Rahul Gandhi: కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ ఎలాగైనా తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున దేశంలోని వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తూ తన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.ఇలా ఒకవైపు పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లాలని ఈయన శతవిధాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈయనపై కేజిఎఫ్ 2 మ్యూజిక్ సంస్థ కేసును ఫైల్ చేసింది.

ఇలా రాహుల్ గాంధీ పై మ్యూజిక్ సంస్థ కేసు పెట్టడానికి గల కారణం ఏంటి అసలు వీరిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే…రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి పర్యటించిన విషయం మనకు తెలిసిందే. రాహుల్ పర్యటనలో భాగంగా ప్రచార కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోల కోసం కేజిఎఫ్2 లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని బీభత్సంగా ఉపయోగించారు.
ఈ సినిమాలో యష్ స్క్రీన్ పై కనిపిస్తూ స్లో మోషన్ లో ఉన్నప్పుడు బ్యాగ్రౌండ్ సోర్స్ ఎలా ఉంటుందో అదే విధంగా యశ్ స్థానంలో రాహుల్ గాంధీని ఉంచి అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడంతో ఈ వీడియోలో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోలపై స్పందించిన మ్యూజిక్ సంస్థ కాంగ్రెస్ నేతలు ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా ‘కె.జి.యఫ్ 2’ సినిమాలోని బ్యాగ్రౌండ్ స్కోర్ వాడారంటూ కేసు నమోదు చేశారు.

Rahul Gandhi: అనుమతి లేకుండా మ్యూజిక్ వాడారు…
రాహుల్ గాంధీ వీడియోల్లో తాము హక్కులు కొనుకున్న ‘కె.జి.యఫ్ 2’ కంటెంట్ ను ఫ్రీ కంటెంట్ టైప్ లో వాడుకున్నారని, పబ్లిసిటీ కోసం ఎలాంటి పర్మిషన్ లైసెన్స్ లేకుండా ఉపయోగించారంటూ కాపీరైట్ కింద కేసును నమోదు చేశారు. మరి ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ఈ విషయంపై మీమర్స్ మీమ్స్ క్రియేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
MRT Music ( #KGF2) files Copy Right Case against videos posted by the Indian National Congress featuring Mr. Rahul Gandhi, for using content without seeking permission/license for marketing and publicity. #MRTMusic #CopyRights pic.twitter.com/YlgFlPf8db
— ???????????????????????????????????????????? (@UrsVamsiShekar) November 4, 2022





























