Amardeep: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు అమర్ దీప్ ఒకరు ఈయన బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడిగా కొనసాగుతున్నటువంటి అమర్ బిగ్ బాస్ అవకాశమందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో మొదటి నుంచి కూడా అమర్ చాలా జెన్యూన్ గా గేమ్ ఆడారు.
తనకు కోపం వచ్చినప్పుడు తన కోపాన్ని ప్రదర్శించారు సంతోషం వేసినప్పుడు అందరితో సంతోషంగా గడిపారు. ఇలా ఎలాంటి మాస్క్ లేకుండా గేమ్ ఆడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని చివరికి రన్నర్ గా మిగిలారు. ఇక అమర్ రవితేజకు బిగ్ ఫ్యాన్ అనే విషయం మనకు తెలిసిందే. ఇక వేదికపై రవితేజను చూడగానే ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాగార్జున గేట్స్ ఓపెన్ అయ్యాయి అమర్ నువ్వు ఇప్పుడే బయటకు వస్తే రవితేజ సినిమాలో నటించే అవకాశం అందుకోవచ్చు అని చెప్పడంతో క్షణం కూడా ఆలోచించకుండా బయటకు రావడానికి ప్రయత్నం చేశారు.
టైటిల్ కోసం 15 వారాలు ఎంతో కష్టపడినటువంటి అమర్ తన అభిమాన హీరో కోసం బయటకు రావడం చూసి రవితేజ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఏం మాట్లాడాలో తెలియడం లేదు అని తెలిపారు అంతేకాకుండా అమర్ కి బిగ్ ఆఫర్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. రవితేజ ప్రస్తుతం నిర్మాతగా మారి చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో తన బ్యానర్ లో తదుపరి సినిమాలో హీరోగా అమర్ ను ఎంపిక చేశారని తెలుస్తుంది.
రవితేజ బ్యానర్ లో అమర్…
రవితేజ బ్యానర్ లో అమర్ సినిమా చేయబోతున్నారు అంటే అది కేవలం మాట వరసకు మాత్రమే కాదు నిజంగానే రవితేజ అమర్ కోసం ఏకంగా కోటి రూపాయల చెక్ తన ఇంటికి కూడా పంపించారని తెలుస్తోంది. ఇలా తన అభిమాన హీరో బ్యానర్లో అమర్ నటించే అవకాశం అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…