Rahul Gandhi: పబ్ లో రాహుల్ గాంధీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా?
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ లోని ఖాట్మండు నైట్ క్లబ్‌లో ఓ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని
బీజేపీ జాతీయ ఐటీ విభాగం చీఫ్ మాళవియా ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇదే అదునుగా భావించిన బీజేపీ నేతలు రాహుల్ గాంధీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఇక ఈయన పబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఈయన పక్కన పబ్ లో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఎవరు అనే విషయం గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ అమ్మాయి చైనా రాయబారి అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చైనా రాయబారి హౌ యాంకీ అని చెబుతూనే మరో అడుగు ముందుకేసి ‘చైనా హనీ ట్రాప్’ అనే పదాన్ని కూడా ఉపయోగించారు.
రాహుల్ గాంధీతో పాటు పబ్ లో ఉన్నటువంటి అమ్మాయి గురించి పెద్ద ఎత్తున చర్చలు జరగడంతో ఈ విషయంపై ఓ జాతీయ మీడియా సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేయగా… ఆమె చైనా రాయబారి కాదని తేలింది. ఆ అమ్మాయి రాహుల్ గాంధీ స్నేహితురాలు సీఎన్ఎన్ మాజీ జర్నలిస్ట్ సుమ్నిమా ఉదాస్ స్నేహితురాలని వెల్లడించారు.
రాహుల్ గాంధీ తన స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్ వివాహం కోసం నేపాల్ వెళ్లారు. వివాహ విందును నైట్ క్లబ్ లో ఏర్పాటు చేయగా.. ఆ సమయంలో రాహుల్ గాంధీతో పాటు మరో ఐదుగురు ఆ క్లబ్ కు వెళ్లారు. ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరిలో కూడా చైనీయులు లేరని నైట్ క్లబ్ యాజమాన్యం తెలియజేశారు. అయితే ఆ సమయంలో రాహుల్ గాంధీ క్లబ్ లో ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆయనపై ఎంతోమంది విమర్శలు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…