Tag Archives: reason

Chiranjeevi -Raviteja: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య నుంచి తప్పుకున్న రవితేజ… కారణం అదేనా?

Chiranjeevi -Raviteja: ప్రస్తుతం మల్టీ స్టార్ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి.ఇలా ఇద్దరు అభిమాన హీరోలను ఒకే తెరపై చూడటానికి అభిమానులు సైతం ఇష్టపడుతున్నారు. ఇలా మల్టీస్టారర్ చిత్రాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడంతో దర్శక నిర్మాతలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఎన్నో మల్టీ స్టార్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తన 154వ చిత్రంగా బాబి దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Chiranjeevi -Raviteja: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య నుంచి తప్పుకున్న రవితేజ… కారణం అదేనా?

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన ప్రకటన వెలువలనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరొక హీరో పాత్ర ఉండబోతుందని ఆ పాత్రలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్నయ్య సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా రవితేజ మెగాస్టార్ అభిమాని కావడంతో చిరంజీవితో కలిసి నటించే అవకాశం రాగానే ఎంతో సంతోష పడుతూ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

Chiranjeevi -Raviteja: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య నుంచి తప్పుకున్న రవితేజ… కారణం అదేనా?

అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ సినిమా నుంచి రవితేజ పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా మెగాస్టార్ సినిమా నుంచి రవితేజ తప్పుకోవడానికి ఓ కారణం ఉంది.మెగాస్టార్ నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా అనుకున్న సమయానికి షూటింగ్ పనులు జరిగి ఉంటే రవితేజ ఈ సినిమాలో తప్పకుండా నటించేవారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి సినిమాలలో నటించడం వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుంది.

డేట్స్ కుదరని పక్షంలో చిరు సినిమా నుంచి తప్పుకున్నా రవితేజ..

ఈ విధంగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో మరోవైపు రవితేజ కూడా వరుస సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాలేకపోతున్నాయి.ఇలా డేట్స్ కుదరని పక్షంలో రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ఆ పాత్రలో బాబి మరొక హీరో కోసం వేట మొదలు పెట్టారని తెలుస్తోంది.మరి వీరి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎలాంటి నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది.

Actress Indraja: ఇంద్రజ పెళ్లి వెనుక ఇంత తతంగం నడిచిందా.. ఇంద్రజ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా?

Actress Indraja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న నటి ఇంద్రజ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈమె ఆలీ నటించిన యమలీల సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇకపోతే ఇంద్రజ తెలుగులో కన్నా బాలీవుడ్ ,కోలీవుడ్ చిత్రాల్లో ఎక్కువగా సందడి చేశారు. ఇంద్రజ ప్రస్తుతం చెన్నైలో స్థిరపడినప్పటికీ ఈమె కుటుంబ విషయానికి వస్తే ఇంద్రజ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.

Actress Indraja: ఇంద్రజ పెళ్లి వెనుక ఇంత తతంగం నడిచిందా.. ఇంద్రజ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా?

బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఇంద్రజ సినిమాల పై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగారు. ఇకపోతే ఈమె వివాహం మాత్రం ముస్లిం వ్యక్తితో జరగడం విశేషం. ఇంద్రజ తన భర్తకు ఉన్న కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారని అతని ద్వారా తనతో స్నేహం ఏర్పడి సుమారు ఆరు సంవత్సరాల పాటు ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉందని ఇంద్రజ తెలిపారు.

Actress Indraja: ఇంద్రజ పెళ్లి వెనుక ఇంత తతంగం నడిచిందా.. ఇంద్రజ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా?

ఇలా ఆరు సంవత్సరాల పాటు స్నేహబంధంలో ఉన్న మేము ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవడంతో మా మనసులు కలిసాయని, మా మనసులు కలవడంతో మా పెళ్లి జరిగిందని ఇంద్రజ తెలిపారు. ఆయన కూడా ఇండస్ట్రీలో రచయితగా, యాడ్ ఫిలిం మేకర్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే తమ కుటుంబానికి ఎన్నో బిజినెస్ లు ఉన్నాయని, ప్రస్తుతం ఆయన బిజినెస్ చూసుకుంటూ ఉన్నారని ఇంద్రజ తెలిపారు.

కథ నచ్చితే ఏ పాత్రలో నటించడానికైనా సిద్ధమే…

ఇకపోతే ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన ఇంద్రజ తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైతే ఈ పాత్ర మాత్రమే ఇంద్రజకు సరిపోతుందని తన వద్దకు వస్తారో అలాంటి సినిమాలలో తాను తప్పకుండా నటిస్తానని తెలిపారు. కథ నచ్చితే ఆ పాత్ర ఏదైనా సరే అమ్మ, అక్క, వదిన పాత్రలలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూనే బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.

Major Movie: ముంబై దాడులలో అంత మంది చనిపోగా.. సందీప్ కథ సినిమా చేయడానికి కారణం అదేనా?

Major Movie: క్షణం సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న అడవి శేషు ప్రస్తుతం మేజర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. 2011 నవంబర్ లో జగిగిన ముంబై దాడుల్లో సందీప్ ఉన్నికృష్ణన్ మరణించాడు. సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథని శశి కిరణ్ తిక్క తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు అనగా జూన్ 3 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.

Major Movie: ముంబై దాడులలో అంత మంది చనిపోగా.. సందీప్ కథ సినిమా చేయడానికి కారణం అదేనా?

కరోనా వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ ఇప్పుడూ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని ‘జీఏంబీ ఎంటర్ టైన్మెంట్’, ‘ఏ ప్లస్ ఎస్ మూవీస్’ తో కలిసి ‘సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా’ నిర్మించింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని హీరో అడవి శేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ సినిమా నిర్మాణంలో మహేశ్ బాబు పాత్ర ఉండటంతో ఆయన అభిమానులు కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపుతున్నారు. మేజర్ సినిమా ట్రైలర్, టీజర్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Major Movie: ముంబై దాడులలో అంత మంది చనిపోగా.. సందీప్ కథ సినిమా చేయడానికి కారణం అదేనా?

ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2011లో నవంబర్ లో ముంబై దాడుల్లో ఎంతో మంది మరణించగా కేవలం సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ మాత్రమే ఎందుకు సినిమా తెస్తున్నారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేజర్ సినిమా డైరెక్టర్ శశికిరన్ తిక్క ప్రేక్షకులలో ఉన్న అనుమానాలకు వివరణ ఇచ్చాడు. ఇటీవల ఈ విషయంపై స్పందించిన డైరక్టర్ శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సందీప్ కుటుంబం బాగా సహకరించారు…

ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఉండచ్చు. కానీ ఒక వ్యక్తి మీద కొంతమందికి ఫోకస్ ఉంటుంది. సందీప్ జీవిత కథ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అలా అని మిగిలిన వారు తక్కువ అని అనటంలేదు. మిగిలిన వారిని చూసి కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యుంటారు. వారి గురించి కూడా ఎవరో ఒకరు సినిమా తీయవచ్చు. కానీ నేను సందీప్ జీవిత కథ సినిమా తీసే సమయంలో వారి కుటుంబం కూడా ఎంతో సహకరించింది.కొన్ని సందర్భాలలో బయోపిక్స్ తీసే సమయంలో సమస్యలు అనుకోవాల్సి వస్తుంది . అంతేకాకుండా సందీప్ ఉన్నికృష్ణన్ క్యారెక్టర్ అడివి శేష్ కి బాగా నప్పింది. బయోపిక్ అనేది అందరి ఇష్టంతో సహకారంతో చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా విషయంలో అందరి అభిప్రాయాలు సేకరించి వారి సహకారంతోనే సినిమా తెరకెక్కించాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Thammareddy Bharadwaj : చిరంజీవి ఇల్లు కట్టుకుంటానంటే డబ్బులిచ్చాను… ఆయనతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే : తమ్మారెడ్డి

Thammareddy Bharadwaj: తమ్మారెడ్డి భరద్వాజ్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ గా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇలా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఈయన, కొన్ని సినిమాలలో కీలక పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ్ మెగాస్టార్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Thammareddy Bharadwaj: చిరంజీవి ఇల్లు కొట్టానంటే డబ్బులిచ్చాను… ఆయనతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే: తమ్మారెడ్డి

ప్రొడ్యూసర్ గా తన మొదటి సినిమా కోతల రాయుడు సినిమా కోసం చిరంజీవి గారు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని ఈ సందర్భంగా తమ్మారెడ్డి వెల్లడించారు .సినిమా షూటింగ్ పూర్తి అయి విడుదలయ్యే వరకు డబ్బులు ఇవ్వలేదని తరువాత డబ్బులు ఇచ్చామని, అయితే ముందే డబ్బులు ఇవ్వలేదు కనుక ఈ సినిమాకి తన రెమ్యూనరేషన్ తీసుకోలేదని చెబుతాను అంటూ ఈ సందర్భంగా తెలిపారు.

Thammareddy Bharadwaj: చిరంజీవి ఇల్లు కొట్టానంటే డబ్బులిచ్చాను… ఆయనతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే: తమ్మారెడ్డి

ఇక వీరిద్దరి కాంబినేషన్లో రెండవ చిత్రం మొగుడు కావాలి. ఈ సినిమాకి కూడా మెగాస్టార్ పెద్దగా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలిపారు. ఈ సినిమా మంచి విజయం అందుకున్నప్పటికీ ఆయన రెమ్యూనరేషన్ అడగలేదని తమ్మారెడ్డి తెలిపారు. ఈ సినిమా షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత మేమే కొంత డబ్బు ఇచ్చామని అనంతరం ఆయన ఇల్లు కొంటానంటే ఇంటి కోసం డబ్బు సహాయం చేశానని తెలిపారు.

పెద్ద బ్యానర్స్ లో చేసేవారు…

అయితే తన ఇంటికి అయ్యే ఖర్చు మొత్తం ఇవ్వలేదని ఏదో సహాయం కొద్ది తన వంతుగా కాస్త డబ్బును ఇచ్చానని ఈ సందర్భంగా తమ్మారెడ్డి వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా తరువాత మరో సారి మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు అప్పటికే మెగాస్టార్ స్టార్ హీరోగా మారిపోయారు. ఆయన చుట్టూ పెద్దపెద్ద ప్రొడ్యూసర్లు ఉండేవారు. అందుకే తనతో తరువాత సినిమాలు చేయలేకపోయానని ఈ సందర్భంగా తమ్మారెడ్డి వెల్లడించారు.

Jabardasth Comedian Apparao: కేవలం ఆ కారణంతోనే జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది: కమెడియన్ అప్పారావు

Jabardasth Comedian Apparao: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ అప్పారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ లలో అప్పారావు కూడా ఒకరు. అప్పారావు జబర్దస్త్ షో లో తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ వచ్చాడు. రోజానీ వదిన అని, నాగబాబుని బావ అని పిలుస్తూ ప్రేక్షకులను మరింత నవ్వించాడు.

Jabardasth Comedian Apparao: కేవలం ఆ కారణంతోనే జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది: కమెడియన్ అప్పారావు

ఇదిలా ఉంటే ఎప్పుడూ తన కామెడీతో ప్రేక్షకులు నవ్వించే అప్పారావు ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో అంతగా కనిపించడం లేదు. జబర్దస్త్ తో పాటుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో అప్పారావు కనిపిస్తున్నాడు. కానీ జబర్దస్త్ లో మాత్రం కనిపించడం లేదు. అయితే ఇదే విషయంపై స్పందించిన అప్పారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

Jabardasth Comedian Apparao: కేవలం ఆ కారణంతోనే జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది: కమెడియన్ అప్పారావు

ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ.. జబర్దస్త్ షోలో గత ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నానని, ఆ ఎనిమిది సంవత్సరాలలో ఎప్పుడూ కూడా షూటింగ్ కు ఆలస్యంగా రావడం కానీ లేదంటే, షూటింగ్ కి డుమ్మా కొట్టడం కానీ చేయలేదని తెలిపారు. కానీ నన్ను మాత్రం కొందరు వ్యక్తుల చెప్పుడు మాటల కారణంగా దూరంపెట్టారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో తన వయసును దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ కొంతకాలం పాటు వెయిట్ చేయమని చెప్పారని, కానీ ఆ తరువాత వాళ్లు నన్ను పిలవలేదని తెలిపాడు అప్పారావు. అంతేకాకుండా చెప్పుడు మాటలు వినీ తననీ హోల్డ్ లో పెట్టారు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు అప్పారావు.

ఎంతో అవమానించారు…

అంతేకాకుండా జబర్దస్త్ లో తాను ఉన్న సమయంలో స్కిట్ లో ప్రాధాన్యత లేని పాత్రలు కూడా చేశానని, ఒకప్పుడు టీం లీడర్ గా పనిచేసిన తనను ఆ తర్వాత కాలంలో కనీసం ఒక కంటెస్టెంట్ కు ఇచ్చిన గుర్తింపు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అలా తనని పరోక్షంగా అవమానించారని అప్పారావు బాధపడ్డాడు. అందువల్లే జబర్దస్త్ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని తెలిపాడు. అంతేకాకుండా జబర్దస్త్ షో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కనీసం ఎందుకు వెళ్తున్నారని ఒక్క మాట కూడా అడగలేదని తీవ్ర ఆవేదన చెందారు. అయితే ప్రస్తుతం మరొక కామెడీ షోలో చేస్తున్నాను. అందులో డబుల్ పేమెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం నా పరిస్థితి కూడా బాగానే ఉందని చెప్పుకొచ్చాడు అప్పారావు.

Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆర్ జె చైతూ… ఎలిమినేషన్ కు కారణం ఇదేనా?

Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం 24 గంటల పాటు ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతగానో ప్రేక్షకులను సందడి చేస్తుంది.ఇక ఇప్పటికే ఈ కార్యక్రమం మూడు వారాలు పూర్తి చేసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి చేతూ ఎలిమినేట్ అవుతారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆర్ జె చైతూ… ఎలిమినేషన్ కు కారణం ఇదేనా?

ఇలా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విధంగానే అతను ఎలిమినేట్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ మూడవ వారంలో మూడవ కంటెస్టెంట్ గా చైతూ ఎలిమినేట్ కావడంతో ప్రతి ఒక్కరు ఎంతో షాకయ్యారు. ఇక ఈయన ఎలిమినేట్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ ఎలిమినేషన్ లో ఏదో కుట్ర దాగి ఉంది అంటూ వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆర్ జె చైతూ… ఎలిమినేషన్ కు కారణం ఇదేనా?

ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చైతు ఇలా ఎలిమినేట్ కావడానికి గల కారణాలు ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు.కొబ్బరికాయలు టాస్కులో సంచాలక్‌ గా, బిందు మాధవి ప్లేట్ విసిరేసినప్పుడు తనకు మద్దతుగా చైతు నిలిచారు.అప్పటినుంచి అందరిలో చేతి పై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది మూడవ వారం ఎలిమినేట్ అయ్యాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఎలిమినేషన్ లో కుట్ర జరిగింది…

బయట ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చైతు ఈ విధంగా మూడవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రావడంతో అభిమానులు ఎంతో షాక్ అయ్యారు. ఈ విధంగా ఈయన ఎలిమినేషన్ గురించి పలురకాల కామెంట్లు వస్తున్నాయి. ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ అయితే చైతూకి ఇంత తక్కువ ఓట్లు వచ్చేవి కాదని ఈయన ఎలిమినేషన్ లో ఏదో కుట్ర దాగి ఉంది అంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు.

Sara Khan: తన దగ్గర పనిచేసే అమ్మాయితో అక్రమ సంబంధం.. విడాకుల వెనక ఉన్న గుట్టు విప్పిన సారా ఖాన్

Sara Khan: టాలీవుడ్‌లో గానీ, బాలీవుడ్‌లో గానీ అత్యంత ప్రాచుర్యం పొందిన షోలల్లో ఒకటిగా నిలిచింది బిగ్‌బాస్. అలాంటి వెరైటీ కాన్సెప్ట్‌తో వచ్చిన మరో కార్యక్రమం లాకప్. భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాలకూ, కాంట్రవర్సీలకూ బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఈ షోకు హోస్ట్‌గా నిర్వహించడం మరో ప్రత్యేకత. అయితో ఈ షో ద్వారా సెలబ్రెటీలు తమ జీవితంలో జరిగిన రహస్యాలు మరియు ఎవరికీ తెలియని పర్సనల్ విషయాలను చెప్పుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

Sara Khan: తన విడాకుల బంధం వెనక ఉన్న సీక్రెట్‌ను బట్ట బయలు చేసిన సారా ఖాన్

అయితే ఇప్పటి వరకూ చాలా మంది నటీనటులు ఈ షోలు పాల్గొని తమ సీక్రెట్ విషయాలతో ముందుకు వచ్చిన విషయం విధితమే. కాగా తాజాగా మాజీ భార్యభర్తలు కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. వీరు విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారి ఈ షోలో కలిసి పాల్గొని ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. వారే సారా ఖాన్, అలీ మర్చంట్. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట,కొంతకాలానికే మనస్ఫర్థలు వచ్చి విడిపోయారు.

Sara Khan: తన విడాకుల బంధం వెనక ఉన్న సీక్రెట్‌ను బట్ట బయలు చేసిన సారా ఖాన్

తాజాగా వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటో సారా ఖాన్ ఈ షో ద్వారా బయటపెట్టారు . ఈ జంట బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లి చేసుకొని అప్పట్లో ఓ సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన తర్వాత కూడా అలీకి వేరే అమ్మాయిలతో ఎఫైర్ ఉండేదని సారా చెప్పుకొచ్చారు. తాను అలీని చాలా ప్రేమించానని, అందుకే తనకు వేరే అమ్మాయిలకో సంబంధం ఉందని తెలిసినా ఏమీ అనలేదని ఆమె చెప్పారు.

ఆ అమ్మాయితో సంబంధం…

దాదాపు మూడున్నర సంవత్సరాల్లో 300 ఛాన్సులు ఇచ్చినా కూడా అలీ వాటిని నిలబెట్టుకోలేకపోయాడని సారా తెలిపారు. తనకు లోఖండ్‌వాలాలో ఒక స్పా ఉందని, అందులో పనిచేసే ఓ అమ్మాయితో అలీ సంబంధం పెట్టుకున్నాడని కూడా ఆమె వెల్లడించారు విడాకుల తర్వాత తాను మళ్లీ మామూలు మనిషి కావడానికి తనకు నాలుగు సంవత్సరాలు పట్టిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సారా. తాజాగా ఆమె చెప్పిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Nagarjuna-Naga Chaitanya: నాగ చైతన్య విషయంలో ఎక్కువగా బాధపడుతున్న నాగార్జున.. కారణం ఇదే..!

Nagarjuna-Naga Chaitanya: ప్రస్తుతం ఒక్క తెలుగులోనే కాదు.. మొత్తం సినిమా పరిశ్రమలోనే పాన్ ఇండియా లెవల్లో సినిమాలను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇప్పుడున్న యూత్ లో తెలుగు నుంచి ఆ రుచి చూపించిన వ్యక్తి ఎవరంటే.. దాదాపు ప్రభాస్ అనే చెప్పాలి. అతడి సినిమా బాహుబలి.. పాన్ ఇండియా లెవల్లోనే కాదు.. ప్రపంచలో కొన్ని దేశాల్లో కూడా ఆడింది.

Nagarjuna-Naga Chaitanya: నాగ చైతన్య విషయంలో ఎక్కువగా బాధపడుతున్న నాగార్జున.. కారణం ఇదే..!

అతడి దారిలోనే అల్లు అర్జున్, చరణ్, తారక్ వెళ్తున్నారు. అందులో బన్నీ పుష్ప సినిమాతో కాస్త ఆ విజయాన్ని అందుకున్నాడనే చెప్పాలి. తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్, తారక్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఇలా చేయడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి.

Nagarjuna-Naga Chaitanya: నాగ చైతన్య విషయంలో ఎక్కువగా బాధపడుతున్న నాగార్జున.. కారణం ఇదే..!

ఒక్క భాషలో నటించి.. డబ్బింగ్ చెబితే చాలు.. ఆ నటనకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా వివిధ భాషల్లో వాటిని విడుదల చేస్తున్నారు. ఇలా ఒక్క సినిమాతో చాలా భాషల్లో పాపులారిటీ సంపాదించుకోవచ్చు. దీంతో అక్కడ నుంచి మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా రెమ్యూనరేషన్ విషయంలో కూడా.. భారీగా డిమాండ్ చేయవచ్చు. ఇలా ఒక్క సినిమాతోనే ఇలాంటి లాభాలు వస్తుంటే.. హీరోలు మాత్రం ఎందుకు వద్దు అంటారు.. అందుకే తీసే సినిమాలను కూడా పాన్ ఇండియా లెవల్లో ఉండే విధంగా ప్రయత్నిస్తున్నారు.


నాగచైతన్య మాత్రం అటువైపు ఆలోచించడం..

అయితే అక్కినేని వారసుడు.. నాగచైతన్య మాత్రం అటువైపు ఆలోచించడం లేదు. ఎందుకంటే అతడు తీసిన సినిమాలే చాలా తక్కువగా ఉన్నాయి. అందులో హిట్ అయినవి కూడా చాలా తక్కువ. దీంతో అతడికి తెలుగులోనే ఎక్కువ పాపులారిటీ లేదు.. అలాంటిది మిగతా భాషల్లో ఆదరిస్తారా అనేది ప్రశ్నార్థకం.

చైతు ఇంకా యాక్టింగ్, డ్యాన్స్ పరంగా డెవలప్ అవ్వాలి.. నాగ చైతన్య కూడా నేర్చుకుంటున్నాడు. దీనిపై నాగార్జున కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నట్లు సమాచారం. కొడుకుల భవిష్యత్తు ఢీలా పడిపోతున్నాయని ఆందోళన చెందుతున్నాడట నాగార్జున. మిగతా హీరోలు పెళ్లిళ్లు చేసుకొని.. చక్కగా పాన్ఇండియా సినిమాలు చేస్తుంటే.. ఇక్కడ ఆ రెండు లేవు. అందుకే నాగార్జున తెగ ఫీల్ అవుతున్నాడట. రూ.100 కోట్ల క్లబ్ లోకి రయ్ మంటూ మిగతా హీరోలు దూసుకుపోతుంటే.. రూ.50కోట్ల క్లబ్ లోనే ఉన్నాడు చైతు. చూద్దాం ఫీచర్లో ఏం జరుగుతుందో.

Devi Nagavalli: నా భర్త చాలా మంచివాడు… విడాకులు ఇవ్వడానికి కారణం అదే…టీవీ9 దేవి నాగవల్లి షాకింగ్ కామెంట్స్!

Devi Nagavalli: టీవీ9 న్యూస్ రీడర్ గా అందరికీ హిందూ సుపరిచితమైన దేవి నాగవల్లి గురించి అందరికీ తెలిసిందే. న్యూస్ రీడర్ గా యాంకర్ గా అందరికీ సుపరిచితమైన ఈమె బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే ఈమె ముక్కుసూటితనం కారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది.

Devi Nagavalli: నా భర్త చాలా మంచివాడు… విడాకులు ఇవ్వడానికి కారణం అదే…టీవీ9 దేవి నాగవల్లి షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా జర్నలిజం అంటే ఎంతో మక్కువ వున్న దేవి నాగవల్లి అదే ఫీల్డులో ఎంతో అద్భుతంగా రాణిస్తున్న సమయంలో తన ఇంట్లో ఆమెను బలవంతం చేసి అమెరికా సంబంధం రావడంతో బలవంతంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లయిన తర్వాత తనతో పాటు అమెరికా వెళ్లి అక్కడ తన కుటుంబంతో కలపడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను.

Devi Nagavalli: నా భర్త చాలా మంచివాడు… విడాకులు ఇవ్వడానికి కారణం అదే…టీవీ9 దేవి నాగవల్లి షాకింగ్ కామెంట్స్!

ఇక పెళ్లయిన వెంటనే బాబు కూడా పుట్టాడని ఇక్కడ బయట అందరిలో కలిసి తిరుగుతూ.. ఉండి తనకు అక్కడ కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాలంటే అసలు నచ్చలేదు. మనిషి అమెరికాలో ఉన్న మనసు మాత్రం జర్నలిజం వైపు ఉండేది. అందుకే ఈ విషయాన్ని వారితో చెప్పి తిరిగి ఇండియా వచ్చేయాలని ఎన్నో సార్లు అనుకున్నాను.

నాకెంతో ఇష్టమైన జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నా…

అయితే పెళ్లి అయిన వెంటనే ఈ విషయాన్ని వారికి చెబితే ఎలా స్వాగతిస్తారు అని నాలో నేనే అధైర్య పడ్డాను. నా భర్త, ఆయన కుటుంబం చాలా మంచి వారు. ఇలా ప్రతిరోజు నాలో నేనే బాధపడుతూ ఉండగా ఒక రోజు ధైర్యం చేసి తనకు అక్కడ ఉండాలి అనిపించడంలేదు అనే విషయాన్ని తన భర్తతో చెబితే తన అభిప్రాయానికి గౌరవం ఇచ్చారు. అలా మా ఇద్దరి మధ్య మ్యూచువల్ డైవర్స్ తీసుకొని తిరిగి ఇండియాకి వచ్చానని తెలిపారు. విడాకులకు అప్లై చేసిన కేవలం ఆరు నెలల్లోనే విడాకులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకుని అమెరికాలో హ్యాపీగా సెటిల్ అయ్యాడని తెలిపారు. నేను కూడా ఇండియా వచ్చిన తర్వాత తిరిగి నాకెంతో ఇష్టమైన ఈ జర్నలిజం ఫీల్డులో స్థిరపడ్డారని తెలియజేశారు.

Noel Ex Wife: అది భరించలేకనే.. పెళ్ళైన ఆరు నెలలకే విడాకులకు తీసుకున్నా..! : ఎస్తర్

Noel Ex Wife: టాలీవుడ్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోయల్ గురించి అందరికీ తెలిసిందే ఈయన సింగర్, నటి ఎస్టర్ వాలెరీ నోరోన్హాను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె పలు కన్నడ సినిమాలలోను నటించారు అదేవిధంగా తెలుగులో భీమవరం బుల్లోడు, వెయ్యి అబద్ధాలు వంటి సినిమాలలో నటించి సందడి చేశారు.

Noel Wife: భరించలేకనే ఆరు నెల్లకే విడాకులకు అప్లై చేశా.. నోయల్ మాజీ భార్య?

ఇక ఆది సాయి కుమార్ నటించిన గరం సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లో నటించి సందడి చేసిన ఈమె సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వీరి పెళ్లి జరిగిన ఆరు నెలలకే వీరు విడాకులు తీసుకొని అందరినీ షాక్ కి గురి చేశారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చించారు.

Noel Wife: భరించలేకనే ఆరు నెల్లకే విడాకులకు అప్లై చేశా.. నోయల్ మాజీ భార్య?

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్టర్ వాలెరీ నోరోన్హా తన విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను వెల్లడించారు.నా జీవితంలో పెళ్లి చేసుకోవాలి అనుకోవడమే ఒక పెద్ద డెసిషన్ అని అయితే ఇలాంటి పెద్ద డెసిషన్ తీసుకున్న తర్వాత నా జీవితం ఇంత తొందరగా విడాకులతో ముగిసిపోతుందనీ ఎప్పుడు అనుకోలేదు అని తెలియజేశారు.

అబద్ధాలు చెప్పడం నచ్చలేదు…

అయితే పెళ్లి అయిన ఆరు నెలలకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనదేనా ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దగ్గర చెప్పడం కరెక్టా కాదా అని ఎన్నోసార్లు ఆలోచించానని ఇక చివరికి తాను తీసుకున్న నిర్ణయం మంచిదని భావించి విడాకులు తీసుకున్నానని తెలిపారు.ఇక నోయల్ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఎన్నో కారణాలు ఉన్నాయని ముఖ్యంగా నేను ఒకే ప్రశ్నను ఎన్ని సార్లు అడిగిన తన దగ్గర నుంచి ఎన్నో రకాల సమాధానాలు వస్తాయని,చివరికి నేనే తప్పుగా మాట్లాడుతున్న అనే సందేహం తనలో వస్తుందని అందుకే ఆయన అలా అబద్ధాలు చెప్పడమే విడాకులకు కారణమైందని ఈ సందర్భంగా వెల్లడించారు.ఏది ఏమైనా పెళ్లి అయిన ఆరు నెలలకే ఇలా విడాకులతో విడిపోవడం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసిందని చెప్పవచ్చు.