Priya Anand : లీడర్ సినిమా ద్వారా తెలుగులో పరిచయమైన ప్రియా ఆనంద్, ఆ తరువాత రామ రామ కృష్ణ కృష్ణ, వంటి సినిమాల్లో నటించిన ప్రియా ఆనంద్ అమెరికాలో పెరిగిన అమ్మాయి. తమిళ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ప్రియ హిందీలోనూ ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి సినిమాల్లోను నటించింది. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సరసన నటించిన ఈ అమ్మడు తెలుగు, తమిళం హిందీ, కన్నడ, మలయాళం భాషలలో నటించింది.
నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలనుంది…
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు ప్రియా ఆనంద్. అయితే చాలా రోజుల తరువాత మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ ద్వారా రాబోతోంది. సుశాంత్ తో కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముంధుకు రాబోతోంది. ప్రియా ఆనంద్, సుశాంత్ పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న ప్రియా తన పెళ్ళి గురించి ఆసక్తికర వాఖ్యలు చేసింది. ఎన్నో వేల మంది భక్తులు ఉన్న నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.
నిత్యానంద.. ఈ పేరు ఒకప్పుడు బాగా ఫేమస్, తనను తాను దేవుడు అని చెప్పుకుని తన మాటలతో ఎంతో మందిని తన భక్తులుగా చేసుకున్న నిత్యానంద ఆ తరువాత హీరోయిన్ రంజిత తో చేసిన రాసలీల వీడియో బయటికి రావడంతో, ఇక అమ్మాయిల అక్రమ నిర్భంధం వంటి కేసులతో దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఈక్వెడార్ దగ్గర్లో ఒక దీవిని కొని దానికి కైలాస దేశం అని పేరు పెట్టి సొంత కరెన్సీ కూడా పెట్టుకున్న నిత్యానంద అక్కడికి వెళితే నేరుగా కైలాసం చూపిస్తానని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వింత రోగంతో బాధపడుతూ నిత్యానంద బ్రతికున్నాడో, చనిపోయాడో ఎవరికీ తెలియదు. ఇక అలాంటి నిత్యానందను పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ సరదాగా అని మళ్ళీ అందరూ మర్చిపోయిన నిత్యానందను గుర్తుచేసింది. ఇంతకీ నిత్యానందను ఎందుకు పెళ్లి చేసుకోవాలని ప్రియా అనుకుందంటే నిత్యానందను పెళ్లి చేసుకుంటే తన పేరు మార్చొకోవాల్సిన పని ఉండదు అంటూ ఫన్నీగా చెప్పింది ప్రియా.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…