Tag Archives: Ram Mandir

Lavanya Tripathi : అయోధ్యలో జన్మించడం నా అదృష్టం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన లావణ్య త్రిపాఠి?

Lavanya Tripathi: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య. ఈ ముద్దుగుమ్మ మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఎట్టకేలకు ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది లావణ్య త్రిపాఠి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వరుసగా సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా ఆమె అయోధ్య గురించి ఒక ట్వీట్ కూడా చేసింది. ఇంతకీ ఆమె ఏం ట్వీట్ చేసింది. అందులో ఏముంది అన్న విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు దాదాపుగా 500 ఏళ్ళ నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరగడంతో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. దేశ ప్రజలు రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానాలు చేశారు. ఘనంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పలువురు సెలబ్రిటీలు ఆలయాలకు వెళ్లారు.

లావణ్య త్రిపాఠి కూడా అయోధ్య రామ మందిరంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది. లావణ్య అయోధ్యలో పుట్టడంతో ఆమెకు రామయ్య ఆలయంతో మరింత అటాచ్మెంట్ ఉంది. పద్దతిగా చీరలో రెడీ అయి, సీతారాముల పట్టాభిషేకం విగ్రహం ఉన్న భారీ హారం మెడలో ధరించి ఆమె ఫోటోలను షేర్ చేస్తూ రాముడి పుట్టిల్లు అయిన అయోధ్యలో నేను పుట్టడం, ఈ అద్భుతమైం కార్యక్రమాన్ని చూడటం నా అదృష్టం. రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూడటం నాతో పాటు దేశప్రజలందరికి గర్వకారణం. ఈ సందర్భంగా రామ్ పరివారాన్ని నగలుగా ధరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాణ ప్రతిష్ట వేడుక అయోధ్యకు మాత్రమే కాదు దేశం మొత్తానికి సంబంధించింది.

గుండెల్లో దైవభక్తిని నింపుకుందాం…

దేశం మొత్తం కలిసి వచ్చే సమయం ఇది. దేశంలోని ప్రజలందరి మధ్య ఐక్యత భావాన్ని నెలకొల్పుతుంది. పెదవులపై జై శ్రీరామ్ అంటూ, గుండెల్లో దైవభక్తిని నింపుకొని శాంతి దేశమంతా ఉండాలని ప్రార్ధిద్దాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో లావణ్య పోస్ట్ వైరల్ అవ్వగా లావణ్య అయోధ్యలో పుట్టిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అదృష్టవంతురాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/C2ZIwQRysKV/?utm_source=ig_web_copy_link

Prabhas – Ntr: బాల రాముడి ప్రాణప్రతిష్టకు హాజరు కాని ప్రభాస్, ఎన్టీఆర్.. కారణం అదేనా!

Prabhas – Ntr: తాజాగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ సమయం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇక నిన్నటి రోజున అయోధ్య ప్రాంగణమంతా కూడా రామనామ స్మరణలతో మారుమోగిపోయింది. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి కొలువుదీరిన తరువాత రామమందిరంతో పాటు సరయూ నదీతీరం దీపోత్సవ్ ​కార్యక్రమంతో దేదీప్యమానంగా వెలిగిపోయింది.

రామనామం మారుమోగింది. గర్భగుడిలో కొలువుతీరిన బాలరాముడిని చూసి భక్తులు పులకరించిపోతున్నారు. ఇక నిన్న జరిగిన బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరైన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టాలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ కూడా హాజరైన విషయం తెలిసిందే. వీరితోపాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు కూడా ఆహ్వానం అందింది. కానీ ఈ ఇద్దరు హీరోలు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

అయోధ్యకు రాకపోవడం కారణం అదే..

అయితే ఇద్దరు హీరోలు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి గల కారణం షూటింగ్స్ తో బిజీగా ఉండటమే అని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమాషూటింగ్ లో ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు హాజరుకాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా హీరో ప్రభాస్ అయోధ్యలోని రామ మందిరానికి దాదాపుగా 50 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

Mohan Babu : అయోధ్య నుంచి పిలుపు వచ్చింది.. భయపడి వెళ్లలేదు : మోహన్ బాబు

Mohan Babu: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రామ మందిరం ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. కనీవిని ఎరుగని రీతిలో ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇక ఈ రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, క్రీడారంగం వారు ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరు కానున్నారు.

ఇప్పటికే సెలబ్రిటీలకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు అందుకు సంబంధించిన ఆహ్వానాలు కూడా పంపారు. నేడు అనగా 21వ తేదీన కొందరు అక్కడికి చేరుకోనుండగా మరికొందరు రేపు అనగా 22వ తేదీ అక్కడికి చేరుకోనున్నారు. అయితే తనకు కూడా అయోధ్యకు ఆహ్వానం అందింది అని తెలిపారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. తాజాగా ఫిలింనగర్ లో అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్ట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు అయోధ్యకు ఆహ్వానం అందినప్పటికీ భయపడి తాను వెళ్లలేదని చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మరి ఏ విషయంలో మోహన్ బాబు భయపడ్డారు ఆయన ఏం చెప్పారు అన్న వివరాల్లోకి వెళితే.. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ఫిలిం ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. ఫిలిం నగర్‌లోని దైవ సన్నిధానం, చిత్రపురి కాలనీ వంటివి ఇచ్చింది. ఫిలిం నగర్ దైవ సన్నిధానం అద్భుతమైన దేవాలయం. ఇక్కడ అన్ని దేవతా మూర్తులు ఉన్నాయి. విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఇకపోతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు.

భయపడి వెల్లలేదు..

అయోధ్య రామాలయ ప్రారంభాన్ని ఎంతో వేడుకగా జరుపుతున్నారు. ఈ వేడుక కోసం నాకు ఆహ్వానం అందింది. సెక్యూరిటీ ఇస్తాము అన్నారు. అయినా భయపడి వెళ్లట్లేదు. కానీ ఇక్కడి దైవ సన్నిధానంలో ఈ నెల 14 నుంచి 22 వరకు అనేక పూజా కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

https://youtu.be/1UxwX8raSg4

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

మోడీ గడ్డం పెంచడం వెనుక కారణం ఏమిటో తెలుసా?

ఒకప్పుడు నీటిగా గడ్డం తీయించుకొని ఎంతో చక్కగా అందంగా కనిపించే వారు. కానీ ప్రస్తుతం గడ్డం పెంచడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.అయితే ఈ కరోనా మహమ్మారి దేశంలోకి వ్యాపించడంతో ఒక్కసారిగా అందరి జీవనశైలిలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా రాకముందు వరకు ఎంతో స్టైల్ గా వివిధ రకాల కటింగులు, షేవింగ్ లో చేయించుకొని తిరిగేవారు. కరోనా దెబ్బకు ఏదో తోచిన విధంగా షేవింగ్ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి మన ప్రధానమంత్రి సైతం గడ్డం పెంచుకోవడం అందరిలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ దాదాపు పది నెలల నుంచి క్షవరం, గడ్డం పెంచు కోవడం వల్ల అందరిలో పలు అనుమానాలు తలెత్తాయి.కరోనా మహమ్మారి సైతం ఏకంగా ప్రధానమంత్రి జీవనశైలిని కూడా మార్చేసింది అంటూ పలువురు కామెంట్లు చేశారు. దాదాపు పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ కూడా ప్రధాన మంత్రి గడ్డం పెంచడం వెనుక రామమందిర నిర్మాణం ఉందని పలువురు తెలియజేస్తున్నారు.

గత కొన్ని నెలల క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భూమిపూజ చేశారు. అదేవిధంగా ఆలయ నిర్మాణ బాధ్యతను పూర్తి చేసే క్రమంలో నరేంద్రమోడీ ఉన్నారని ఉడుపి పెజావర పీఠాధిపతి స్వామి విశ్వప్రసన్న తీర్థ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ విధమైన చారిత్రాత్మక నిర్మాణాలు చేపట్టే సమయంలో కేశాలు కత్తిరించరని పీఠాధిపతి తెలిపారు. ఈ తరహాలోనే నరేంద్రమోడీ కూడా జుట్టు, గడ్డం కత్తిరించుట పోవడానికి కారణం కూడా ఇదే కావచ్చని తాజాగా కర్ణాటకలోని బాగల్కోటెలో ఉడుపి పెజావర పీఠాధిపతి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.