Tag Archives: raviteja

Raviteja: రవితేజ నుంచి ప్రతి ఒక్కరు అది నేర్చుకోవాల్సిందే.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

Raviteja: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈయన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ కార్తీక్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ రవితేజ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రవితేజ సినిమాలలో చూడటానికి చాలా సరదాగా కనిపిస్తారు కానీ నిజ జీవితంలో అలా ఉండాలని తెలిపారు. నిజ జీవితంలో ఈయన చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని తెలిపారు .ఆయన నుంచి మనం క్రమశిక్షణ నేర్చుకోవాలని తెలిపారు. ఇక ఆయన ఫుడ్ విషయంలో కానీ నిద్ర విషయంలో కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని కార్తీక్ తెలిపారు.

సెల్ఫ్ కంట్రోలర్..

రవితేజ సెల్ఫ్ కంట్రోలర్ అంటూ ఈ సందర్భంగా రవితేజ గురించి కార్తీక్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన కావ్య థాపర్ , అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

Anupama parameswaran: డైరెక్టర్ ను అన్నయ్య అంటూ రాఖీ కట్టిన అనుపమ పరమేశ్వరన్?

Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్ పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్ దర్శకత్వంలో రవితేజ అనుపమ కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈగల్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

0

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగా యాంకర్ సుమ హీరోయిన్ అనుపమతో డైరెక్టర్ కార్తీక్ కి రాఖీ కట్టించారు.

కార్తీక్ దర్శకత్వంలో అనుపమ నాలుగు సినిమాలు చేశారు. దీంతో ఆయనతో మంచి అనుబంధం ఏర్పడిందని తనని చూడగానే నాకు అన్నయ్య అనే ఫీలింగ్ కలుగుతుందని మాట్లాడినటువంటి వీడియోని ఈమె ప్లే చేయించి మరి డైరెక్టర్ కు తన చేత రాఖీ కట్టించారు.

రాఖీ కట్టిన అనుపమ..

ఇలా కార్తీక్ అన్నయ్య అంటూ అనుపమ చెప్పడంతో రవితేజ ఇలాంటి అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే పదం వాడకూడదు అంటూ కామెంట్స్ చేశారు. ఇలా ఈ వీడియోని సుమా ప్రీ రిలీజ్ వేడుకలో వేయించి మరి రాఖీ తెప్పించి దర్శకుడికి హీరోయిన్ చేత రాఖీ కట్టించారు నేను అన్నయ్య అంటూ చాలా తక్కువ మందిని పిలుస్తాను అలాంటి వారిలో మీరు ఒకరు అంటూ రాఖీ కట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

https://www.instagram.com/reel/C27tOlRymeL/?igsh=MXB6MzUwNms4dTZlYQ%3D%3D

Raviteja:అందమైన అమ్మాయిలు ఆపదం వాడకూడదు: రవితేజ

Raviteja: రవితేజ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఫిబ్రవరి 9వ తేదీ ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఇటీవల ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . ఇంటర్వ్యూలో భాగంగా రవితేజ అనుపమ పరమేశ్వరన్ నవదీప్ అవసరాల శ్రీనివాస్ వంటి తదితరులు పాల్గొన్నారు.

తాజాగా ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ డైరెక్టర్ ను పట్టుకొని కార్తీక్ అన్నయ్య అంటూ మాట్లాడారు. దీంతో వెంటనే రవితేజ అందమైన అమ్మాయిలు బేసిగ్గా ఒక పదం వాడకూడదు. ఎప్పుడూ కూడా అన్నయ్య అనే పదం వాడకూడదని నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోమని చెప్పారు.

అన్నయ్య అని పిలవకూడదు..

తనతో కలిసి నేను నాలుగు సినిమాలు చేశాను తనతో నాకు మంచి ర్యాపో ఉంది. అందుకే అన్నయ్య అని పిలుస్తున్నాను అంటూ అనుపమ చెప్పగా వెంటనే అవసరాల శ్రీనివాస్ మేము మూడు సినిమాలు చేసి నీతో సినిమాలు చేయడం మానేస్తాను అంటూ కామెంట్స్ చేశారు. ఇలా అన్నయ్య అనే పదం వాడకూడదు అంటూ రవితేజ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Raviteja: ఆ హిట్ సినిమాకు 10 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న రవితేజ!

Raviteja: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా రవితేజ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. రవితేజ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు.

ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈయన నటించే సమయంలో చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకునేవారని తెలుస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రవితేజ ఏదైనా సినిమాలో నటిస్తే కేవలం ఈయనకు పది రూపాయలు రోజుకు రెమ్యూనరేషన్ ఇచ్చే వారట. రాజశేఖర్ హీరోగా నటించిన అల్లరి ప్రియుడు సినిమాలో ఆయన స్నేహితుడి పాత్రలో రవితేజ నటించిన రోజుకు పది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని నటించారని తెలుస్తుంది.

ఇలా అత్యంత తక్కువ రెమ్యూనరేషన్ మొదలైనటువంటి తన ప్రయాణం నేడు కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి చేరుకున్నారు. ఒకప్పుడు ₹10 రెమ్యూనరేషన్ తో తన కెరియర్ ప్రారంభించినటువంటి రవితేజ ఇప్పుడు ఒక్కో సినిమాకు 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని చెప్పాలి.

కోట్లలో రెమ్యూనరేషన్…

ఇలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా నేడు ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదని ఇదే అసలు సిసలైన సక్సెస్ అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో వరస సినిమాల ద్వారా రవితేజ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే తన సినిమాలు హిట్ అయిన ఫ్లాపైన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఈయన తగ్గడం లేదని తెలుస్తుంది. అయితే ఈయన సినిమాలు ఫ్లాప్ అయిన తనకు అదే విధంగా అవకాశాలు రావటం విశేషం.

Raviteja: హీరో రవితేజ కూడా సీరియల్లో నటించారు అనే విషయం మీకు తెలుసా… ఏ సీరియల్ అంటే?

Raviteja: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఇలా ఈయనని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. అలాంటి వారిలో మాస్ మహారాజ రవితేజ ఒకరు.

రవితేజకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించారు. అనంతరం ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా రవితేజ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా రవితేజకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. రవితేజ కేవలం హీరోగా మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్ లో కూడా నటించారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఈయన దూరదర్శన్ లో ప్రసారమవుతున్నటువంటి ఋతురాగాలు అనే సీరియల్ లో ఒక ఎపిసోడ్లో నటించారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్లో వారం రోజులపాటు పాల్గొన్నారు.

ఋతురాగాలు…

ఇలా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నందుకు ఈయనకు 5000 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక ఈ సీరియల్ లో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించగా హీరోగా నటుడు రాజీవ్ కనకాల నటించారు. ఈ సీరియల్ తర్వాత ఈయనకు వరుసగా సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి కానీ ఈయన సినిమాలలో కొనసాగాలన్న ఉద్దేశంతో మిగతా సీరియల్ అవకాశాలను రిజెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Amardeep Chowdary: రవితేజ కోసం టైటిల్ వద్దనుకున్న అమర్.. షాక్ లో అమర్ తల్లి భార్య!

Amardeep Chowdary: బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో ఘనంగా ముగిసింది ఈ కార్యక్రమం 15 వారాలను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 15వ వారంలో భాగంగా విన్నర్ ఎవరు అనే విషయంపై అందరిలోనూ ఆత్రుత ఉంది అయితే చివరికి అనుకున్న విధంగానే రైతుబిడ్డ బిగ్ బాస్ విజేతగా నిలిచారు. ఇక ఈ ఫినాలే లో భాగంగా రవితేజ వేదిక పైకి రాగానే అమర్ దీప్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇలా రవితేజ అంటే తనకు ఎంత అభిమానమో నాగార్జున తెలియజేశారు. అలాగే అమర్ కూడా రవితేజతో కాసేపు మాట్లాడారు అయితే నాగార్జున ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చారు. రవితేజ సినిమాలో నీకు నటించే అవకాశం రావాలి అంటే ఇప్పుడే గేట్స్ ఓపెన్ అవుతాయి బయటకురా అంటూ ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నాగార్జున అమర్ కు 7 సెకండ్ల టైం ఇవ్వగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గేటు వద్దకు వచ్చి నిలబడ్డారు.

ఇలా తన అభిమాన హీరో సినిమాలో నటించడం కోసం తన 15 వారాల కష్టాన్ని కూడా వదిలేసి బయటకు రావాలని నిశ్చయించుకోవడంతో ఒక్కసారిగా రవితేజ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు అయితే తన అభిమాన హీరో సినిమాలో నటించడం కోసం బయటకు వచ్చేయడానికి సిద్ధమైనటువంటి అమర్ ను చూసి తన తల్లి అలాగే భార్య ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న తేజు..

అయితే రవితేజ మాత్రం అమర్ కు మంచి ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. తన సినిమాలలో నటించడమే కాకుండా ఆయన హీరోగా తన బ్యానర్ లో ఒక సినిమాని చేయడానికి కూడా సిద్ధమయ్యారని అందుకు సంబంధించి ఇప్పటికే తనకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ చెక్ కూడా పంపించారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కార్యక్రమం ద్వారా అమర్ మంచి సక్సెస్ అందుకున్నారనే చెప్పాలి.

Amardeep: అమర్ దీప్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన రవితేజ… కోటి రూపాయలు చెక్ పంపిన మాస్ హీరో?

Amardeep: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు అమర్ దీప్ ఒకరు ఈయన బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడిగా కొనసాగుతున్నటువంటి అమర్ బిగ్ బాస్ అవకాశమందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో మొదటి నుంచి కూడా అమర్ చాలా జెన్యూన్ గా గేమ్ ఆడారు.

తనకు కోపం వచ్చినప్పుడు తన కోపాన్ని ప్రదర్శించారు సంతోషం వేసినప్పుడు అందరితో సంతోషంగా గడిపారు. ఇలా ఎలాంటి మాస్క్ లేకుండా గేమ్ ఆడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని చివరికి రన్నర్ గా మిగిలారు. ఇక అమర్ రవితేజకు బిగ్ ఫ్యాన్ అనే విషయం మనకు తెలిసిందే. ఇక వేదికపై రవితేజను చూడగానే ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాగార్జున గేట్స్ ఓపెన్ అయ్యాయి అమర్ నువ్వు ఇప్పుడే బయటకు వస్తే రవితేజ సినిమాలో నటించే అవకాశం అందుకోవచ్చు అని చెప్పడంతో క్షణం కూడా ఆలోచించకుండా బయటకు రావడానికి ప్రయత్నం చేశారు.

టైటిల్ కోసం 15 వారాలు ఎంతో కష్టపడినటువంటి అమర్ తన అభిమాన హీరో కోసం బయటకు రావడం చూసి రవితేజ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఏం మాట్లాడాలో తెలియడం లేదు అని తెలిపారు అంతేకాకుండా అమర్ కి బిగ్ ఆఫర్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. రవితేజ ప్రస్తుతం నిర్మాతగా మారి చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో తన బ్యానర్ లో తదుపరి సినిమాలో హీరోగా అమర్ ను ఎంపిక చేశారని తెలుస్తుంది.

రవితేజ బ్యానర్ లో అమర్…

రవితేజ బ్యానర్ లో అమర్ సినిమా చేయబోతున్నారు అంటే అది కేవలం మాట వరసకు మాత్రమే కాదు నిజంగానే రవితేజ అమర్ కోసం ఏకంగా కోటి రూపాయల చెక్ తన ఇంటికి కూడా పంపించారని తెలుస్తోంది. ఇలా తన అభిమాన హీరో బ్యానర్లో అమర్ నటించే అవకాశం అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Raviteja: మరోసారి రెమ్యూనరేషన్ పెంచేసిన రవితేజ… ఏకంగా అన్ని కోట్లా!

Raviteja: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మాస్ మహారాజ రవితేజ ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన రవితేజ అనంతరం హీరోగా అవకాశాలను అందుకున్నారు. ఇలా హీరోగా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి ఈయన హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.

ఇలా వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రవితేజ ఒక్కో సినిమాకు 20 నుంచి 22 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఈయన తన రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రవితేజ ప్రస్తుతం తన రెమ్యూనరేషన్ 25 కోట్లకు చేరిందని తెలుస్తోంది.

ఇలా ఒక్కసారిగా రెమ్యూనరేషన్ దాదాపు మూడు కోట్ల వరకు పెంచడంతో నిర్మాతలు కంగు తింటున్నారు.ఇలా రవితేజ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచడంతో కొన్ని సినిమాలు కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్ట లేకపోతున్నాయని బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోతున్నాయని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రవితేజ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు సైతం ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది.

Raviteja: మూడు కోట్ల రెమ్యూనరేషన్ పెంచిన రవితేజ…


ఇక గత ఏడాది చివరిలో ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న రవితేజ ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటించి మరో సక్సెస్ అందుకున్నారు. అనంతరం రావణాసుర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈయన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Chiranjeevi -Raviteja: రవితేజ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన చిరు…మొదలైన మెగా మాస్ వార్..?

Chiranjeevi -Raviteja: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని కోట్లు కొల్లగొడుతుంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఇంత మంచి హిట్ అవటానికి రవితేజ నటించిన పాత్ర కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

ఇలా సినిమా విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించిన రవితేజ గురించి ఇటీవల చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో మాస్ మహారాజా అభిమానులు చిరంజీవిపై గుర్రుగా ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే… వాల్తేరు వీరయ్య సినిమా మంచి హిట్ అవ్వటంతో ఇటీవల సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో రవితేజ హాజరు కాలేదు. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్లో రవితేజ గురించి చిరంజీవి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సినిమాలోని ఒక సన్నివేశం గురించి వివరిస్తూ గోడ మీద ఉన్న రవితేజ పోస్టర్ కి చిరంజీవి ముద్దుపెట్టిన సంగతి గురించి వెల్లడించాడు.

తమ్ముడు స్థానంలో రవితేజ పవన్ కళ్యాణ్ లాగా కనిపించాడని, అందువల్ల ఈ సీన్ చాలా అద్భుతంగా పడిందని చెప్పుకొచ్చాడు. గ్లిజరిన్ లేకుండానే ఈ సీన్లో చాలా ఎమోషనల్ అయ్యానని చిరు వెల్లడించాడు.
అయితే ఈ సినిమాలో రవితేజ పోస్టర్ కి చిరు ముద్దు పెట్టడం గురించి చెబుతూ ఒక పెద్ద హీరో ఇలా చిన్న హీరో పోస్టర్ కి ముద్దు పెట్టడం ఏంటి అని డైరెక్టర్ అడిగాడని చిరు చెప్పుకొచ్చాడు. చిరంజీవి రవితేజ గురించి మాట్లాడుతూ ఇలా చిన్న హీరో అని అనటంతో రవితేజ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Chiranjeevi -Raviteja: చిన్న హీరో అంటూ రవితేజ అవమానించిన చిరు..

చిరంజీవి లాగే రవితేజ కూడా స్వయంకృషితో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రవితేజని చిన్న చూపు చూస్తూ చిన్న హీరో అనటంతో రవితేజ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగా అభిమానులు, మాస్ మహారాజా అభిమానుల మధ్య వివాదం మొదలైంది. ఇక ఈ వివాదం ఎంతటికీ దారితీస్తుందో చూడాలి మరి.

Raviteja: ఆ పాన్ ఇండియా హీరోలకి రాడ్ దింపిన రవితేజ… కంటెంట్ ఉండాలంటూ భారీ సెటైర్స్!

Raviteja: మాస్ మహారాజ రవితేజ హిట్ ఫ్లాపాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఫస్ట్ షో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రవితేజ ఇండస్ట్రీ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే రవితేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోల పై తనదైన స్టైల్ లో సెటైర్లు వేస్తూ కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రవితేజను పాన్ ఇండియా సినిమాలపై తన అభిప్రాయాన్ని ప్రశ్నించగా ఈయన పాన్ ఇండియా సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమా అంటే సినిమాని భారీ లెవెల్ లో విడుదల చేయడం కాదు. ఇలా విడుదల చేస్తేనే పాన్ ఇండియా సినిమా అవుతుంది అనుకుంటే పొరపాటు. ఎప్పుడైతే మనం చేసే కథలో కంటెంట్ ఉంటుందో ఆ కథ పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందో అదే పాన్ ఇండియా సినిమా అవుతుందని ఈయన తెలిపారు.

Raviteja: పాన్ ఇండియా అంటే భారీ స్థాయిలో విడుదల చేయడం కాదు…

మన కథలో కంటెంట్ లేకుండా సినిమాని ఓ రేంజ్ లో భారీ స్థాయిలో విడుదల చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడతాయని తెలిపారు. ఇలా రవితేజ పాన్ ఇండియా సినిమాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో రవితేజ పరోక్షంగానే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల గురించి సెటైర్లు వేశారని కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.