Featured

Mahanati Savithri : చివరి రోజుల్లో మహానటి సావిత్రి ఎదుర్కొన్న అవమానాలు… కనీసం తిండి పెట్టలేదు.. : గుమ్మడి వెంకటేశ్వరరావు

Mahanati Savithri : అలనాటి తార సావిత్రి హీరోలకు ధీటుగా స్టార్ డమ్ ని సంపాదించుకున్న హీరోయిన్. హీరోలకు సమానంగా అభిమానులను సంపాదించుకున్న మహానటి కొంతమంది హీరోలను స్క్రీన్ మీద తన నటనతో డామినేట్ చేసేది. అందం, అభినయం, వ్యక్తిత్వం అన్నీ కలగలసిన ఏకైక హీరోయిన్ గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చిరస్తాయిగా మిగిలిన తార. పేదరికం నుండి వచ్చిన సావిత్రి గారు ఆ తరువాత సినిమాల్లో నటన ద్వారా కొన్ని వేల కోట్ల ఆస్తులను సంపాదించారు. కానీ చివరి దశలో అదే పేదరికంలో మరణించారు. ఆమె దాన గుణం ఎంతో మందికి అన్నం పెట్టింది, సహాయం ఆందించింది కానీ చివరికి ఆమెకు అన్నం కూడా పెట్టని పరిస్థితి తెచ్చిపెట్టింది.

సావిత్రి జీవితంలోని చేదు జ్ఞాపకాలను పంచుకున్న గుమ్మడి…

సావిత్రి కాల్షీట్ కోసం సినిమా షూటింగ్ నే వాయిదా వేసుకున్న రోజుల నుండి పొట్టకూటి కోసం చిన్న చిన్న వేషాలను కూడా వేసిన ఘటనల వరకూ ఆమె జీవితం ఇప్పటికీ ఎంతో మంది సినిమా వాళ్లకు గుణపాఠంగా ఉంది. అలాంటి ఆమె జీవితం గురించి మహానటి సినిమాలో ఆమె పడిన కాష్టాలను, ఆమె చేసిన గుప్త దానాలను కొంత వరకు చూపించారు. అలాంటి విషయాలనే గుమ్మడి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో సావిత్రి గారి గురించి చెబుతూ పంచుకున్నారు. సావిత్రి గారు తన చివరి రోజుల్లో ఒక రోజు గుమ్మడి గారి ఇంటికి ఆయనకు ఆరోగ్యం బాగోలేక పోతే పరామర్శించడానికి వెళ్లారట.

గుమ్మడి గారిని అన్నా అంటూ పిలిచే సావిత్రి ఆయనతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారట. చికిత్సలో భాగంగా డాక్టర్ మత్తు కలిగించే ఇంజక్షన్ చేయడం వల్ల ఏం జరిగిందో సరిగా గుర్తులేని గుమ్మడి గారు తలగడను సావిత్రి సర్ధడం గుర్తొచ్చి తలగడ కింద చూస్తే రెండు వేల రూపాయలు ఉన్నాయట వెంటనే ఫోన్ చేసి అడిగితే మీరు మర్చిపోయినట్టున్నారు నేను మీ దగ్గర తీసుకున్న డబ్బు నేను పోయే లోపు దమ్మిడి రూపాయి కూడా ఎవరికీ బాకీ పడకూడదని ఇచ్చేస్తున్నా అన్నా, నిన్ననే ఐదు వేలు అడ్వాన్స్ ఒక సినిమా కు ఇచ్చారు ఆ డబ్బు ఇస్తున్నా అంటూ చెప్పిందట.

ఆ మాటలకు గుమ్మడి గారి కళ్ళు చెమ్మగిల్లాయట. ఇక మరో చేదు అనుభవం సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలను చేసిన సావిత్రి గారు అక్కడ ప్రొడక్షన్ బాయ్స్ వల్ల కూడా అవమనాలను ఎదుర్కొన్నారట. ఒక షూటింగ్ లో భోజనం సమయంలో అందరూ భోజనం చేస్తుంటే సావిత్రి గారు ఒంటరిగా కూర్చొని ఉన్నారట. అదే సినిమాలో నటిస్తున్న గుమ్మడి గారు ఆరా తీస్తే నాకు ఆకలిగా లేదు అంటూ చెప్పారట.

చాలా మంది నటులకు ఇంటి నుండి క్యారెజీలు వచ్చేవి, మరి కొంతమంది ప్రొడక్షన్ వాళ్ళు పెట్టే భోజనం తినేవాళ్ళు కానీ సావిత్రి గారికి ఇంటి నుండి భోజనం వచ్చే పరిస్థితులు లేవు. ఇక ప్రొడక్షన్ వాళ్ళు పెట్టలేదు, ఈ విషయం అర్థమైన గుమ్మడి గారు అన్నం తిందాం రమ్మని పిలిచారట. కానీ సావిత్రి వద్దనడంతో నువ్వు వచ్చే వరకు నేను తినను అంటూ అనడంతో కన్నీళ్లు పెట్టుకుని వెళ్లి తిన్నారట. అలా ఎన్నో వేలకోట్లు, పేరు ప్రతిష్టలు సంపాదించిన సావిత్రి గారు భర్త బంధువుల మోసాల వల్ల ఆస్తులు పోయి చివరి రోజుల్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago