General News

Rahul Gandhi: రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేసిన కేజిఎఫ్ 2 మ్యూజిక్ సంస్థ… ఎందుకంటే?

Rahul Gandhi: కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ ఎలాగైనా తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున దేశంలోని వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తూ తన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.ఇలా ఒకవైపు పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లాలని ఈయన శతవిధాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈయనపై కేజిఎఫ్ 2 మ్యూజిక్ సంస్థ కేసును ఫైల్ చేసింది.

ఇలా రాహుల్ గాంధీ పై మ్యూజిక్ సంస్థ కేసు పెట్టడానికి గల కారణం ఏంటి అసలు వీరిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే…రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి పర్యటించిన విషయం మనకు తెలిసిందే. రాహుల్ పర్యటనలో భాగంగా ప్రచార కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోల కోసం కేజిఎఫ్2 లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని బీభత్సంగా ఉపయోగించారు.

ఈ సినిమాలో యష్ స్క్రీన్ పై కనిపిస్తూ స్లో మోషన్ లో ఉన్నప్పుడు బ్యాగ్రౌండ్ సోర్స్ ఎలా ఉంటుందో అదే విధంగా యశ్ స్థానంలో రాహుల్ గాంధీని ఉంచి అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడంతో ఈ వీడియోలో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోలపై స్పందించిన మ్యూజిక్ సంస్థ కాంగ్రెస్ నేతలు ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా ‘కె.జి.యఫ్ 2’ సినిమాలోని బ్యాగ్రౌండ్ స్కోర్ వాడారంటూ కేసు నమోదు చేశారు.

Rahul Gandhi: అనుమతి లేకుండా మ్యూజిక్ వాడారు…

రాహుల్ గాంధీ వీడియోల్లో తాము హక్కులు కొనుకున్న ‘కె.జి.యఫ్ 2’ కంటెంట్ ను ఫ్రీ కంటెంట్ టైప్ లో వాడుకున్నారని, పబ్లిసిటీ కోసం ఎలాంటి పర్మిషన్ లైసెన్స్ లేకుండా ఉపయోగించారంటూ కాపీరైట్ కింద కేసును నమోదు చేశారు. మరి ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ఈ విషయంపై మీమర్స్ మీమ్స్ క్రియేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

11 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

11 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

11 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

12 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

12 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

12 hours ago