Featured

Chiranjeevi -Raviteja: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య నుంచి తప్పుకున్న రవితేజ… కారణం అదేనా?

Chiranjeevi -Raviteja: ప్రస్తుతం మల్టీ స్టార్ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి.ఇలా ఇద్దరు అభిమాన హీరోలను ఒకే తెరపై చూడటానికి అభిమానులు సైతం ఇష్టపడుతున్నారు. ఇలా మల్టీస్టారర్ చిత్రాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడంతో దర్శక నిర్మాతలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఎన్నో మల్టీ స్టార్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తన 154వ చిత్రంగా బాబి దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Chiranjeevi -Raviteja: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య నుంచి తప్పుకున్న రవితేజ… కారణం అదేనా?

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన ప్రకటన వెలువలనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరొక హీరో పాత్ర ఉండబోతుందని ఆ పాత్రలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్నయ్య సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా రవితేజ మెగాస్టార్ అభిమాని కావడంతో చిరంజీవితో కలిసి నటించే అవకాశం రాగానే ఎంతో సంతోష పడుతూ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

Chiranjeevi -Raviteja: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య నుంచి తప్పుకున్న రవితేజ… కారణం అదేనా?

అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ సినిమా నుంచి రవితేజ పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా మెగాస్టార్ సినిమా నుంచి రవితేజ తప్పుకోవడానికి ఓ కారణం ఉంది.మెగాస్టార్ నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా అనుకున్న సమయానికి షూటింగ్ పనులు జరిగి ఉంటే రవితేజ ఈ సినిమాలో తప్పకుండా నటించేవారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి సినిమాలలో నటించడం వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుంది.

డేట్స్ కుదరని పక్షంలో చిరు సినిమా నుంచి తప్పుకున్నా రవితేజ..

ఈ విధంగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో మరోవైపు రవితేజ కూడా వరుస సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాలేకపోతున్నాయి.ఇలా డేట్స్ కుదరని పక్షంలో రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ఆ పాత్రలో బాబి మరొక హీరో కోసం వేట మొదలు పెట్టారని తెలుస్తోంది.మరి వీరి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎలాంటి నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago