Tag Archives: precautions

Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

Schemes Fraud: ప్రస్తుతం నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంట్లోకి చొరబడి దోచేయడం వంటివి చాలా వరకు తగ్గిపోయాయి. ప్రస్తుతం అంతా వైట్ కాలర్ మోసాలే జరుగుతున్నాయి. మనకు తెలియకుండా మన బ్యాంక్ అకౌంట్ల లోకి చొరబడుతున్నారు.

Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

అమాయకపు ప్రజలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఓటీపీ, డెబిట్ కార్డ్ పిన్ లతో మోసాలకు పాాల్పడుతున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ తరహా నేరాలు ఎక్కువగా నమోాదయ్యాయి. మనం మోసపోవడానికి మనచేతిలోని సెల్ ఫోన్, ఇంటర్నెట్ కారణమవుతోంది. టెక్నాలజీని యూజ్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

Schemes Fraud: ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ఇదిలా ఉంటే కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అధిక వడ్డీ, తక్కువ కాల వ్యవధి చూపుతూ… ఇన్వెస్ట్ చేయమంటూ.. స్కీముల పేరుతో మోసం చేస్తున్నారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపుతుండటంతో ప్రజలకు కూడా ఏం విచారణ చేయకుండా… సింపుల్ గా మోసపోతున్నారు.

సంబంధిత సమాచారం మొత్తం తెలుసుకోవాలి..

డబ్బులన్నీ స్కీముల్లో పెట్టి చివరకు ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొత్తగా వస్తున్న స్కీములకు సంబంధించిన మోసాలను పోంజి స్కీమ్స్ అని కూడా అంటారు. ఎప్పుడైనా స్కీముల పేరుతో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని కోరితే పూర్తిగా తెలుసుకొని ప్రొసీడ్ కావాలి. డబ్బులు పెట్టడానికి ముందే లిఖిత పూర్వకంగా ఇన్వెస్ట్మెంట్ కు  సంబంధిత సమాచారం మొత్తం తెలుసుకోండి.  అలానే ఇన్వెస్ట్మెంట్ ప్రమోటర్ను అడగడం, బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయండి. సర్వీసులు అందించడానికి లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోండి.

ఏ వయస్సు వారికి.. ఎలాంటి వ్యాధులు వస్తాయి.. ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

వయస్సు పెరుగుతున్నా కొద్ది ఆరోగ్యం క్షీణించడం అనేది సహజం. ఎవరైనా దాదాపు 40 ఏళ్ల వరకు ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటారు. 40 నుంచి చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా వచ్చే వ్యాధుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్, గుండెపోటు, డయాబెటీస్ వస్తుంటాయి. ఇవి పురుషులకు వచ్చే వ్యాధులు.

ఇలా వయస్సు మీద పడుతున్నా కొద్ది వస్తుంటాయి. అయితే ఇలా వచ్చినప్పుడే జాగ్రత్త పడే కంటే.. రాకుండా ఉండటానికి ఏం చేయాలో చాలా మంది ఆలోచించరు. దాని కోసం మంచి ఆహారం, వ్యాయామం లాంటివి చేస్తే జబ్బులు వచ్చే సమయం అనేది కాస్త దూరం జరుగుతుంది. దాదాపు ఎక్కువ శాతం 20 ఏళ్ల లోపు వారికి ఎలాంటి వ్యాధులు అనేవి రావు.

ఈ దశను గోల్డెన్ దశ అంటారు. ఇక 20 నుంచి 30 సంవత్సరాల వయస్సులో డ్రగ్స్, ఆల్కహాల్, పొగతాగడం, మానసిక అసమతుల్యతలతో బాధపడుతుంటాం. ఈ అలవాట్లు 50 ఏళ్ల తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. ఇక 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. 50 సంవత్సరాల పైన పడితే, పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ లేదా పేగు కేన్సర్ వచ్చే అవకాశాలుంటాయి.

అయితే ఇవి రాకుండా.. ఎప్పటికప్పుడు ఆసుపత్రుల్లో చెకప్ చేయించుకుంటూ జాగ్రత్తగా ఉంటే.. ఇలాంటి సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ముందుగానే దానికి తగ్గట్లు చికిత్స తీసుకోవచ్చు. అంతే కాకుండా సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు.. ప్రతీ రోజు నడక, వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

నడక ఏప్పుడు చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

నడక అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజుకు కనీసం 30 నిమిషాలు అయినా నడవాలనేది వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ నడక అనేది ఎప్పుడు చేయాలి.. ఏ సమయంలో చేస్తే ఆరోగ్యానికి మంచిది. వాకింగ్ చేసే వాళ్లలో చాలామందికి దానిపై అవగాహన ఉండదు. దీని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దీని కంటే ముందు వాకింగ్ చేసే సమయంలో కనీస జాగ్రత్తలు ఉండాలని నిపుణులు చెబుతుంటారు. వాకింగ్ ముందు మూడు నిమిషాలు వార్మప్ చేసి.. తర్వాత వాకింగ్ చేయాలనేది వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇలా కాకుండా వెంటనే వాకింగ్ మొదలు పెట్టడం అస్సలు మంచిది కాదు. అయితే నడక అనేది భోజనం చేసిన తర్వాత చేయాలి.

ఇలా అలవాటు చేసుకుంటే షుగర్ వ్యాధి దరి చేరే అవకాశం ఉండదు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతే కాదు శరీరంలోని ప్రతీ భాగం కదలికలతో ఆ శక్తి అనేది ప్రతీ భాగానికి వెళ్తుంది. ఇక వాకింగ్ చేసే వాళ్లు మరి కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి.

వాకింగ్ చేసే సమయంలో అలసట వచ్చిన తర్వాత చాలామంది నడక ఆపేస్తారు. బాగా అలసిన తర్వాత కూడా మనం ఎంతసేపు నడుస్తామో అప్పుడే అధికంగా కొవ్వు కరుగుతుంది. అందుకే ప్రతి వారం వాకింగ్ వేగాన్ని, సమయాన్ని పెంచుకుంటూ వెళ్లాలని నిపుణులు సూచిస్తారు. ఏదేమైనా వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదే గానీ.. నష్టం అయితే ఉండదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: FAASI

ప్రస్తుతం కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వర్షాకాలం ప్రారంభం అవడంతో సర్వసాధారణంగా వచ్చే జలుబు, దగ్గు,జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో పాటు మనం తీసుకునే ఆహారం మరియు దోమల ద్వారా వ్యాపించే మలేరియా, కలరా, డెంగ్యూ,డయేరియా,చికన్ గున్యా,టైఫాయిడ్ వంటి వ్యాధులనుఎదుర్కోడానికి ప్రజల ఆరోగ్యంపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని పలు ఆరోగ్య సంస్థలతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరిస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విభాగం సూచనల ప్రకారం వర్షాకాలంలో ఎదురయ్యే సీజనల్ వ్యాధులతో పాటు మనం తీసుకునే ఆహారం వల్ల ఎక్కువ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వాటి నుంచి రక్షణ పొందడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని సూచనలను ప్రజలకు తెలియజేసింది ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

వర్షాకాలంలో మనం తొందరగా వ్యాధి కారకాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధినిరోధక శక్తిని పెంచి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మొదట మనఇంట్లోనూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి లేదంటే దోమలు చేరి ప్రమాదకర వ్యాధులకు కారణం కావచ్చు. ప్రతిరోజు వంట చేయడానికి ముందు పాత్రలను శుభ్రం చేసుకోవాలి.వర్షాకాలంలో నిల్వ ఉంచిన ఆహారంలో సూక్ష్మజీవులు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తాజా ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిది. యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

భారత్ కి థర్డ్ వేవ్ ముప్పు.. ప్రజలు జాగ్రత్తలు పాటించలేదని నిపుణులు ఆందోళన!

దేశంలో కరోనా రెండవ దశ ఎంతటి స్థాయిలో విజృంభించి దేశాన్ని.వణికించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రోజుకు లక్షల్లో కేసులు నమోదవగా వేలల్లో మృత్యువాతపడ్డారు. అయితే ఇండియా ఇప్పుడిప్పుడే కరోనా రెండవ దశ నుంచి క్రమంగా కోలుకుంటోంది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు.ఈ క్రమంలోనే ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించక పోవడంతో నిపుణులు భారత్ కి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియాలో కరోనా రెండవ దశ పూర్తిగా తొలగి పోకముందే మూడవ దశ ప్రారంభం అవుతుందని ఆందోళనలో నిపుణులు ఉన్నారు. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ తొలగించారు ఈక్రమంలోనే ప్రజలు గుంపులు గుంపులుగా, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు.

మరి కొన్ని రాష్ట్రాలలో ప్రజలు ఎక్కువగా పర్యాటక ప్రదేశాలకు వెళ్లడమే కాకుండా అక్కడ కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకుండా తిరగడం వల్ల కరోనా మూడవ దశ వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యాటక శాఖ మరి కొద్ది రోజుల పాటు టూరిజం వాయిదా ఆ వేసుకోవడం మంచిదని నిపుణులు సూచించారు.

కరోనా నుంచి పిల్లలను ఇలా రక్షించుకోండి..!

గత ఏడాదిన్నర కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ప్రతి ఒక్కరిలో మార్పును తీసుకు వచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆఫీసులకు వెళ్లేవారు ఇంటినుంచి పని చేయగా, స్కూలుకు వెళ్లే చిన్నారులు ఆన్లైన్ క్లాసులతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు నిత్యం కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వారు మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పిల్లలు బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావడం వల్ల వారిలో మరి కొన్ని సమస్యలు అధికంగా ఉన్నాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు కరోనా బారిన పడకుండా వారిని ఎలా రక్షించుకోవాలి. వారిలో ఉన్న మానసిక ఆందోళనలు ఏవిధంగా తొలగించాలనే విషయం గురించి పలువురు నిపుణులు తెలియజేశారు. మరి పిల్లలను ఏ విధంగా రక్షించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా స్కూల్ కి వెళ్లి తోటి పిల్లలతో ఎంతో ఆనందంగా గడుపుతూ చదువుకునే విద్యార్థులు ప్రస్తుతం ఇంటిలో ఆన్లైన్ క్లాసులకు పరిమితమయ్యారు. ఈ విధంగా నిత్యం కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి ఆందోళనలు అధిక శ్రమ వారిలో మరి కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలోనే పిల్లల తల్లిదండ్రులు పిల్లలతో ఎంతో చనువుగా, ప్రేమగా వ్యవహరిస్తూ ఉండటం వల్ల వారిలో ఒత్తిడి తగ్గుతుంది. పాఠశాలకు వెళ్లే పిల్లలు కేవలం వారికి చదువు పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా తలెత్తే సమస్యలను సైతం ఉపాధ్యాయులు అడిగి తెలుసుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించేవారు.ఈ విధంగా తల్లిదండ్రులు కూడా వారు ప్రతి చిన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తే పిల్లలలో ఎలాంటి ఆందోళనలు ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితుల నుంచి పిల్లలను రక్షించుకోవాలంటే తల్లిదండ్రులు కొంత సమయం పాటు దగ్గరుండి ఆ విలువైన సమయాన్ని పిల్లలతో హాయిగా గడపటం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి చిన్న విషయంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు ఎటువంటి మానసిక సమస్యలకు,కరోనా వంటి మహమ్మారి బారిన పడకుండా రక్షించగలమని నిపుణులు తెలియజేస్తున్నారు.

మాస్క్ ఇలా వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం నుంచి కనిపించని ఒక చిన్న సూక్ష్మ జీవితో యావత్ ప్రపంచం మొత్తం తీవ్ర పోరాటం చేస్తోంది. వివిధ రకాల వేరియంట్లలో ఉత్పరివర్తనం చెందుతూ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మహమ్మారిని కట్టడి చేయాలంటే కేవలం మన ముందున్న ఏకైక అస్త్రం మాస్క్, వ్యాక్సిన్ వేయించుకోవడం.ఇంత జనాభా కలిగిన మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందాలంటే చాలా సమయం పడుతుంది కనుక ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయట పడాలంటే తప్పనిసరిగా మాస్కు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ క్రమంలోనే గత నెలలో చేసిన ఓ సర్వే ప్రకారం చాలా మంది మాస్కులు వేసుకున్నప్పటికీ వాటిని సరైన క్రమంలో ధరించకపోవడం వల్ల ప్రమాదం బారిన పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కరోనాను కట్టడి చేయడం కోసం వివిధ రకాల మాస్కులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. క్లాత్ మాస్క్ లను వాడటం వల్ల మనకు వైరస్ నుంచి 65 శాతం రక్షణ ఉంటుంది. అదేవిధంగా సర్జికల్ మాస్ వాడటం ద్వారా 75 శాతం రక్షణ పొందవచ్చు. ఇకపోతే ఎన్-95 మాస్క్ వాడటం వల్ల ఈ వైరస్ నుంచి 95 శాతం వరకు రక్షణ పొందవచ్చు.

ఈ కరోనా వైరస్ నుంచి 100% మనకు రక్షణ కలగాలంటే తప్పనిసరిగా డబల్ మాస్క్ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ ఎంతో ప్రమాదకరమైనది కావడం చేత ప్రతి ఒక్కరు డబల్ మాస్కు ధరించాలని, ఈ విధంగా ఒక సర్జికల్ మాస్క్ ఒక క్లాత్ మాస్క్ ధరించినప్పుడే వైరస్ నుంచి 100 శాతం రక్షణ పొందగలమని తెలిపారు.

మాస్కులు ధరించే సమయంలో ప్రతి ఒక్కరు సురక్షితమైన మాస్క్ లను ఉపయోగించాలి. వాడినది ఏ మాత్రం ఉతకకుండా తిరిగి వాడటం, బాగా మురికిగా ఉన్న మాస్క్ లను పదే పదే వాడటం వల్ల మరింత ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది కనుక క్లాత్ మాస్క్ లను వాడేవారు తప్పనిసరిగా ప్రతిసారి ఉతికి శుభ్రం చేసిన తర్వాత ఉపయోగించాలి. ఇక సర్జికల్ మాస్క్ కేవలం ఒక్కసారి మాత్రమే అంటే 12 గంటల వరకు ఉపయోగించవచ్చు.ఎన్-95 మాస్క్ ను ఎలాంటి పరిస్థితులలో ఉతకకూడదు. ఈ మాస్క్ ఉతకడం వల్ల ఫిల్టర్ సామర్థ్యాన్ని కోల్పోతుంది కనుక దీనిని కాకుండా ఎండలో వేసి ఐదు సార్లు వరకు ఉపయోగించవచ్చు.

మాస్కులు ధరించేవారు ఏకంగా మాస్క్ ను చేతితో తాకకుండా,మాస్క్‌ని దానిలో ఇన్నర్‌ లూపులు, స్ట్రాప్‌లతో మాత్రమే హ్యాండిల్‌ చేయాలి. మాస్క్‌ మీ ముక్కు నోరు గడ్డం పూర్తిగా కప్పి ఉంచేలా ఉండాలి. అవసరం అనుకుంటే మాస్క్ స్ట్రాప్ లను ముడివేసే అయినా మనకు రక్షణగా ఉండేలా వేసుకోవాలి. మాస్క్ ధరించిన తర్వాత ఒకవేళ తీయాల్సిన పరిస్థితి వస్తే మాస్క్ ను తాకకుండా చెవి లూప్ పట్టుకొని తొలగించాలి.ఈ విధంగా తీసిన మాస్క్ ను శుభ్రమైన ప్రదేశంలో పెట్టడం వల్ల తిరిగి దీనిని ధరించే అవకాశం ఉంటుంది. ఇక ఉపయోగించిన మాస్క్ లను ఎక్కడపడితే అక్కడ వేయకుండా అన్ని ఒక బిన్ లో వేసి ఒక చోట కాల్చి చేయాలి. ఈ విధంగా సరైన క్రమంలో మాస్క్ ధరించడం వల్ల ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉంటారని హైదరాబాద్ సీసీఎంబీ వీడియో రూపంలో తెలియజేశారు.

ప్రజలకు మహేష్ బాబు బహిరంగ విన్నపం..!!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది.. అంతేకాదు మరణాలు కూడా ఇదే స్థాయిలో సంభవిస్తున్నాయి. ఒక రోజు మరణాలు 2 వేల దగ్గరకు వచ్చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. కానీ.. ఇంత జరుగుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.దానికి పెరుగుతున్న కేసులే నిదర్శనం.ఇలాంటి పరిస్థితుల్లో జనాలకు సెలబ్రిటీలు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

ఇప్పటికే పలువురు ప్రముఖులు సలహాలు, సూచనలు చెప్పారు. తాజాగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. ఇలాంటి సమయంలో నిర్వర్తించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ఆయన ఏమన్నారంటే…”అసాధారణ సమయాల్లో అసాధారణ చర్యలు అవసరం. మాస్కు ధరించండి. పరిసరాలను శుభ్రపరచండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. తప్పనిసరిగా టీకాలు వేయించుకోండి. మనం ఇంతకు ముందే ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాం.

మళ్లీ యుద్ధం చేద్దాం. మాస్క్ ధరించండి – సురక్షితంగా ఉండండి – బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండండి” అని అన్నారు.ఇక, మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రిన్స్. కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలోనూ నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లోపాల్గొంటున్నారు.

వచ్చే ఏడాది రాజమౌళితో సినిమా ఉన్న నేపథ్యంలో.. ఈ చిత్రం త్వరగా పూర్తి చేసి, మధ్యలో త్రివిక్రమ్ తో మరో సినిమా చేయాల్సి ఉంది..అందుకే ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేసి.. త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించే ప్లాన్ లో చేసాడు..కానీ అంతలోనే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరగడంతో ప్రస్తుతం షూటింగ్ ని నిలిపివేసింది చిత్ర యూనిట్.. దీంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా కొంత సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది…!!

స్కిన్ ఇన్ఫెక్షన్ ఎలా బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!

ప్రస్తుత కాలంలో ఎంతోమందిని వేధించే సమస్యలలో స్కిన్ ఇన్ఫెక్షన్ల సమస్య ఒకటి అని చెప్పవచ్చు. వాతావరణ కాలుష్యం వల్ల రోజుకు ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతోంది.అంతేకాకుండా కొందరి శరీర తత్వాలను బట్టి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ విధంగా చర్మ సమస్యలు రావడానికి ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన కారణాలు తలెత్తుతుంటాయి. ఈ విధంగా స్కిన్ ఇన్ఫెక్షన్లు మనలో వ్యాపించే కూడదు అంటే వ్యక్తిగత పరిశుభ్రత ఇందుకు చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యనుంచి విముక్తిని పొందవచ్చు. అయితే ఆ మార్గాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

చర్మ సమస్యలతో బాధపడేవారు ముందుగా వ్యక్తిగతంగా మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఎక్కువగా నీటి శాతం కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు అధిక మొత్తంలో నీటిని తాగాలి. ముఖ్యంగా దుస్తులను ధరించే విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల దుస్తులను ధరించకూడదు. అదేవిధంగా దుస్తులు మన శరీరానికి అనుకూలంగా ఉండేవిధంగా వేసుకోవాలి.

మన చర్మం పై ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే వేడి నీటితో శుభ్రం చేసుకొని వాటిపై యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ క్రీములను రాసుకోవాలి. ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు వాతావరణ కాలుష్యం వల్ల చాలా మందికి చర్మ సమస్యలు ఎదురవుతాయి.ఆ విధంగా బయటకు వెళ్లేటప్పుడు మొహానికి స్కార్ఫ్ ధరించి జాగ్రత్తలు తీసుకోవాలి.బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు శుభ్రంగా కాళ్లు, చేతులను కడుక్కోవడం వీలైతే స్నానం చేయడం ఉత్తమం.ఇకపోతే మధుమేహ సమస్యతో బాధపడేవారు వారి చర్మ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా చర్మ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.

గర్భం దాల్చిన మహిళలు కచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలివే..!

సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు ఎన్నో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. వారు తీసుకొనే ఆహారం నుంచి చేసే ప్రతి పని వరకు అన్ని విషయాలలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయమది. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి డెలివరీ అయిన కొన్ని నెలల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తల్లి ,బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గర్భందాల్చిన మహిళలు తగినన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల వారి కడుపులో పెరిగే బిడ్డకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుందని చెబుతున్నారు. అయితే గర్భం దాల్చిన మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

గర్భం దాల్చిన మహిళలు మొదటగా తాను గర్భవతి అని తెలుసుకున్న మొదటి నెల నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో సరైన పోషకాహారం తీసుకోవాలి. ఒకేసారి అధిక మొత్తంలో ఆహారం తీసుకోకుండా వీలైనన్ని సార్లు ఆహారం తీసుకోవడం వల్ల తగినన్ని పోషకాలు శరీరానికి అంది, కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎక్కువ భాగం మహిళలు ఐరన్, క్యాల్షియం, ప్రోటీనులు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ఎక్కువగా గుడ్లు, పాలు, మాంసం, చేపలు, తాజా పండ్లు కూరగాయలు,వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.

అదేవిధంగా ప్రతినెల వైద్యుని సంప్రదించి ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాలి. గర్భం దాల్చిన మహిళలు వారి శరీరంలో రక్తపోటును ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైతే కొన్నిసార్లు స్కానింగ్ వంటివి చేయించుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువు బరువు, ఆరోగ్య పరిస్థితి మనం తెలుసుకోవచ్చు.

గర్భం దాల్చిన మహిళలు వీలైనంతవరకు బరువైన పనులను చేయకుండా ఉండాలి. ఈ విధంగా బరువైన పనులు చేయటం వల్ల కొన్ని సార్లు గర్భస్రావమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా పగలు రెండు గంటల పాటు నిద్ర పోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. వీలైనంత వరకు మనసుకు నచ్చిన పుస్తకాలు చదువుతూ, పాటలు వింటూ గడపాలి.ఇక దుస్తుల విషయంలో గర్భం ధరించిన మహిళలు ఎప్పుడు వదులుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ జాగ్రత్తలన్నింటిని పాటిస్తూ క్రమం తప్పకుండా మందులను వాడటం వల్ల తల్లి బిడ్డలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.