Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత దాదాపు దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగారు కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళ భాషలో కూడా హీరోయిన్గా వరుస అవకాశాలను అందుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి సమంత వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని తెలుస్తోంది. ఇలా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి ఈమె భయంకరమైనటువంటి మయోసైటిస్ బారిన పడ్డారు ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం సమంత పలు ప్రదేశాలకు వెళ్తూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
అయితే ఈమె ఆరోగ్యపరంగా కాస్త కోలుకున్నారని తెలుస్తుంది. దీంతో ఇండస్ట్రీలోకి రావడానికి కూడా సిద్ధమయ్యారు అయితే సమంత ఇప్పటివరకు హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగారు. ఇకపై నిర్మాతగా కూడా కొనసాగుతారని తెలుస్తోంది. ఇలా కెరియర్ పరంగా తిరిగి ఈమె బిజీ కానున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
మళ్లీ పెళ్లి చెడు పెట్టుబడి…
దీంతో ఈమె రెండో పెళ్లి గురించి కూడా ఒక నేటిజన్ ప్రశ్న వేశారు రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారా అంటూ అడగడంతో ఈమె రెండో పెళ్లి గురించి కొన్ని లెక్కలు కూడా చెప్పారు.కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అనే నివేదికని షేర్ చేసి దీని ప్రకారం మళ్ళీ పెళ్లి అనేది చెడు పెట్టుబడి అవుతుందనీ తెలిపారు. మొదటిసారి పెళ్లి చేసుకున్న వాళ్ళే 50 శాతం మంది విడిపోతున్నారు ఇక రెండో పెళ్లి చేసుకున్న వారు 65% మంది మూడో పెళ్లి చేసుకున్న వారు 70 శాతం మంది విడిపోతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే సమంత సమాధానం చూస్తే తాను రెండో పెళ్లి చేసుకున్న కూడా విడాకులే తప్పవు అంటూ కామెంట్ చేశారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…