Actress Indraja: ఇంద్రజ పెళ్లి వెనుక ఇంత తతంగం నడిచిందా.. ఇంద్రజ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా?
Actress Indraja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న నటి ఇంద్రజ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈమె ఆలీ నటించిన యమలీల సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇకపోతే ఇంద్రజ తెలుగులో కన్నా బాలీవుడ్ ,కోలీవుడ్ చిత్రాల్లో ఎక్కువగా సందడి చేశారు. ఇంద్రజ ప్రస్తుతం చెన్నైలో స్థిరపడినప్పటికీ ఈమె కుటుంబ విషయానికి వస్తే ఇంద్రజ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఇంద్రజ సినిమాల పై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగారు. ఇకపోతే ఈమె వివాహం మాత్రం ముస్లిం వ్యక్తితో జరగడం విశేషం. ఇంద్రజ తన భర్తకు ఉన్న కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారని అతని ద్వారా తనతో స్నేహం ఏర్పడి సుమారు ఆరు సంవత్సరాల పాటు ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉందని ఇంద్రజ తెలిపారు.
ఇలా ఆరు సంవత్సరాల పాటు స్నేహబంధంలో ఉన్న మేము ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవడంతో మా మనసులు కలిసాయని, మా మనసులు కలవడంతో మా పెళ్లి జరిగిందని ఇంద్రజ తెలిపారు. ఆయన కూడా ఇండస్ట్రీలో రచయితగా, యాడ్ ఫిలిం మేకర్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే తమ కుటుంబానికి ఎన్నో బిజినెస్ లు ఉన్నాయని, ప్రస్తుతం ఆయన బిజినెస్ చూసుకుంటూ ఉన్నారని ఇంద్రజ తెలిపారు.
ఇకపోతే ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన ఇంద్రజ తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైతే ఈ పాత్ర మాత్రమే ఇంద్రజకు సరిపోతుందని తన వద్దకు వస్తారో అలాంటి సినిమాలలో తాను తప్పకుండా నటిస్తానని తెలిపారు. కథ నచ్చితే ఆ పాత్ర ఏదైనా సరే అమ్మ, అక్క, వదిన పాత్రలలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూనే బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…