకీయాల్లో రాణించిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ తో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. పాలిటిక్స్‌లో ఆయన అనేక ఆటుపోట్లను చూశారు. నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రధానమంత్రి వాజపేయి మంత్రి వర్గంలో చోటు కూడా సంపాదించారు. బీజేపీలో చాలా కాలం కొనసాగారు కృష్ణంరాజు.

మధ్యలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళినా అక్కడ ఎక్కువకాలం ఉండలేకపోయారు. మళ్లీ బీజేపీ బాట పట్టారు. ఇక కృష్ణం రాజు మరణించిన ఇంత కాలానికి ఇప్పుడు ఆయన సతీమణి శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. నిన్నటి వరకు ఈ విషయంపై శ్యామలా దేవి స్పందించలేదు. తాజాగా కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌ నిర్వహణను స్వయంగా చూసుకున్నారు శ్యామలా దేవి. అంతే కాకుండా చాలా కాలంగా వినిపిస్తున్న తన రాజకీయరంగ ప్రవేశంపై కూడా మాట్లాడారు.

కృష్ణంరాజు మార్గంలోనే నడుస్తాను..

కృష్ణంరాజు మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానని చెప్పారు. పేదలకు విద్య, వైద్యం అందేలా చూడాలని కృష్ణంరాజు ఎంతగానో తపనపడేవారని, అందుకే ఆయన జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి తన ఆలోచన అంతా నిరుపేదలకు వైద్యం అందించడంపైనే ఉందని చెబుతూ జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యాక తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తానని ఆమె వివరించారు. ఈ రకంగా ఆమె రాజకీయ ప్రవేశం వార్తలను కొట్టిపారేయలేదు. రాజకీయాల్లోకి వస్తారు కాబట్టే.. తరువాత విషయం ప్రకటిస్తాను అన్నట్టు హింట్ ఇచ్చారు. ఇక శ్యామలా దేవి వైసీపీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆ పార్టీలోకి వెళ్ళడం దాదాపు ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక అఫీషియల్ గా ప్రకటించడంతో పాటు లాంచనంగా వైసీపీలోకి వెళ్లడమే మిగిలినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

Vishal: విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో విశాల్.. ఏమన్నారంటే?

Vishal: కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయన కోలీవుడ్ హీరో అయినప్పటికీ ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక విశాల్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. ఇకపోతే తాజాగా విశాల్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆగస్టు 29వ తేదీ విశాల్ తన 46వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ పుట్టిన రోజుకు వేడుకలలో భాగంగా ఈయన చెన్నైలోని కోయంబేడులో అభిమానుల మధ్య కేక్ ను కట్ చేశాడు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ తన తల్లి ఈ మార్కెట్లోనే కూరగాయలు పువ్వులు కొనుగోలు చేస్తూ ఉంటారని తెలియజేశారు అనంతరం ఈ వేడుకలలో భాగంగా ఈయన విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా మాట్లాడారు.

గత కొంతకాలంగా హీరో విజయ్ రాజకీయాలలోకి రాబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తల గురించి స్పందించినటువంటి విశాల్ విజయ్ రాజకీయాలలోకి వస్తే తప్పకుండా తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని తెలిపారు.

Vishal: మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను…


ఇలా విజయ్ రాజకీయాలలోకి వస్తే తన మద్దతు ఉంటుందంటూ విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పుట్టినరోజు సందర్భంగా విశాల్ కీల్పాక్ లోని అనాధ ఆశ్రమానికి వెళ్లి అక్కడ చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేయడమే కాకుండా వారితో పాటు కొంత సమయం గడిపి ఈయన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

Actor Suman: పొలిటికల్ ఎంట్రీ పై సుమన్ షాకింగ్ కామెంట్స్… తప్పకుండా రాజకీయాలలోకి వస్తానంటూ?

Actor Suman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు సుమన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క అంశం గురించి ఈయన మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో ఏం జరిగినా ఆ సంఘటనపై సుమన్ తన అభిప్రాయాలను తెలుపుతూ ఉంటారు.

తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన అక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా సమావేశంలో భాగంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా రజనీకాంత్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ రజనీకాంత్ మాటలలో తప్పు లేదని తెలిపారు.

ఇక రాజకీయాల గురించి కూడా సుమన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తాను తప్పకుండా రాజకీయాలలోకి వస్తానని తెలిపారు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత తాను తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.

Actor Suman: అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుంది…


ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందని ప్రతి ఏడాది వచ్చే ఈ విపత్తులు వర్షాల నుంచి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి అంటూ ఈ సందర్భంగా సుమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mokshagna: మోక్షజ్ఞ సినీ, రాజకీయ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి.. ఏమన్నారంటే?

Mokshagna: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయనతో పాటు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగిన పలువురు హీరోల కుమారులు ఇప్పటికే ఇండస్ట్రీలోకి వారసులుగా ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇదిగో అదిగో అంటూ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఊరిస్తున్నారు తప్ప ఈయన సినిమాల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీల జీవితాల గురించి కామెంట్స్ చేసిన వేణు స్వామి తాజాగా మోక్షజ్ఞ సినీ పొలిటికల్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ.. తాను మోక్షజ్ఞ జాతకం చూశానని, ఈయన జాతకం ప్రకారం ఇండస్ట్రీలో తన కెరియర్ ఎంతో అద్భుతంగా ఉంటుందని తెలిపారు. తన కెరీర్ మొత్తం ఇండస్ట్రీలోనే కొనసాగుతుందని,అయితే ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి మరో మూడు సంవత్సరాల సమయం పడుతుందంటూ వేణు స్వామి తెలిపారు.

Mokshagna: రాజకీయ యోగం లేదు..

సినిమా ఇండస్ట్రీలో ఆయన కెరియర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది అయితే ఈయన జాతకం ప్రకారం ఈయనకు రాజకీయ యోగం లేదని ఇతను రాజకీయాలకు దూరంగా ఉంటారని వేణు స్వామి తెలిపారు.ఇలా మోక్షజ్ఞ గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మోక్షజ్ఞ విషయంలో ఈయన జాతకం ఎంతవరకు నిజమవుతుంది అనేది తెలియాల్సి ఉంది.

Jr NTR: ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన తారక్… ఏమన్నారంటే?

Jr NTR: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి రాజకీయాలలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవాలనేదే నందమూరి అభిమానుల కోరిక అని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎంతో మంది ఎన్నో సార్లు ప్రస్తావించిన ఈ విషయంపై తారక్ ఎప్పుడు స్పందించలేదు.

Jr NTR: ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన తారక్… ఏమన్నారంటే?

2009 సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దఎత్తున ప్రచారం నిర్వహించిన ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. అప్పటి నుంచి ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ అభిమానుల మాత్రం తాను రాజకీయాలలోకి వస్తే చూడాలని ఎంతో ఆశగా ఉన్నారు.ఇలా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇన్నిరోజులు అభిమానులలో ఎన్నో సందేహాలు ఉండేవి.

Jr NTR: ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన తారక్… ఏమన్నారంటే?

తాజాగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం నటుడిగా తన కెరియర్ లో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఎన్టీఆర్ తెలిపారు.తాను తరువాత వచ్చే క్షణం గురించి ఆలోచించని ఉన్న ప్రతి ఒక్క క్షణాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తానని ఆయన వెల్లడించారు.

అభిమానులకు నిరాశే…

నటుడిగా నా కెరీర్లో నేను ఎంతో సంతృప్తిగా ఉన్నానని, రాజకీయాలపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని ఎన్టీఆర్ ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా టిడిపి పార్టీకి మద్దతు తెలుపుతారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఎన్టీఆర్ ఇలాంటి వార్త చెప్పడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఆ పార్టీ వాళ్లు రోజాని ఎంతో హింసించారు..వారి వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయాము: సెల్వమని

సీనీనటిగా, ఎంఎల్ఏ గా రోజా అందరికీ సుపరిచితమే. రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనీనటిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత రాజకీయాలలోకి అడుగు పెట్టింది. తాజాగా రోజా భర్త సెల్వమణి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని రోజా రాజకీయ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చంద్రబాబునాయుడు కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లి మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. అయితే రాజకీయాల్లో ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. అలా రాజకీయాల్లోకి ఎంటరైన రోజా చుట్టూ కుల రాజకీయాలు జరిగాయని ఆ పార్టీ వాళ్ళు మోసం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినా అతను ఏమి చేయకపోవడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు.

టిడిపి పార్టీలో ఉన్నప్పుడు రోజాను ఎంతో హింసించారని రాజకీయాలలో తనని ఎదగనివ్వకుండా చేశారని సెల్వమణి వెల్లడించారు. టిడిపి పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో గెలవడం కోసం సుమారు నాలుగైదు ఇల్లులను కూడా అమ్మకున్నామని ఆ పార్టీ వల్ల ఎంతో ఆస్తి నష్టాన్ని కూడా భరించామని ఈ సందర్భంగా సెల్వమణి తెలియజేశారు.

ఇలా తెలుగుదేశం పార్టీలో ఎన్నో హింసలకు గురి చేసిన తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. తనని కలవడానికి వెళ్లినప్పుడు రాజశేఖరరెడ్డిగారు సాదరంగా ఆహ్వానించి మంచిగా మాట్లాడటం చూసి నాకు పదవి అవసరం లేదు కేవలం పార్టీలో ఉంటానని రోజా చెప్పినట్టు సెల్వమని చెప్పారు. అప్పటినుంచి రోజా రాజశేఖర్ రెడ్డి పార్టీలో ఉండటమే కాకుండా తన మరణానంతరం జగన్ వెంట నడిచారు అని ఈ సందర్భంగా సెల్వమణి తెలియజేశారు. ఏ పార్టీలో మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారనే ప్రశ్న ఎదురుగా ప్రతి పార్టీలోనూ శత్రువులు ఉంటారని. ఈ సందర్భంగా సెల్వమణి తెలియజేశారు.

టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తాడా.. వస్తే వాళ్లు రానిస్తారా..?

సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు అతడి అల్లుడు నారాచంద్రబాబు నాయుడు లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ కావడం విశేషం. అయితే ఇలా సినిమా ఇండస్ట్రీలో సినీ నటులకు రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుందనే చెప్పాలి. ఎప్పుడో ఒక సందర్భంలో సెలబ్రిటీలు అటువైపు అడుగులు వేయకుండా ఉండలేరు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సెలబ్రెటీలు కూడా ఏదో ఒక సందర్భంలో రాజకీయాల్లోకి వెళ్లక తప్పదు.

ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగు దేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ముఖ్యమైన పట్టణాల్లో అతడు పార్టీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే. ఆ సమయంలోనే ఖమ్మం జిల్లా దగ్గర రోడ్డు యాక్సిడెంట్ కావడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ ను కేవలం ప్రచారం కోసమే వాడుకోవడం అభిమానులకు నచ్చలేదు. ప్రస్తుతం ఏపీ మరియు తెలంగాణలో టీడీపీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో అయితే టీడీపీ మొత్తం కనుమరుగైపోయిందనే చెప్పాలి.

ఇలాంటి కష్ట సమయంలో పార్టీని ఆదుకునే నాయకుడు కావాలని ఓ వర్గం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఒక్కరే ఇప్పుడు పార్టీని కాపాడగలడనే ఆశాభావం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కానీ పార్టీ క్యాడర్ లో చాలా మంది అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో ఇప్పుడే వెళ్లే పరిస్థితి లేదని ఓ ఇంటర్వ్యూలో కూడా అన్నాడు.

పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని మాత్రం చెప్పలేదు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో పాన్ ఇండియా లెవల్ లోకి అతడి మార్కెట్ వెళ్తోంది. ఇటువంటి సమయంలో అటు వైపు ఆలోచించడం కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నాడట. ఒకవేళ టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ లీడ్ చేస్తే మాత్రం పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని అతడి అభిమానులు అంటున్నారు.