Tag Archives: Rahul gandhi

Rahul Gandhi: రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేసిన కేజిఎఫ్ 2 మ్యూజిక్ సంస్థ… ఎందుకంటే?

Rahul Gandhi: కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ ఎలాగైనా తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున దేశంలోని వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తూ తన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.ఇలా ఒకవైపు పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లాలని ఈయన శతవిధాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈయనపై కేజిఎఫ్ 2 మ్యూజిక్ సంస్థ కేసును ఫైల్ చేసింది.

ఇలా రాహుల్ గాంధీ పై మ్యూజిక్ సంస్థ కేసు పెట్టడానికి గల కారణం ఏంటి అసలు వీరిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే…రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి పర్యటించిన విషయం మనకు తెలిసిందే. రాహుల్ పర్యటనలో భాగంగా ప్రచార కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోల కోసం కేజిఎఫ్2 లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని బీభత్సంగా ఉపయోగించారు.

ఈ సినిమాలో యష్ స్క్రీన్ పై కనిపిస్తూ స్లో మోషన్ లో ఉన్నప్పుడు బ్యాగ్రౌండ్ సోర్స్ ఎలా ఉంటుందో అదే విధంగా యశ్ స్థానంలో రాహుల్ గాంధీని ఉంచి అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడంతో ఈ వీడియోలో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోలపై స్పందించిన మ్యూజిక్ సంస్థ కాంగ్రెస్ నేతలు ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా ‘కె.జి.యఫ్ 2’ సినిమాలోని బ్యాగ్రౌండ్ స్కోర్ వాడారంటూ కేసు నమోదు చేశారు.

Rahul Gandhi: అనుమతి లేకుండా మ్యూజిక్ వాడారు…

రాహుల్ గాంధీ వీడియోల్లో తాము హక్కులు కొనుకున్న ‘కె.జి.యఫ్ 2’ కంటెంట్ ను ఫ్రీ కంటెంట్ టైప్ లో వాడుకున్నారని, పబ్లిసిటీ కోసం ఎలాంటి పర్మిషన్ లైసెన్స్ లేకుండా ఉపయోగించారంటూ కాపీరైట్ కింద కేసును నమోదు చేశారు. మరి ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ఈ విషయంపై మీమర్స్ మీమ్స్ క్రియేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

Rahul Gandhi: పబ్ లో రాహుల్ గాంధీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా?

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ లోని ఖాట్మండు నైట్ క్లబ్‌లో ఓ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని
బీజేపీ జాతీయ ఐటీ విభాగం చీఫ్ మాళవియా ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇదే అదునుగా భావించిన బీజేపీ నేతలు రాహుల్ గాంధీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Rahul Gandhi: పబ్ లో రాహుల్ గాంధీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా?

ఇక ఈయన పబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఈయన పక్కన పబ్ లో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఎవరు అనే విషయం గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ అమ్మాయి చైనా రాయబారి అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చైనా రాయబారి హౌ యాంకీ అని చెబుతూనే మరో అడుగు ముందుకేసి ‘చైనా హనీ ట్రాప్’ అనే పదాన్ని కూడా ఉపయోగించారు.

Rahul Gandhi: పబ్ లో రాహుల్ గాంధీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా?

రాహుల్ గాంధీతో పాటు పబ్ లో ఉన్నటువంటి అమ్మాయి గురించి పెద్ద ఎత్తున చర్చలు జరగడంతో ఈ విషయంపై ఓ జాతీయ మీడియా సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేయగా… ఆమె చైనా రాయబారి కాదని తేలింది. ఆ అమ్మాయి రాహుల్ గాంధీ స్నేహితురాలు సీఎన్ఎన్ మాజీ జర్నలిస్ట్ సుమ్నిమా ఉదాస్ స్నేహితురాలని వెల్లడించారు.

ఏ ఒక్కరూ చైనీయులు కాదు…

రాహుల్ గాంధీ తన స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్ వివాహం కోసం నేపాల్ వెళ్లారు. వివాహ విందును నైట్ క్లబ్ లో ఏర్పాటు చేయగా.. ఆ సమయంలో రాహుల్ గాంధీతో పాటు మరో ఐదుగురు ఆ క్లబ్ కు వెళ్లారు. ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరిలో కూడా చైనీయులు లేరని నైట్ క్లబ్ యాజమాన్యం తెలియజేశారు. అయితే ఆ సమయంలో రాహుల్ గాంధీ క్లబ్ లో ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆయనపై ఎంతోమంది విమర్శలు చేశారు.

రాహుల్ గాంధీ కి షాక్ ఇచ్చిన ఫేస్బుక్!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి మరో సోషల్ మీడియా సంస్థ షాక్ ఇచ్చింది. దిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలికల కుటుంబ వివరాలను బహిర్గతం చేస్తూ ఓ ఫొటో పోస్ట్ చేసినందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ .. రాహుల్ గాంధీ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ పై చర్యలకు ఫేస్ బుక్ ను ఆదేశించింది.

ఇటీవలే రాహుల్‌ గాంధీ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. తమ నిబంధనలకు విరుద్ధంగా ట్వీట్ చేసిన రాహుల్ ఖాతా బ్లాక్ చేస్తున్నట్లు సంస్థ వివరణ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ కూడా చర్యలకు ఆదేశించడంతో రాహుల్ కు మరో షాక్ తగిలినట్లయింది.

కపిల్ సిబల్ వైఖరిపై గుర్రుగా ఉన్న హైకమాండ్..

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కపిల్ సిబల్ వైఖరిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. కపిల్ సిబల్​ తన నివాసంలో ప్రతిపక్ష నేతలకు సోమవారం రాత్రి విందు ఇవ్వడం వెనకున్న మర్మం ఏమిటన్నది తెలియక పార్టీ నేతలు సందిగ్ధంలో పడిపోయారు. ఇందుకు కారణం లేకపోలేదు.తన శక్తి సామర్థ్యాలేంటో కాంగ్రెస్ అదిష్ఠానానికి తెలియజేసేందుకే సిబల్ ఈ భేటీ నిర్వహించినట్లు సన్నిహిత వర్గాల అంటుంటే.. గాంధీ లు లేకుండా విందు నిర్వహించడం ఏమిటని సిబల్ వ్యతిరేక వర్గం మండిపడుతోంది.

కాగా కపిల్​ సిబల్ కార్యాలయం మాత్రం ఇందుకు భిన్నమైన ప్రకటన విడుదల చేసింది. ఇది ఆయన వ్యక్తిగత విందు సమావేశం అని, రాజకీయాలతో సంబంధం లేదని తెలిపింది. మరోవైపు ప్రతిపక్షాలతో విందు పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసహనంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బిగ్ షాక్

కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను స‌స్పెండ్ చేసిన‌ట్లు ట్యిట్టర్ సంస్థ ప్రకటించింది. తాజాగా తను చేసిన ఓ పోస్ట్‌లో అత్యాచారం, హ‌త్యకు గురైన ఘ‌ట‌న‌లో బాధితురాలి బంధువుల ఐడెంటిటీని బ‌య‌ట‌పెట్టార‌ని పలువురు ఆయనపై విమర్శలు చేసిన నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను స‌స్పెండ్ చేశారు.

Rahul gandhi

బుధ‌వారం అత్యాచారం, హ‌త్య గురైనా ఓ చిన్నారి త‌ల్లిదండ్రుల‌ను రాహుల్ పరామర్శించారు. త‌ర్వాత వారి ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “త‌ల్లిదండ్రులు ఆవేదన అర్థమవుతుంది. వారి కూతురు భారత మాత ముద్ద బిడ్డ. బాధితుల‌కు న్యాయం జ‌రగాలి. అంతవరకు వారి తరపున పోరాటం చేస్తామని” పేర్కొన్నారు.